తెలంగాణ

telangana

బడ్జెట్ బంపర్ ఆఫర్ - ఇకపై ఈ వస్తువుల ధరలు భారీగా తగ్గబోతున్నాయ్! - అవేంటో చూడండి - Union Budget 2024 Update

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 1:47 PM IST

Union Budget 2024-25 Update : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం.. పలు వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. మరి.. అవేంటి? ఎంత శాతం మేర తగ్గబోతున్నాయి? అన్నది చూద్దాం.

Goods Thats Will Be Cheaper After Union Budget 2024
Union Budget 2024-25 Update (ETV Bharat)

Goods That Will Be Cheaper After Union Budget 2024 : కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్​లో(Union Budget 2024-25)పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ.. దేశీయ తయారీని ప్రోత్సహించేలా పలు వస్తువులపై భారీగా కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రిటైల్ మార్కెట్​లో ఎలక్ట్రానిక్‌, విలువైన లోహాలు, కీలక ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ధరలు తగ్గనున్న వస్తువులివే..!

మొబైల్ ఫోన్లు :మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు(పీసీబీఏ), మొబైల్‌ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 20శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీంతో కస్టమర్లకు స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గబోతున్నాయి. గత ఆరేళ్లలో మొబైల్ ఫోన్ల దేశీయ ఉత్పత్తి, ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్‌ ఔషధాల ధరలు తగ్గింపు :క్యాన్సర్‌ రోగులకు ఊరటనిచ్చేందుకు వీలుగా.. ట్రీట్​మెంట్​కు వాడే మూడు రకాల క్యాన్సర్‌ ఔషధాలు (Trastuzumab Deruxtecan, Osimertinib, Durvalumab)పై కస్టమ్స్‌ డ్యూటీని పూర్తిగా తొలగించారు. దీంతో ఆయా డ్రగ్స్​ రేట్లు భారీగా తగ్గనున్నాయి.

బంగారం, వెండి :వీటిపై కస్టమ్స్‌ సుంకాన్ని 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్​లో ప్రతిపాదించారు. ఫలితంగా రిటైల్‌ డిమాండ్‌ పెరుగుతుందని, తద్వారా.. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ప్లాటినమ్​పై సుంకం భారీగా తగ్గింపు : బంగారం, వెండితో పాటు ప్లాటినమ్, పల్లాడియం, ఓస్మియుమ్‌, రుథేనియం, ఇరీడియంపై 15.4 శాతం నుంచి 6.4 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు.

సోలార్‌ ఎనర్జీ భాగాలు : సౌర విద్యుత్‌ సంబంధిత భాగాలపై కస్టమ్స్‌ను పొడిగించకూడదని కేంద్ర ప్రభుత్వం నిన్నటి బడ్జెట్​లో ప్రతిపాదించింది.

గుడ్ న్యూస్​ - ముద్ర లోన్ లిమిట్ రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు!

సీ ఫుడ్‌ :బ్రూడ్‌స్టాక్స్‌, పాలీచాట్స్‌ వార్మ్‌, రొయ్యలు, చేపల మేతపై బేసిక్‌ కస్టమ్స్ డ్యూటీని 5%కి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఫుట్‌వేర్‌ :లెదర్‌, ఫుట్‌వేర్‌పై కస్టమ్స్‌ సుంకం తగ్గించడంతో పాటు ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌ వంటి మినరల్స్‌పై బేసిక్స్‌ కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు బడ్జెట్​లో ప్రకటించారు.

మెడికల్ పరికరాలు : మెడికల్, సర్జికల్‌, డెంటల్‌ ఎక్స్-రే యంత్రాల తయారీకి వినియోగించే ఎక్స్‌రే ట్యూబ్‌లు, ఫ్లాట్‌ ప్యానెల్‌ డిటెక్టర్లపై 15శాతం నుంచి 5 శాతానికి బీసీడీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆ ఖనిజాలపై భారీ తగ్గింపు : అణు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్షం, రక్షణ, టెలికమ్యూనికేషన్స్, హైటెక్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో కీలకైన లిథియం, నికెల్, కాపర్, కోబాల్ట్, నికెల్ కాథోడ్ వంటి 25 అరుదైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా మినహాయింపు లేదా తగ్గింపునకు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

ధరలు పెరగనున్న వస్తువులివే..!

టెలికం పరికరాలు :మదర్‌బోర్డులు వంటి టెలికాం పరికరాలపై 5శాతం దిగుమతి సుంకాన్ని పెంచాలని కేంద్రం బడ్జెట్‌లో నిర్ణయించారు. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.

దిగుమతి చేసుకున్న లేబోరేటరీల్లో వాడే కెమికల్స్​, గార్డెన్ అంబరిల్లాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ (BCD) పెంచడంతో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

అమ్మోనియం నైట్రేట్‌, నాన్‌ బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌పై కస్టమ్స్‌ డ్యూటీని 10శాతానికి పెంచారు. దీంతో ఆయా వస్తువుల రేట్లు మరింత ప్రియం కానున్నాయి.

ఫ్లెక్స్ ఫిల్మ్‌లు :పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) ఫ్లెక్స్ ఫిల్మ్‌లపై బీసీడీని పెంచారు. ఫ్లెక్స్ బ్యానర్లు, ఫ్లెక్స్ షీట్లతో పర్యావరణం, ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నందున వీటిపై 10%గా ఉన్న సుంకాన్ని 25 శాతానికి పెంచుతన్నట్లు బడ్జెట్​లో ప్రతిపాదించారు.

ఆదాయ పన్ను రేట్లలో కీలక మార్పు- స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలకు పెంపు!

ABOUT THE AUTHOR

...view details