తెలంగాణ

telangana

వారెన్ బఫెట్‌ మరో ఘనత- 1 ట్రిలియన్ డాలర్ల మార్క్​ను దాటిన బెర్క్‌షైర్‌ హాత్‌వే - Berkshire Hathaway Portfolio

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 11:33 AM IST

Berkshire Hathaway Market Cap : ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్​కు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ అరుదైన రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ టెక్ దిగ్గజాలు మాత్రమే సాధించిన 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను ఈ కంపెనీ అందుకుంది. దీంతో టెక్నాలజీయేతర సంస్థగా రికార్డు సృష్టించింది.

Berkshire Hathaway Portfolio
Berkshire Hathaway Portfolio (Getty Images)

Berkshire Hathaway Market Cap : బిలియనీర్‌ వారెన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ అరుదైన రికార్డు సృష్టించింది. బుధవారం బెర్క్‌షైర్‌ హాత్​వే మార్కెట్‌ విలువ 1 ట్రిలియన్‌ డాలర్లను దాటేసింది. అమెరికాలో ఈ మార్క్‌ను ఇప్పటి వరకు కేవలం యాపిల్‌, ఎన్‌విడియా, మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌, మెటా వంటి టెక్‌ దిగ్గజాలు మాత్రమే దాటాయి. తాజాగా తొలిసారి ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. బెర్క్‌షైర్‌ హాత్‌వే షేరు ధర బుధవారం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలో 3.96 డాలర్లు పెరిగి, 464.59 డాలర్లకు చేరింది.

మార్కెట్​లో బుధవారం అనిశ్చితి ఉన్నప్పటికీ బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ షేర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో కంపెనీ విలువ 1 ట్రిలియన్‌ డాలర్ల మార్కును దాటింది. అమెరికాలో ఈ మార్క్‌ను ఇప్పటివరకు కేవలం టెక్‌ దిగ్గజ సంస్థలు మాత్రమే దాటాయి. తాజాగా తొలిసారి ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. బుధవారం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలో దీని షేరు ధర 3.96 డాలర్లు పెరిగి, 464.59 డాలర్లకు చేరింది. అమెరికాలో ఇప్పటికే ట్రిలియన్‌ డాలర్లు దాటిన కంపెనీల జాబితాలో యాపిల్‌, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌, మెటా వంటి టెక్‌ దిగ్గజాలు మాత్రమే ఈ ఘనత అందుకున్నాయి. అయితే, ఈ ఏడాది బెర్క్‌షైర్‌ హాత్‌వే సంస్థ వేగంగా వృద్ధి చెందింది. కేవలం 2024లోనే దీని షేరు విలువ 30శాతం మేర పెరిగింది.

ప్రముఖ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ బెర్క్‌షైర్‌ హాత్​వేను వృద్ధి చేయడంలో కొన్ని దశాబ్దాలు శ్రమించారు. తొలుత వస్త్ర తయారీ పరిశ్రమగా మొదలైన ఈ సంస్థ ఆ తర్వాత మెల్లగా వివిధ రంగాల్లోకి అడుగుపెట్టింది. ఈ కంపెనీ 1965 నుంచి ఏటా 20 శాతం స్థిరంగా వృద్ధి సాధించింది. ఎస్‌అండ్‌పీ- 500 రాబడితో పోలిస్తే ఈ సంస్థది దాదాపు రెట్టింపు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు నమ్ముతాయి. ఈ ఏడాది అమెరికా ఆర్థికవ్యవస్థ మెరుగ్గా ఉంటుందని అంచనాలు రావడ వల్ల బెర్క్‌షైర్‌ హాత్‌వే షేరు దూకుడుగా ఉంది. ఈ సంస్థ నగదు రిజర్వు రెండో ద్వైమాసికానికి 276 బిలియన్‌ డాలర్లుగా నిలిచింది. ముఖ్యంగా యాపిల్‌లో తమ స్టాక్‌ను విక్రయించడం ద్వారా ఈ ఏడాది భారీగా ఆదాయాన్ని సమకూర్చుకొంది.

ABOUT THE AUTHOR

...view details