How to Apply for PMEGP Scheme :భారతదేశంలోని గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(Prime Minister Employment Generation Programme - PMEGP). గతంలో ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన పథకం అనే రెండు రకాల పథకాలను కేంద్రం నిర్వహించేది. ఈ రెండు పథకాలను కలిపి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP)గా మార్చారు.
PMEGP లక్ష్యం :గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పథకాలు/ ప్రాజెక్టులు/ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి.. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యం.
రుణం వేటికి ఇస్తారు? :కొత్తగా ఏర్పాటు చేసే చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల యూనిట్ల మొదలు.. మధ్య తరహా పరిశ్రమ స్థాయి వరకు రుణం అందజేస్తారు. అయితే.. ఈ పథకంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన పాత యూనిట్ల విస్తరణకు, వాటి నవీకరణకు రుణం ఇవ్వరు. అలాగే.. నెగిటివ్ పరిశ్రమల జాబితాలో ఉన్నవాటికి ఈ పథకం వర్తించదు. ఈ పథకాన్ని 2026 వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మహిళలకు శుభవార్త : వడ్డీ లేకుండానే రూ.3 లక్షల రుణం - ఆపై సబ్సిడీ కూడా! కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్! - How to Apply for Udyogini Scheme
ఎంత రుణం పొందొచ్చు:ఈ పథకం కింద కొత్త తయారీ యూనిట్‌కు రూ. 50 లక్షల వరకు రుణం ఇస్తారు. సర్వీసు యూనిట్లకయితే 20 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు.
సబ్సిడీ:దరఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, శారీరక వైకల్యం కలిగిన వారైతే.. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టులకు గరిష్ఠంగా 35 శాతం రాయితీ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు 25 శాతం రాయితీ ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకూ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు 25 శాతం సబ్సిడీ, పట్టణాల్లో 15శాతం సబ్సిడీ కల్పిస్తారు.
PMEGP పథకానికి అర్హతలు:
- 18 సంవత్సరాల వయసు నిండిన వారంతా అర్హులే.
- కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- స్వయం సహాయక బృందాలు అర్హులు.
- ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే అర్హులు.
PMEGP దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు :
- మీ పాస్ పోర్టు సైజు ఫొటోతోపాటు పూర్తిగా నింపిన దరఖాస్తు
- మీ పెట్టబోయే యూనిట్‌కు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టు
- మీ అడ్రస్, గుర్తింపునకు సంబంధించి ఐడెంటిటీ కార్డు, అడ్రెస్ ప్రూఫ్
- పాన్ కార్డు
- ఆధార్ కార్డు
- ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన వారైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్
- కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన శిక్షణకు సంబంధించి ఎంటర్‌ప్రెన్యూవర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (EDP) వారు ఇచ్చిన సర్టిఫికెట్.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీహెచ్‌సీలకు సంబంధించిన సర్టిఫికెట్
హోం లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - Home Loan Tips
PMEGP పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?ఈ పథకం విషయంలో అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అయితే.. ప్రాజెక్టు ఏర్పాటును మాత్రం భౌతికంగా తనిఖీ చేసి పరిశీలన చేస్తారు.
- PMEGP పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://kviconline.gov.in/ క్లిక్ చేసి PMEGP పోర్టల్‌లోకి వెళ్లాలి.
- అనంతరం దరఖాస్తు ఫారాన్ని ఎంపిక చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులైతే కేవీఐసీకి, పట్టణ నిరుద్యోగులైతే డీఐసీలో వివరాలను నమోదు చేయాలి.
- అనంతరం దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకోవాలి.
- దరఖాస్తు చేసిన వెంటనే 10 నుంచి 15 రోజుల వ్యవధిలో అధికారుల నుంచి స్పందన వస్తుంది. ఆ తర్వాత నిధుల మంజూరుకు సంబంధించి పనులు ప్రారంభమవుతాయి.
- అయితే.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వెంటనే నిధులు మంజూరు చేయరు. మొదట మీరు ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించి మీకు కేంద్ర ప్రభుత్వం ఒక నెల రోజుల శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉండొచ్చు. ఈ శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. దరఖాస్తు చేసుకోకముందు కూడా ఈ శిక్షణ పూర్తి చేసుకుని తరువాత దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థులు పూర్తి వివరాలను ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - Personal Loan Expert Tips