ETV Bharat / entertainment

ఆ బ్లాక్ బస్టర్​ బాలీవుడ్ యాక్షన్​ మూవీలో విలన్​గా సూర్య! - నిజమెంత? - Suirya As Villian Bollywood Movie - SUIRYA AS VILLIAN BOLLYWOOD MOVIE

Suirya As Villian In Bollywood Movie : ఓ బ్లాక్ బస్టర్​ బాలీవుడ్ యాక్షన్​ మూవీలో కోలీవుడ్ హీరో సూర్య విలన్​గా నటించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. అందులో నిజమెంతో తెలుసుకుందాం..

ETV Bharat
Suirya (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 8:48 PM IST

Suirya As Villian In Bollywood Movie : బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ ధూమ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2004లో తెరకెక్కిన ధూమ్ సినిమా అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్​గా వచ్చిన ధూమ్-2, 3 సినిమాలు కూడా బాక్సాఫీస్​ రికార్డులను బ్రేక్ చేశాయి. అయితే తాజాగా ధూమ్ సీక్వెల్​లో మరో చిత్రాన్ని తెరకెక్కించున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారనే వార్తలు కూడా తెగ వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో వాస్తమెంత?

Suirya As Villian Dhoom 4 : ధూమ్-4చిత్రంలో ప్రతినాయకుడిగా నటించడానికి మేకర్స్ హీరో సూర్యను సంప్రదించారని, ప్రస్తుతం వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని కొద్ది రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. 24, విక్రమ్ సినిమాల్లో సూర్య నెగటివ్ రోల్​లో కనిపించి మెప్పించడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయితే తాజా నివేదిక ప్రకారం ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదట. నటుడు సూర్య ప్రస్తుతం తన 44వ చిత్రాన్ని తెరకక్కించే పనిలో ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించనున్నారు. ఇదే కాకుండా శివ దర్శకత్వంలో సూర్య నటించిన కంగువ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

వాస్తవానికి ఈ వార్త ఇటు సూర్య ఫ్యాన్స్​కు అటు ధూమ్ ఫ్రాంఛైజీ ఫ్యాన్స్​కు నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి. ఇప్పటివరకూ తన యాక్టింగ్ స్టైల్​తో కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ హీరో ధూమ్-4తో బాలీవుడ్​లోనూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అది జరిగే అవకాశం లేదని తెలిసింది.

కాగా, యశ్​ రాజ్ ఫిల్మ్ బ్యానర్​లో రాబోతున్న ధూమ్-4 చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు మొదటి మూడు సినిమాలకు కథను అందించిన ఆదిత్య చోప్రానే నాల్గొవ భాగానికి కూడా కథను అందిస్తున్నారట. ఆదిత్య చోప్రా, అయాన్ ముఖర్జీలు ఈ సీక్వెల్​ను ఇప్పటి తరానికి తగ్గట్లుగా తీసేందుకు భారీ బడ్జెట్​తో ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ధూమ్ ఫస్ట్ పార్ట్​లో జాన్ అబ్రహాం విలన్ పాత్రలో నటించగా, రెండో భాగంలో హృతిక్ రోషన్ ప్రతినాయకుడిగా మెప్పించారు. చివరగా వచ్చిన ధూమ్-3లో అమీర్ ఖాన్ విలన్​గా కనిపించిన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు రాబోతున్న ధూమ్-4 చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో ఎవరు నటించనున్నారన్నది మళ్లీ ఆసక్తికరమైన అంశంగా మారింది.

బాలీవుడ్​ భారీ సీక్వెల్​ మూవీలో ప్రభాస్​, సూర్య! - Prabhas Suriya Cameo Roles

'తంగలాన్'​ దర్శకుడితో సూర్య - పొల్లాచ్చిలో వెంకీ పాట - Thangalan Director Suriya Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.