తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.100 ఉంటే చాలు - రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేయవచ్చు - ఎలా అంటే? - How To Invest In REITs - HOW TO INVEST IN REITS

What Is A REIT And How To Invest In It : మీ దగ్గర పెద్దగా డబ్బు లేదా? కానీ రియల్ ఎస్టేట్​లో పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. REITsలో కేవలం రూ.100లతో పెట్టుబడులు పెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How many types of REITs are there?
What is a REIT?

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 3:28 PM IST

What Is A REIT And How To Invest In It :నేటి కాలంలో డబ్బులు సంపాదించడానికి అనేక పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో షేర్లు, బాండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం మొదలైనవి ఉన్నాయి. వీటితోపాటు రియల్​ ఎస్టేట్ రంగం కూడా చాలా ఆకర్షణీయమైన ఆదాయాన్ని అందిస్తుంది. కానీ దీనికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుంది.

రీట్స్​ ఇన్వెస్ట్​మెంట్​
చాలా కాలం క్రితం వరకు బాగా డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే రియల్ ఎస్టేట్​లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. చిన్న మొత్తాల్లో కూడా రియల్​ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆశ్చర్యంగా ఉందా? మీరు చదువుతున్నది నిజమే. రియల్ ఎస్టేట్​ ఇన్వెస్ట్​మెంట్​ ట్రస్టులు (రీట్స్​)లో కేవలం రూ.100తో మదుపు చేయడం ప్రారంభించవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశంలో చాలా మంది నివాస గృహాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే వాణిజ్య స్థిరాస్తి రంగంలోనూ మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల స్థలాలు, ఐటీ సంస్థలు, గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు, హబ్‌లు, నాలెడ్జ్‌ పార్కులు నేడు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేందుకు రీట్స్‌ (REITs) అవకాశం కల్పిస్తున్నాయి. దీనిని సింపుల్​గా చెప్పాలంటే, మీరు నేరుగా ఆస్తి మొత్తాన్ని కొనాల్సిన అవసరం లేదు. మీరు రీట్స్​ ద్వారా సదరు ఆస్తిలోని కొంత వాటాను మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

రీట్స్ - రకాలు
రీట్స్​లోనూ చాలా రకాలు ఉన్నాయి. ఈక్విటీ రీట్స్‌ రియల్​ ఎస్టేట్ ఆస్తుల్లో నేరుగా ఇన్వెస్ట్​ చేస్తాయి. అద్దెల రూపంలో ఆదాయాన్ని సంపాదిస్తాయి. కొన్ని రీట్స్‌ రియల్ ఎస్టేట్​ డెవలపర్లకు డబ్బులను అప్పుగా ఇచ్చి, వడ్డీ రూపంలో ఆదాయం సమకూర్చుకుంటాయి. మరికొన్ని హైబ్రిడ్‌ రీట్స్‌ ఉంటాయి. ఇవి నేరుగా వాణిజ్య స్థలాలను కొనుగోలు చేస్తాయి. అలాగే అప్పులు కూడా ఇస్తుంటాయి. కనుక మీకు అనుకూలంగా ఉన్న రీట్స్​లో నేరుగా మదుపు చేయవచ్చు.

రూ.100 ఉంటే చాలు!
మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) పర్యవేక్షణలో రీట్స్‌ పనిచేస్తాయి. కనుక రీట్స్ ఇన్వెస్ట్​మెంట్స్​కు మంచి పారదర్శకత ఉంటుంది. కనుక మీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా నేరుగా రీట్స్​ను కొనుగోలు చేయవచ్చు.

కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కూడా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్​ను అందిస్తున్నాయి. కనుక మీరు వీటి యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. కేవలం రూ.100తోనూ వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే కొన్ని ఫండ్లలో సిప్‌ చేయాలంటే రూ.1000 అవసరం అవుతుంది. మీరు కావాలనుకున్నప్పుడు ఈ యూనిట్లను అమ్ముకునే వెసులుబాటూ ఉంటుంది.

ఆదాయం ఎలా వస్తుంది?
నిబంధనల ప్రకారం, రీట్స్‌ను నిర్వహించే సంస్థలు 80 శాతం వరకు ఆదాయాన్ని ఆర్జించే ఆస్తులలోనే పెట్టుబడులు పెట్టాలి. అలాగే వచ్చిన ఆదాయంలో కనీసం 90 శాతాన్ని ప్రతి ఆరు నెలలకోసారి డివిడెండ్‌ రూపంలో పెట్టుబడిదారులకు అందించాలి. కనుక పెట్టుబడిదారులకు మంచి రాబడి వచ్చే అవకాశాలు ఉంటాయి.

అర్థం చేసుకోండి!
రీట్స్​లో మదుపు చేసే ముందు కచ్చితంగా వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా రీట్స్ నిర్వహించే సంస్థల పనితీరు గురించి, వాటి పెట్టుబడుల గురించి ఆరా తీయాలి. రీట్స్​ పోర్ట్​ఫోలియోలో మంచి గిరాకీ ఉన్న వాణిజ్య స్థలాలు ఉన్నాయో లేదో చెక్​ చేసుకోవాలి. అప్పుడే సరైన రీట్స్​ను ఎంచుకోవడానికి వీలవుతుంది.

వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి!
రీట్స్​ పెట్టుబడుల్లో చాలా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే నష్టభయం తగ్గుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అద్దెల రూపంలో ఆదాయం సంపాదించడమే రీట్స్‌ ప్రధాన లక్ష్యంగా ఉంటుంది.

డివిడెండ్
మీరు ఎంచుకోవాలని భావిస్తున్న రీట్స్‌ ఇప్పటి వరకు ఎంత మేరకు డివిడెండ్‌ రాబడిని అందించాయో చూడాలి. అలాగే మార్కెట్‌ పరిస్థితులను, ఆర్థిక వ్యవస్థ పనితీరును కూడా అంచనా వేయాలి. అవసరాన్ని బట్టి, మీ పోర్ట్​ఫోలియోలో తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలి. అప్పుడే రీట్స్‌ నుంచి మంచి లాభాలను ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది.

నష్టాలు రావచ్చు!
రీట్స్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్​లకు లోబడి ఉంటాయి. కనుక నష్టభయాలు సహజం. ముఖ్యంగా మార్కెట్లో ఒడుదొడుకులు వచ్చినప్పుడు, మీ పెట్టుబడి విలువలో హెచ్చుతగ్గులు రావచ్చు. ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోతే, మీ పెట్టుబడులపై రాబడి రాకపోవచ్చు. వీటన్నింటికీ సిద్ధంగా ఉంటేనే రీట్స్‌ను ఎంచుకోవాలి.

బెస్ట్​ సన్​రూఫ్ కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్​-5 మోడల్స్ ఇవే! - Best Sunroof Cars Under 10 Lakh

హోమ్​ లోన్ సకాలంలో చెల్లించలేకపోతున్నారా? ఇలా చేస్తే ఏ ఇబ్బందీ రాదు! - timely Home Loan EMI Repayments

ABOUT THE AUTHOR

...view details