Which Is Best Emergency Loan :జీవితంలో ఆర్థిక అత్యవసరం ఎప్పుడైనా రావచ్చు. అది మెడికల్ ఎమర్జెన్సీ అయినా, కార్ రిపేర్ అయినా, ఇళ్లు రెనొవేషన్ అయినా కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇంబ్బందుల నుంచి బయటపడటానికి చాలా మంది ఎమర్జెన్సీ లోన్స్ కోసం చూస్తారు. అయితే, ఎమర్జెన్సీ లోన్ తీసుకోవడానికి మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నా- అందులో సరైన, మీ పరిస్థితికి తగిన లోన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ఆర్థిక అత్యవసరాల్లో మన అవసరాలను తీర్చేవే ఎమర్జెన్సీ లోన్స్. ఇలాంటి ఎమర్జెన్సీ లోన్స్- పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు అడ్వాన్స్‌లు వంటి వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయి. మీకు ఎంత మొత్తం డబ్బులు కావాలి, ఎంత అత్యవసరం, మీరు ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారనే వాటి ఆధారంగా ఎమర్జెన్సీ లోన్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎమర్జెన్సీ లోన్స్ రకాలు?
పర్సనల్ లోన్స్ : ఆర్థిక అత్యవసరాల్లో పర్సనల్ లోన్స్ సౌకర్యంగా ఉంటాయి. త్వరగా అప్రూవల్ లంభించడం సహా డబ్బులు కూడా త్వరగా వచ్చేస్తాయి. ఇలాంటి లోన్లకు ఫిక్స్ట్ వడ్డీ రేట్లు ఉంటాయి. నెలవారీ ఈఎమ్ఐలు ఉంటాయి. దీంతో బడ్జెట్లో లోన్ చెల్లింపు ప్రాణాళిక వేసుకోవచ్చు. చాలా పర్సనల్ లోన్లకు సెక్యూరిటీ అవసరం ఉండదు. అంటే పూచీకత్తు లేకుండానే లోన్ ఇస్తారు. అయితే, మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఎంప్లాయ్మెంట్ హిస్టరీపై లోన్ అప్రూవల్ ఆదారపడి ఉంటుంది.
క్రెడిట్ కార్డులు : ఇదివరకే ఉన్న క్రెడిట్ కార్డు వాడుకోవడం ఆర్థిక అత్యవసరాలకు మరో ఆప్షన్. క్రెడిట్ కార్డులో తిరిగి చెల్లింపులు చేయడానికి ఇచ్చే బఫర్ సమయం, రుణగ్రహీతలకు సౌకర్యంగా ఉంటుంది. అయితే, పర్సనల్ లోన్స్ కంటే క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. ఇక క్యాష్ అడ్వాన్స్‌లపై ఫీజులు వసూలు చేసే అవకాశం కూడా ఉంది. మీరు ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు వాడితే, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరుగుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడవచ్చు.
ఎమర్జెన్సీ లోన్ తీసుకునే ముందు ఇవి గుర్తుంచుకోవాలి
- లోన్ అప్రూవల్ టైమ్ :ఆర్థిక అత్యవసరాల్లో లోన్ ఆమోదం వేగంగా పొందడం చాలా ముఖ్యం. కొన్ని ఎమర్జెన్సీ లోన్లు గంటల వ్యవధిలో ఆమోదం పొందుతాయి. ఇక పర్సనల్ లోన్లకు ఒకట్రెండు రోజులు సమయం పట్టొచ్చు. క్రెడిట్ కార్డు అడ్వాన్స్‌లకు తక్షణ ఆమోదం లభిస్తుంది.
- ఎమర్జెన్సీ లోన్ అర్హత :రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలు, లోన్ రకంపై ఎమర్జెన్సీ లోన్ అర్హత ఆధారపడి ఉంటుంది. సాధారణంగా క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ వంటివి ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. పర్సనల్ లోన్లకు మంచి క్రెడిట్ స్కోర్, స్థిర ఆదాయం ఉంటే సరిపోతుంది. ఇక, క్రెడిట్ కార్డు అడ్వాన్స్‌లు- మీ బకాయిలపై ఆధారపడుతుంది.
- వడ్డీ రేట్లు : పర్సనల్ లోన్స్ కంటే క్రెడిట్ కార్డులపై వడ్డీరేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉంటే మంచి వడ్డీ రేట్లు లభిస్తాయి.
- చెల్లింపు నిబంధనలు : నెలకు ఈఎమ్ఐ ఎంత కట్టాలి, లోన్ వ్యవధిని చెల్లింపు నిబంధనలు నిర్దేశిస్తాయి. పర్సనల్ లోన్ల విషయంలో ఏడాది నుంచి 5ఏళ్ల వరకు ఫిక్స్డ్ నిబంధనలు ఉంటాయి. ఇక క్రెడిట్ కార్డుల్లో తక్కువ మొత్తంలో ఈఎమ్ఐ ఉంటుంది. కానీ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. తక్కువ మొత్తం ఈఎమ్ఐలతో లోన్ చెల్లింపు వ్యవధి పెరుగుతుంది.
ఎమర్జెన్సీ లోన్స్- లాభాలు, నష్టాలు
లాభాలు :
- ఎమర్జెన్సీ లోన్స్ వల్ల త్వరగా అవసరానికి డబ్బులు చేతికి వస్తాయి.
- ఈ లోన్ల ద్వారా వచ్చిన డబ్బులను మనం మెడికల్ బిల్స్ నుంచి ఇంటి రిపేర్ వరకు దేనికైనా వినియోగించుకోవచ్చు.
- ఇలాంటి లోన్లలో చెల్లింపు నిబంధనలు, ఈఎమ్ఐ ఆప్షన్లను మీ అవసరానికి తగ్గటు ఎంచుకోవచ్చు.
నష్టాలు :
- ఎమర్జెన్సీ లోన్లు అధిక వడ్డీ రేట్లతో వస్తాయి. అందులో క్రెడిట్ కార్డు అడ్వాన్స్‌లకు వడ్డీ రేటు మరింత ఎక్కువగా ఉంటుంది.
- చాలా వరకు ఎమర్జెన్సీ లోన్లకు ఒరిజినేషన్ ఫీజు, లేట్ పేమెంట్ పెనాల్టీలు వసూలు చేస్తారు.
- ఎమర్జెన్సీ లోన్ల వల్ల మీ అప్పు పెరిగిపోతుంది. తద్వారా మీ క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం ఉంది. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంది.
బ్యాంకులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా రుణం ఇవ్వడం లేదా? ఇలా చేస్తే లోన్ గ్యారెంటీ!
హోమ్ లోన్ EMI చెల్లింపు లేట్ అయితే జరిగే పరిణామాలివే! మీ ఇంటిని కాపాడుకోవాలంటే ఇలా చేయాల్సిందే!