ETV Bharat / state

నిమజ్జనాలకు అంతా సెట్ : 25 వేల మంది పోలీసులతో బందోబస్తు - ఆ మార్గాల్లో ట్రాఫిక్​ మళ్లింపులు - Traffic Restrictions for Immersion - TRAFFIC RESTRICTIONS FOR IMMERSION

Traffic Restrictions in Hyderabad : నగరంలో వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం బందోబస్తు కోసం 25 వేల మంది పోలీసులను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. గణేశ్ నిమజ్జనం శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనదారులకు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ పోలీసులు అంక్షలను విధించారు.

Ganesh Immersion Routes In Hyderabad
Traffic Restrictions in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 7:31 PM IST

Updated : Sep 16, 2024, 7:38 PM IST

Ganesh Immersion Routes In Hyderabad : నగరంలోని బొజ్జ గణపయ్య నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు గణేశ్​ నిమజ్జనం శోభాయాత్ర రూట్​ మ్యాప్​ ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్​ ఏసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. రెండు రోజుల పాటు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో బందోబస్తు కోసం 25 వేల మంది పోలీసులను సిద్ధం చేశారు. ఏర్పాట్లపై కసరత్తు చేసిన పోలీసులు, కేవలం హుస్సేన్​సాగర్​ చుట్టూ 3 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ పోలీసులు అంక్షలను విధించారు. హైదరాబాద్‌లో 64 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్ తెలిపారు.

బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగే ప్రధాన గణేశ్​ నిమజ్జనం శోభాయాత్ర రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతించమని పోలీసులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాలను సోమవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్​లోకి అనుమతి లేదని అధికారులు తెలిపారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు ఓఆర్‌ఆర్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌ పాతబస్తీలో కేశవగిరి, మహబూబ్​నగర్ చౌరస్తా, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘల్ పురా, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దారుల్ షిఫా చౌరస్తా, సిటీ కాలేజి వద్ద వాహనాలను మళ్లిస్తామని తెలిపారు.

ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు : గణేశ్ నిమజ్జన సమయంలో పలు ప్రాంతాల్లో ఆర్టీసి బస్సులకు ఆంక్షలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులను మాసబ్ ట్యాంక్ వద్ద నిలిపివేస్తారు. కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు ఖైరతాబాద్ వద్ద, సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులు సీటీఓ ప్లాజా, ఎస్‌బీహెచ్‌, క్లాక్ టవర్, చిలకలగూడ క్రాస్‌ రోడ్ వరకు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తారు. గడ్డి అన్నారం, చాదర్ఘాట్ వైపు వచ్చే వాహనాలు దిల్​సుఖ్​నగర్ వద్ద, మిధాని, ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు ఐఎస్‌ సదన్ వద్ద, ఇంటర్ సిటీ స్పెషల్ బస్సులు వైపీఎంఏ నారాయణ గూడ వద్ద నిలిపివేస్తామని పోలీసులు వివరించారు.

ఎంజీబీఎస్‌ నుంచి అంతరాష్ట్రతోపాటు వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులకు కోసం ప్రత్యేక రూట్ మ్యాప్​ను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. రాజీవ్ రహదారి నుంచి వచ్చే వాహనాలను జేబీఎస్‌, సంగీత్, తార్నాక, విద్యానగర్ టీ జంక్షన్‌, ఫివర్ ఆస్పత్రి, బర్కత్ పూర్, నింబోలి అడ్డా మీదుగా ఎంజీబీఎస్‌కు వెళ్లాలని పోలీసులు సూచించారు. బెంగళూరు వైపు నుంచి వచ్చే వాహనాలతోపాటు ముంబై ఎన్‌హెచ్‌ 9 నుంచి వచ్చే వాహనాలు వై జంక్షన్ బోయిన్​పల్లి వైసీఎంఏ సంగీత్, తార్నాక, విద్యానగర్ టీ జంక్షన్‌, ఫివర్ ఆస్పత్రి, బర్కత్​పూర్ నింబోలి అడ్డా మీదుగా ఎంజీబీఎస్‌ వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.

గణేశ్​ శోభాయాత్రలో కలిసే రహదారులు : ప్రధాన శోభాయాత్ర బాలాపూర్‌ కట్టమైసమ్మ టెంపుల్, కేశవగిరి, చాంద్రయణగుట్ట, మహబూబ్​నగర్ ఎక్స్ రోడ్‌, ఆలియాబాద్, నాగుల్‌చింత, చార్మినార్, మదినా, ఎంజే మార్కెట్‌, అబిడ్స్, లిబర్టి, అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ మార్గ్​లో కలుస్తుందని అధికారులు తెలిపారు. సికింద్రబాద్ నుంచి వచ్చే గణేశ్​ విగ్రహాలు సంగీత్, ప్యాట్ని, పారడైజ్, ఎంజీ రోడ్, రాణిగంజ్‌, కర్బాలామైదానం, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వస్తాయని చెప్పారు.

ఈస్ట్ జోన్ నుంచి వచ్చే విగ్రహాలు రామాంతపూర్, తిలక్ నగర్, శివం రోడ్‌, విద్యానగర్ టీ జంక్షన్, నారాయణ గూడ మీదుగా ఆర్టీసీ క్రాస్​రోడ్ వైపు వచ్చే శోభాయాత్రలో కలుస్తాయని అధికారులు తెలిపారు. టోలి చౌకి, రేతి బౌలి, మెహిదీపట్నం నుంచి వచ్చే గణేశ్​ విగ్రహాలను మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్‌, ద్వారకా హోటల్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్తాయని చెప్పారు. ఎస్‌ఆర్ నగర్, అమీర్​పేట్​, పంజాగుట్ట నుంచి వచ్చే విగ్రహాలను మెహదీపట్నం వైపు నుంచి వచ్చి శోభాయాత్రలో కలుస్తాయని వివరించారు.

ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్లు : మరోవైపు నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్సపోర్టు వినియోగిస్తే నిమజ్జనం ప్రశాంతంగా వీక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఎలాంటి అసౌర్యం కలగుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిమజ్జనం వచ్చే వారు, వీక్షించేందు వచ్చే ప్రజలు ఎలాంటి అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్లు 9010203626, 8712660600, 040-27852482కి ఫోన్ చేయొచ్చని పోలీసులు తెలిపారు.

వాహనదారులకు అలర్ట్ - ట్యాంక్‌బండ్‌పై 20 నిమిషాల ప్రయాణానికి గంట సమయం - TANK BUND TRAFFIC IN HYDERABAD

Last Updated : Sep 16, 2024, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.