Warren Buffett Investment Strategy :దిగ్గజ వ్యాపారవేత్త, బిలియనీర్ వారెన్ బఫెట్ అంటే తెలియనివారుండరు. ఆయనకు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ మార్కెట్ విలువ ఇటీవలే ఒక ట్రిలియన్ డాలర్లను దాటేసింది. ఈ మార్క్‌ను దాటిన మొదటి నాన్-టెక్ యూఎస్ కంపెనీగా బెర్క్‌షైర్ హాత్‌వే నిలిచింది. దీనికి ప్రధాన కారణం వారెన్ బఫెట్ వ్యాపార సూత్రాలే. మరి ఆయనలా మీరు కూడా బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం. ఆయన చెప్పిన 5 మనీ లెసన్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.
1. దీర్ఘకాలిక పెట్టుబడులు :వారెన్ బఫెట్ ప్రకారం, ఆర్థిక స్థిరత్వం ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలి. ఈ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగించాలి. అప్పుడే మీరు మంచి లాభాలు సంపాదించగలుగుతారు.
2. స్కిల్స్ నేర్చుకోవాల్సిందే : స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే చాలా నైపుణ్యం అవసరం. ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్న కంపెనీ ఫండమెంటల్స్ గురించి బాగా తెలుసుకోవాలి. భవిష్యత్‌లో మంచి వృద్ధి అవకాశాలు ఉన్న కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఇలా సింపుల్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రారంభించాలి. కానీ చాలా మంది దీనిని సంక్లిష్టంగా మార్చుకుంటారు. ఏమాత్రం పరిశోధన చేయకుండా అధిక లాభాలు ఆశించి రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని వారెన్ బఫెట్ సూచిస్తున్నారు.
3. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి :ఏదైనా కంపెనీలో లేదా స్టాక్‌లో పెట్టుబడులు పెట్టే ముందు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. దాని ఫండమెంటల్స్, టెక్నికల్స్ గురించి తెలుసుకోవాలి. లాభనష్టాల గురించి కచ్చితంగా ఆలోచించాలి. అప్పుడే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.