తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ టాప్​-5 క్రెడిట్ కార్డ్స్​తో - ఎయిర్​పోర్ట్ లాంజ్​ యాక్సెస్, క్లబ్ మెంబర్​షిప్ ఫ్రీ!

Top 5 Credit Cards That Offer Free Lounge And Club Memberships : మీరు తరచూ ప్రయాణాలు చేస్తుంటారా? ఖర్చులు వీలైనంత తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం కొన్ని క్రెడిట్ కార్డులు పూర్తి ఉచితంగా ఎయిర్​పోర్ట్ లాంజ్​ యాక్సెస్​​, ఫ్రీ స్పా, ఫ్రీ గోల్ఫ్ బెనిఫిట్స్, రివార్డ్ పాయింట్స్​​​ అందిస్తున్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా?

Lounge access credit cards
Top 5 Credit Cards 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 3:21 PM IST

Top 5 Credit Cards That Offer Free Lounge And Club Memberships : ప్రయాణాలు చేసేటప్పుడు అనుకోకుండా చాలా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా ఎయిర్​పోర్ట్​ లాంజ్​ల్లోకి, స్పాలు, గోల్ఫ్​ కోర్టుల్లోకి వెళితే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వీటిని అదుపు చేసుకోకపోతే మన జేబుకే చిల్లుపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ బ్యాంకులు అన్నీ తమ క్రెడిట్ కార్డుపై మంచి బెనిఫిట్స్, ఆఫర్స్​ అందిస్తున్నాయి.

ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎస్​బీఐ కార్డ్స్​, కోటక్ మహీంద్రా బ్యాంక్​లు తమ క్రెడిట్ కార్డులపై కాంప్లిమెంటరీ ఎయిర్​పోర్ట్​ లాంజ్ యాక్సెస్​​, ఫ్రీ స్పా విజిట్స్​ లాంటి ప్రయోజనాలు​​ కల్పిస్తున్నాయి. అలాగే ఫ్రీ గోల్ఫ్​ రౌండ్స్​, రివార్డ్ పాయింట్స్, క్లబ్ మెంబర్​షిప్స్​ అందిస్తున్నాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ICICI Bank Sapphiro Card Benefits :

  • ఐసీఐసీఐ బ్యాంక్​ Sapphiro క్రెడిట్​ కార్డు యూజర్లు, డ్రీమ్​ఫోక్స్​ ప్రోగ్రామ్​లో భాగంగా సంవత్సరానికి 2 సార్లు ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్ లాంజ్​లు యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఏడాదికి రెండు సార్లు ఎయిర్​పోర్ట్ స్పాలను సందర్శించవచ్చు. ఈ రెండూ పూర్తి ఉచితం.
  • ఒక క్యాలెండర్​ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్​ Sapphiro క్రెడిట్ కార్డు ఉపయోగించి రూ.5000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే, తరువాతి త్రైమాసికంలో డొమెస్టిక్​ ఎయిర్​పోర్ట్ లాంజ్​లను నాలుగు సార్లు పూర్తి ఉచితంగా విజిట్ చేయవచ్చు.
  • ఈ ఐసీఐసీఐ బ్యాంక్ Sapphiro క్రెడిట్​ కార్డ్ యూజర్లు ప్రతి నెలా ఫ్రీగా నాలుగు గోల్ఫ్​ రౌండ్​లను ఆడవచ్చు. నిర్దిష్ట పరిధికి మించి ఖర్చు చేస్తేనే ఈ కాంప్లిమెంటరీ బెనిఫిట్ లభిస్తుంది.

HDFC Bank Diners Club Black Metal Edition Credit Card Benefits :

  • ఈ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ డైనర్స్ క్లబ్​ బ్లాక్ మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డు యూజర్లకు అన్​లిమిటెడ్​ ఎయిర్​పోర్ట్ లాంజ్ యాక్సెస్ సౌకర్యం ఉంటుంది.
  • వీకెండ్​ డైనింగ్​ కోసం చేసే ఖర్చులపై 2X రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి.
    • క్లబ్ మారియట్​లో కాంప్లిమెంటరీగా వార్షిక సభ్యత్వం కూడా దొరుకుతుంది.

Marriott Bonvoy HDFC Bank Credit Card Bebefits :

  • ఈ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు మారియట్ బోన్వాయ్​ హోటళ్లలో ఒక రాత్రి పూర్తి ఉచితంగా స్టే చేయవచ్చు. (15,000 పాయింట్ల విలువ వరకు మాత్రమే!)
  • ఈ క్రెడిట్ కార్డు యూజర్లు, మారియట్​ బోన్వాయ్​ సిల్వర్ ఎలైట్ స్టేటస్ పొందవచ్చు. అలాగే 10 ఎలైట్​ నైట్ క్రెడిట్స్​ ఆస్వాదించవచ్చు.

SBI Card Elite Benefits :

  • ఈ ఎస్​బీఐ ఎలైట్​ క్రెడిట్ కార్డుతో సంవత్సరానికి 6 సార్లు విదేశాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్ లాంజ్​లను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఒక త్రైమాసికానికి కేవలం రెండు సార్లు మాత్రమే ఇలా ఫ్రీ యాక్సెస్ పొందగలుగుతారు.
  • ఈ కార్డుతో ప్రపంచంలోని దాదాపు 1000 విమానాశ్రయాల్లోని లాంజ్​లను విజిట్ చేయవచ్చు.
  • ఈ ఎస్​బీఐ క్రెడిట్ కార్డుతో కాంప్లిమెంటరీగా క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్​షిప్​ లభిస్తుంది.

Kotak Mahindra Bank Zen Signature Credit Card :

  • కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ జెన్​ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు యూజర్లు సంవత్సరానికి 3 సార్లు విదేశాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్ లాంజ్​లను ఉచితంగా యాక్సిస్ చేయవచ్చు.
  • ఈ జెన్​ సిగ్నేచర్ క్రెడిట్ కార్డుతో ప్రపంచంలోని 1300 ఎయిర్​పోర్ట్ లాంజ్​లను విజిట్ చేయవచ్చు.
  • ఈ కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డు యూజర్లు ఒక క్యాలెండర్ త్రైమాసికంలో భారతదేశంలోని డ్రీమ్ ఫోక్స్ లాంజ్​లను రెండు సార్లు ఉచితంగా సందర్శించవచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ బెనిఫిట్ల గురించి తెలుసా?

కార్ ఇన్సూరెన్స్​ ప్రొవైడర్​ను మార్చాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details