Credit Card Insurance Types :ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. డబ్బులు లేకపోయినా కొనుగోళ్ల కోసం ఎక్కువగా ఈ కార్డులు వాడుతున్నారు. ఆర్థిక అవసరాలకే కాకుండా క్రెడిట్ కార్డులు పలు రకాల ఇన్సూరెన్స్‌లను కూడా అందిస్తున్నాయి. వాటి కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డు హోల్డర్ కావడం వల్ల ఆటోమేటిట్గా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇంతకీ క్రెడిట్ కార్డులు అందిస్తున్న వివిధ రకాల ఇన్సూరెన్స్‌లు ఏమిటో ఈ స్టోరీలో చూద్దామా?
1.ట్రావెల్ ఇన్సూరెన్స్ :
- ట్రిప్ రద్దు : అనారోగ్యానికి గురైనప్పుడు లేదా వాతావరణం బాగాలేనప్పుడు ప్రయాణం రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది.
- ప్రయాణ ఆలస్యం : ప్రయాణం ఆలస్యమైతే వసతి, భోజనం, రవాణా వంటి ఖర్చులను కవర్ చేస్తుంది.
- లగేజీ డ్యామేజ్: ప్రయాణ సమయంలో వస్తువులను ఎవరైనా దొంగిలించినా లేదా డ్యామేజీ అయినా బీమా కవరేజీ ఉంటుంది.
- ఎమర్జెన్సీ కవర్: క్రెడిట్ కార్డు హోల్డర్స్ విదేశాల్లో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురైతే వైద్య ఖర్చులను ఈ బీమా కవర్ చేస్తుంది. అంతే కాకుండా ప్రమాదవశాత్తు గాయపడినా కూడా కవర్ చేస్తుంది.
2. పర్ఛేజ్ ప్రొటెక్షన్: క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది నిర్దిష్ట వ్యవధిలోపు (అనగా 90 నుంచి 120 రోజులు) దొంగతనానికి గురైనా లేదా ప్రమాదవశాత్తు డ్యామేజ్ అయినా ఆ ఖర్చులను ఈ బీమా కవర్ చేస్తుంది.
3.ఎక్స్టెండెడ్ వారంటీ :క్రెడిట్ కార్డు ద్వారా కొన్న వస్తువులపై ఉన్న వారంటీని ఒకటి లేదా రెండు సంవత్సరాలకు పొడిగిస్తుంది. కానీ, కొన్ని నిర్దిష్ట వస్తువులపై మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది.