ETV Bharat / state

"తెలంగాణ ప్రజాపాలన దేనికోసం - ఎవరికి భయపడి విమోచన దినోత్సవం పేరు మార్పు" - Bandi Sanjay Respond To Govt Letter

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 8:47 PM IST

Union Minister Bandi Sanjay On Liberation Day : ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి బండిసంజయ్ ప్రశ్నించారు. పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని, నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. పేరుమార్చడం వల్లే ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావట్లేదని బండి సంజయ్‌ తెలిపారు.

Union Minister Bandi Sanjay Respond To Govt Letter Over Liberation Day
Union Minister Bandi Sanjay On Liberation Day (ETV Bharat)

Union Minister Bandi Sanjay Respond To Govt Letter Over Liberation Day : తెలంగాణ ప్రజాపాలన దేనికోసం, ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడం లేదని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని, నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదన్నారు.

కాంగ్రెస్​కు చేతనైతే తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా తానే హాజరవుతా అన్నారు. వారికి చేతకాకుంటే కేంద్రం పరేడ్ గ్రౌండ్​లో అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్​లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

నిన్నటివరకూ హైడ్రా - నేడేమో విగ్రహాల పేరిట కొత్త నాటకానికి తెర : సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కాంగ్రెస్ రాజకీయ డ్రామాలకు నిదర్శనమని ఆరోపించారు. దమ్ముంటే ఆరు గ్యారంటీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని లోపాయికారీ ఒప్పందాలతోనే కాలం వెల్లదీస్తున్నాయని ఆరోపించారు. కావాలనే హైడ్రా, విగ్రహాల పేరిట రోజుకో లొల్లి పెట్టుకొని, ఆరు గ్యారంటీలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంపై ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఖాళీగానే ఉంది కదా, ఆయన కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆ పదవి ఇస్తారేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లిక్కర్​ స్కాం కేసులో ఇరు కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉందని ఎద్దేవా చేశారు.

"రెండూ పార్టీలు కలిసి రాష్ట్రంలో డ్రామాలకు తెరలేపాయి. ఎందుకంటే వీళ్ల ఫోన్​ ట్యాపింగ్​ కేసు వాళ్లు చేతుల్లో ఉంది, వీళ్ల ఓటుకు నోటు కేసు వారి దగ్గర ఉంది. అందుకని ఇరువురు ఏకమై, ఒప్పందంతో ముందుకు వెళ్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆరు గ్యారంటీలను పక్కదోవ పట్టిస్తూ హైడ్రా, విగ్రహాల లొల్లిలు తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపించాలి."-బండి సంజయ్​, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

BJP MP Etela Rajender On Parade Ground Works : సికింద్రాబాద్, మంగళవారం పరేడ్ మైదానంలో జరగబోయే తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మల్కాజ్​గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ తెలిపారు. బీజేపీ నాయకులతో కలిసి ఈటల పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం నిజం పరిపాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం అమరులైన పోరాట యోధుల ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్వాతంత్రం కోసం అమరులైన పోరాట యోధుల చరిత్రను ఈ జాతి ఎన్నటికీ మరువదని సంతకాల సేకరణ పట్టికలో లిఖించారు. ఎంతోమంది పోరాట యోధుల మూలంగానే నిజాం రజాకారుల నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగిందని, అందుకనే బీజేపీ విమోచన దినోత్సవం జరుపుతుందని అన్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు పరేడ్ మైదానంలో తెలంగాణ విమోచన దినోత్సవాలు ప్రారంభం కానున్నాయని ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్టు తెలిపారు. తెలంగాణ విమోచన దినం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం వారి అసమర్ధతను తెలియజేస్తుందని అన్నారు.

'కేంద్రం నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు సీఎం రాననడం విచారకరం' - BJP mp Laxman on Tg Liberation Day

టార్గెట్​ రీచ్​ కాకపోతే పదవులు ఊడతాయ్ - పార్టీ సభ్యత్వంపై బీజేపీ శ్రేణులకు వార్నింగ్​ - Abhay Patil Warning to BJP Cadre

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.