తెలంగాణ

telangana

ETV Bharat / business

అదిరే ఫీచర్లతో బెస్ట్ 7సీటర్​ ఫ్యామిలీ కార్స్​- త్వరలో లాంఛ్​ అయ్యే టాప్​ SUVలు ఇవే! - Upcoming 7 Seater Cars In India - UPCOMING 7 SEATER CARS IN INDIA

Upcoming 7 Seater Cars In India : ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేసేందుకు మంచి 7సీటర్ కారు కొనాలనుకుంటున్నారా? ఏ మోడల్ కొనుగోలు చేయాలో తెలియక తికమకపడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి రాబోయే టాప్​ 7సీటర్ కార్లు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Upcoming 7 Seater Cars In India
Upcoming 7 Seater Cars In India (GettyImages)

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 5:29 PM IST

Upcoming 7 Seater Cars In India :ప్రస్తుతం కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలన్నా, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్నా కారు ఉండాల్సిందే. అయితే 7సీటర్ కారైతే ఇంటిల్లిపాది సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. ఈ క్రమంలో 7సీటర్ సామర్థ్యంతో మరికొన్ని నెలల్లో మార్కెట్లోకి కొన్ని కార్లు మార్కెట్​లో విడుదల కానున్నాయి. అందులో టాప్-5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. MG Gloster Facelift : మరికొద్ది నెలల్లో 7సీట్ల సామర్థ్యంతో ఎమ్​జీ గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కారు మార్కెట్లోకి రానుంది. ఈ కారును లాంఛ్ చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌ లిఫ్ట్‌ లో ఇంజిన్ కాకుండా ఇతర మార్పులు చాలా ఉండవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో మార్కెట్​లో అగ్రశ్రేణి ఎస్‌యూవీగా ఉన్న టొయోటా ఫార్చ్యూనర్​కు ఈ కారు గట్టి పోటీ ఇవ్వవచ్చని అంచనా. ఎమ్​జీ గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్ మోడల్​లో ఇంటీరియర్​, ఎక్స్​టీరియర్​ను అప్​గ్రేడ్ చేయవచ్చని తెలుస్తోంది.

2. New Kia Carnival :మరికొద్ది నెలల్లో ఫోర్త్ జనరేషన్ కియా కార్నివాల్ మోడల్ కారు భారత విపణిలోకి రానుంది. గత మోడల్ కంటే ఇది భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. న్యూ కియా కార్నివాల్ మోడల్ కారు కేబిన్ ఉన్నత స్థాయి ప్రమాణాలతో రూపొందించినట్లు సమాచారం. 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్​తో ఈ మోడల్ కారు రానున్నట్లు తెలుస్తోంది. 7సీటర్ సామర్థ్యంతో ఈ మోడల్ కారు మార్కెట్లోకి రానుంది.

3. Nissan X-Trail : నిస్సాన్ ఎక్స్ ట్రైల్ మోడల్ కారు మరో రెండు నెలల్లో భారత మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్​ను కలిగి ఉండనుందని భావిస్తున్నారు. పరిమిత సంఖ్యలో ఈ మోడల్ కార్లు మార్కెట్లోకి దింపనున్నట్లు సమాచారం. 7 సీట్ల సామర్థ్యంతో ఈ కారు మార్కెట్లోకి రానుంది.

4. Kia EV9 : కియా ఈవీ-9 ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో లాంఛ్ కావొచ్చు. ఈ 7సీటర్ కారు, 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లే, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ కన్సోల్, పనోరమిక్ సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 541 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సమాచారం.

5. Jeep Meridian Facelift : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జీప్​​, తమ మెరిడియన్​ కారుకి ఫేస్ లిఫ్ట్ వెర్షన్​ను విడుదల చేయనున్నట్లు సమాచారం. 7 సీట్ల సామర్థ్యంతో ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానుంది. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, మంచి ఇంటీరియర్​ను కలిగి ఉంటుంది. కొత్త గ్రిల్, ఫ్రంట్, రియర్ బంపర్లు, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్​తో ఈ మోడల్ కారు మార్కెట్లోకి రానుంది.

అదిరే ఫీచర్స్​తో న్యూ-జెన్ మారుతి​ కార్లు! CNG, ఎలక్ట్రిక్ ఆప్షన్లతో త్వరలో లాంఛ్ కానున్న మోడల్స్​​ ఇవే! - Upcoming New Gen Maruti Suzuki Cars

చైల్డ్& అడల్ట్ సేఫ్టీలో 'టాటా' అదుర్స్- 5 స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఏవంటే? - 5 Star Rating Tata Cars

ABOUT THE AUTHOR

...view details