తెలంగాణ

telangana

ETV Bharat / business

ABS ఫీచర్​తో బైక్ కొనాలా? ఈ టాప్​-5 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

Top 5 Most Affordable Bikes With ABS In India : మీరు మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న బైక్ కొందామని అనుకుంటున్నారా? ధర కూడా అందుబాటులో ఉండాలా? అయితే ఇది మీ కోసమే. రూ.1.5 లక్షల బడ్జెట్లో యాంటీ-క్లాక్ బ్రేకింగ్ సిస్టమ్​ (ABS) ఉన్న టాప్​-5 బైక్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

top 5 Affordable Bikes With ABS
Most Affordable Bikes With ABS In India 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 4:57 PM IST

Top 5 Most Affordable Bikes With ABS In India : దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే ఈ ప్రమాదాలను నివారించడానికి, ప్రభుత్వం 125సీసీ లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్​ డిస్​ప్లేస్​మెంట్​ సామర్థ్యం ఉన్న బైక్​లకు యాంటీ-క్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్​)​ను తప్పనిసరి చేసింది. దీని వల్ల సడెన్​గా బ్రేక్ వేసినప్పటికీ వీల్స్ లాక్​ కాకుండా ఉంటాయి. ఫలితంగా వాహనదారులకు, ఎదురుగా వచ్చినవారికి కూడా ముప్పు తప్పుతుంది. పైగా నేడు వాహనదారులు అందరూ మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న బైక్స్​నే కొనేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో ఏబీఎస్ ఫెసిలిటీ ఉన్న టాప్​-5 బైక్స్​పై ఓ లుక్కేద్దాం.

1. Bajaj Platina 110 ABS Features : ఈ బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్​ బైక్​లో 115.45 సీసీ సింగిల్-సిలిండర్​ ఎయిర్​-కూల్డ్​ ఇంజిన్ ఉంటుంది. ఇది 7000 rpm వద్ద 8.60 PS పవర్​, 5000 rpm వద్ద 9.81 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లో 5-స్పీడ్ గేర్​బాక్స్ ఉంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. ఈ బైక్​ ఒక లీటర్​ పెట్రోల్​కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్​లో సింగిల్ ఛానల్ యాంటీ-క్లాక్​ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఉంది.

Bajaj Platina 110 ABS Price : మార్కెట్లో ఈ బజాజ్​ ప్లాటినా 110 ఏబీఎస్​ బైక్ ధర సుమారుగా రూ.79,821 ఉంటుంది.

2. Hero Xtreme 125R Features : ఈ హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ బైక్​లో 124.7.45 సీసీ సింగిల్-సిలిండర్​ ఎయిర్​-కూల్డ్​ ఇంజిన్ ఉంటుంది. ఇది 8250 rpm వద్ద 11.55 PS పవర్​, 6000 rpm వద్ద 10.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లో 5-స్పీడ్ గేర్​బాక్స్ ఉంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. ఈ బైక్​ ఒక లీటర్​ పెట్రోల్​కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్​లో సింగిల్ ఛానల్ యాంటీ-క్లాక్​ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఉంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్​, వెనుక భాగంలో 7 స్టెప్​ అడ్జస్టబుల్ హైడ్రాలిక్​ మోనో-షాక్​ అబ్జార్బర్స్ ఉంటాయి.

Hero Xtreme 125R Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్ బైక్ ధర రూ.95,000 నుంచి రూ.99,500 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

3. Honda Unicorn Features : ఈ హోండా యూనికార్న్ బైక్​లో 162.7 సీసీ సింగిల్-సిలిండర్​ ఎయిర్​-కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్​​ ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 12.91 PS పవర్​, 5500 rpm వద్ద 14 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లో 5-స్పీడ్ గేర్​బాక్స్ ఉంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. ఈ బైక్​ ఒక లీటర్​ పెట్రోల్​కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్​లో సింగిల్ ఛానల్ యాంటీ-క్లాక్​ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఉంది.

Honda Unicorn Price : జపాన్ కంపెనీకి చెందిన ఈ హోండా యూనికార్న్ బైక్ ధర సుమారుగా రూ.1.10 లక్షలు ఉంటుంది.

4. Bajaj Pulsar 150 Features :ఈ బజాబ్​ పల్సర్​ 150 బైక్​లో 149.5 సీసీ సింగిల్-సిలిండర్​ ఎయిర్​-కూల్డ్ DTS-i ఫ్యూయెల్ ఇంజెక్టెడ్​​ మోటార్​ ఉంటుంది. ఇది 8500 rpm వద్ద 14 PS పవర్​, 6500 rpm వద్ద 13.25 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లో 5-స్పీడ్ గేర్​బాక్స్ ఉంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు. ఈ బైక్​ ఒక లీటర్​ పెట్రోల్​కు 47.5 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్​లో సింగిల్ ఛానల్ యాంటీ-క్లాక్​ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఉంది. అలాగే ముందు వెనుక భాగాల్లో డిస్క్​ బ్రేక్​లు ఉంటాయి.

Bajaj Pulsar 150 Price : మార్కెట్లో ఈ బజాజ్​ పల్సర్​ 150 బైక్​ ధర సుమారుగా రూ.1.10 లక్షల నుంచి రూ.1.15 లక్షల వరకు ఉంటుంది.

5. Bajaj Pulsar N150 Features : ఈ బజాబ్​ పల్సర్​ ఎన్​150 బైక్​లో 149.68 సీసీ సింగిల్-సిలిండర్​ ఎయిర్​-కూల్డ్ ఇంజిన్​​ ఉంటుంది. ఇది 8500 rpm వద్ద 14.5 PS పవర్​, 6000 rpm వద్ద 13.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లో 5-స్పీడ్ గేర్​బాక్స్ ఉంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. ఈ బైక్​ ఒక లీటర్​ పెట్రోల్​కు 48 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్​లో సింగిల్ ఛానల్ యాంటీ-క్లాక్​ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఉంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్​, వెనుక భాగంలో 7 స్టెప్​ అడ్జస్టబుల్ హైడ్రాలిక్​ మోనో-షాక్​ అబ్జార్బర్స్ ఉంటాయి.

Bajaj Pulsar N150 Price : మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్​ ఎన్​150 బైక్​ ధర సుమారుగా రూ.1.18 లక్షలు ఉంటుంది.

మారుతి కార్​ కొనాలా? ఆ మోడల్​ కోసం 4 నెలలు వేచిచూడాల్సిందే!

రూ.70,000 బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్​ కొనాలా? టాప్-9 ఆప్షన్స్ ఇవే!

ABOUT THE AUTHOR

...view details