ETV Bharat / state

హైదరాబాద్​​ను ప్రపంచ ఫార్మా కంపెనీల క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీధర్‌బాబు - Minister Sridhar Babu Meet - MINISTER SRIDHAR BABU MEET

Genome Valley Hyderabad : హైదరాబాద్ జీనోమ్‌ వ్యాలీకి మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా ఫార్మా కంపెనీలకు ప్రోత్సాహకాలు, సకల వసతులు కల్పిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇవాళ జీనోమ్‌ వ్యాలీలో పెట్టుబడుల విస్తరణపై వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు.

Hyderabad Pharma City
Genome Valley Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 7:43 PM IST

Hyderabad Pharma City : హైదరాబాద్​ బ్రాండ్​ను ప్రపంచంలోనే ఫార్మా కంపెనీల క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ జీనోమ్ వ్యాలీలో ఫార్మా పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ ఇమేజ్‌ అభివృద్ధికి గడిచిన 30, 40 సంవత్సరాలుగా కృషి చేస్తున్న ఫార్మా పరిశ్రమలకు మరింతగా ప్రోత్సాహం, సకల వసతులను కల్పిస్తూ మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తున్నామని తెలిపారు.

భారీ పెట్టుబడులు : త్వరలో హైదరాబాద్‌లో ప్రముఖ ఫార్మా పరిశ్రమలైన లారస్ ల్యాబ్స్, కర్క ల్యాబ్స్ జాయింట్‌ వెంచర్‌గా సుమారు 300 ఎకరాల్లో రూ,2 వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వీటి ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ ఫార్మా దృష్టిని మళ్లీంచడానికి జినోమ్ వ్యాలీకి ఆకర్షించేందుకు అత్యంత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వివిధ దశలలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ను ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంలా తయారు చేసి ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అందుకే ఇవాళ జీనోమ్ వ్యాలీలోని వివిధ ఫార్మా కంపెనీల దిగ్గజాలతో మరిన్ని పెట్టుబడులు రాబట్టే విషయమై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాశ్‌ రెడ్డి, ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు, ఆయా ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

"హైదరాబాద్​ బ్రాండ్​ను ప్రపంచంలోనే ఒక ఫార్మా కంపెనీల క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతాము. హైదరాబాద్‌ ఇమేజ్‌ అభివృద్ధికి గడిచిన 30, 40 సంవత్సరాలుగా కృషి చేస్తున్న ఫార్మా పరిశ్రమలకు మరింతగా ప్రోత్సాహం, సకల వసతులను కల్పిస్తాము. త్వరలో లారస్ ల్యాబ్స్, కర్క ల్యాబ్స్ జాయింట్‌ వెంచర్‌గా సుమారు 300 ఎకరాల్లో రూ.2 వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇవాళ వివిధ ఫార్మా కంపెనీల దిగ్గజాలతో మరిన్ని పెట్టుబడులు రాబట్టే విషయమై చర్చించాము. - శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి.

హైదరాబాద్​ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి : శ్రీధర్ బాబు - Sridhar Babu Fires On BRS

ఏఐ సిటీకి ప్రపంచ వాణిజ్య కేంద్రం రాక - రాష్ట్ర ప్రభుత్వంతో డబ్ల్యూటీసీఏ ఒప్పందం - AI Global Summit in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.