Delink Wrong Member ID From UAN : ఉద్యోగాలు చేసే వారికి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అకౌంటు, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) గురించి బాగా తెలుసు. యూఏఎన్ నంబరు ద్వారా పీఎఫ్ ఖాతాకు సంబంధించిన లావాదేవీలను చేయవచ్చు. ప్రతీ యూఏఎన్ నంబరు, ఒక మెంబర్ ఐడీకి అనుసంధానమై ఉంటుంది. మెంబర్ ఐడీ అనేది సదరు ఉద్యోగి పనిచేసే సంస్థకు చెందిన క్రమసంఖ్య. ఒకవేళ పొరపాటున యూఏఎన్ నంబరుకు తప్పుడు మెంబర్ ఐడీ లింక్ అయి ఉంటే ఎలా? దాన్ని డీలింక్ చేసి, సరైన మెంబర్ ఐడీని లింక్ చేసుకోవడం ఎలా? అనేది మనం తెలుసుకుందాం.
ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్
యూఏఎన్ నంబరుకు తప్పుడు మెంబర్ ఐడీ లింక్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. దాన్ని సులభంగానే డీలింక్ చేయవచ్చు. దీనికి సంబంధించిన వివరాలతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2025 జనవరి 17న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. తప్పుడు మెంబర్ ఐడీని స్వయంగా డీలింక్ చేసే ఫీచర్‌ను ఈపీఎఫ్‌ఓ సభ్యుల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఇందుకోసం అనుసరించాల్సిన పద్ధతి గురించి సర్క్యులర్‌లో ఈపీఎఫ్‌ఓ వివరించింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉన్నవాళ్లు మాత్రమే ఈ పద్ధతిలో స్వయంగా తప్పుడు మెంబర్ ఐడీని డీలింక్ చేయగలుగుతారని మనం గుర్తుంచుకోవాలి.
తప్పుడు మెంబర్ ఐడీ డీలింక్ చేయండిలా!
యూఏఎన్‌తో లింక్ అయిన తప్పుడు మెంబర్ ఐడీని డీలింక్ చేసేందుకు చిన్నపాటి ప్రాసెస్ ఉంటుంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- మొదటిగా మనం యూఏఎన్ అధికారిక పోర్టల్‌లోకి లాగిన్అయి, ఓటీపీని సబ్మిట్ చేయాలి.
- తదుపరిగా 'వ్యూ మెను' అనే ఆప్షన్‌లోకి వెళ్లి 'సర్వీస్ హిస్టరీ' విభాగాన్ని చెక్ చేయాలి.
- యూఏఎన్‌కు లింక్ అయిన తప్పుడు మెంబర్ ఐడీ అక్కడ కనిపిస్తుంది.
- దాన్ని సెలెక్ట్ చేసి, డీలింక్ (Delink) అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి డీలింక్ చేయాలి.
- ఈ క్రమంలో నిర్ధారణ కోసం 'ఓకే' అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇంకో పేజీ తెరుచుకుంటుంది.
- ఈ విధంగా ఎందుకు డీలింక్ చేశారు? అనే దానికి గల కారణాన్ని ఆ పేజీలో తెలియజేయండి.
- ఇందుకోసం మీకు కొన్ని ఆప్షన్లను చూపిస్తారు. వాటిలో ఒకదాన్ని ఎంచుకుంటే సరిపోతుంది.
- అనంతరం రెండు 'అంగీకారం' (Consent) బాక్స్‌లు కనిపిస్తాయి.
- వాటిపై క్లిక్ చేయగానే ఆధార్‌తో లింక్ అయిన మీ ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఆ తర్వాత డీలింక్ చేసిన మెంబర్ ఐడీ అనేది మీ జాబ్ సర్వీస్ హిస్టరీలో కనిపించదు.
EPFO UAN పేరు తప్పుగా పడిందా? నో ప్రాబ్లమ్- ఈ 3 డాక్యుమెంట్లు ఉంటే సింపుల్‌గా ఛేంజ్ చేయొచ్చు!
EPFO UAN యాక్టివేషన్ అలర్ట్- నెల జీతం ఫ్రీగా రావాలంటే అలా చేయాల్సిందే!