తెలంగాణ

telangana

ETV Bharat / business

2024లో లాంఛ్ కానున్న టాప్​-5 కార్స్ ఇవే!​ ఫీచర్స్​ అదుర్స్​ - ధర ఎంతో తెలుసా? - best cars under 20 lakh

Top 5 Car Launches In 2024 : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? బడ్జెట్ కాస్త ఎక్కువైనా ఫర్వాలేదా? అయితే ఇది మీ కోసమే. అదిరిపోయే ఫీచర్లతో, మంచి ట్రెండీ లుక్స్​తో 2024లో లాంఛ్ కానున్న టాప్​-5 కార్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

upcoming cars in 2024
Top 5 car launches in 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 11:48 AM IST

Top 5 Car Launches In 2024 :మీరు మంచి ఫీచర్లు, స్పెక్స్ ఉన్న కారు కొనాలని అనుకుంటున్నారా? ఇందుకోసం రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేయగలరా? అయితే చాలా మంచిది. ఈ 2024లో లాంఛ్​ అయిన, లాంఛ్ కానున్న టాప్​-5 కార్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Hyundai Creta Features :హ్యుందాయ్ కంపెనీ 2024 జనవరి 16న అప్​డేటెడ్ క్రెటా కారును ఇండియాలో లాంఛ్ చేసింది. ఈ కారులో బోలెడ్ ఎక్స్​టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మార్పులు చేశారు. దీని క్యాబిన్ చాలా ప్రీమియం లుక్​తో ఉంటుంది. ఈ కారులో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్​ డిస్​ప్లే, 360 డిగ్రీ కెమెరా, డ్యూయెల్​-జోన్ క్లైమేట్ కంట్రోల్​, ఏడీఏఎస్​ ఉన్నాయి.

ఈ హ్యుందాయ్ క్రెటా కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. న్యూ క్రెటా కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్​ (160 PS/ 253 Nm)ఉంది. దీనికి పెయిర్​గా DCT ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ ఉంది.​ ఇక రెగ్యులర్ 1.5 లీటర్ పెట్రోల్​ ఇంజిన్​ (115 PS/ 144 Nm) అనేది 6-స్పీడ్​ ఎంటీ, సీవీటీ అనుసంధానంలతో పనిచేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్​ (116 PS/ 250 Nm) 6-స్పీడ్​ ఎంటీ అండ్​ ఏటీ అనుసంధానంతో పనిచేస్తుంది.

  • Hyundai Creta Mileage : ఈ హ్యుందాయ్ క్రెటా (పెట్రోల్ వేరియంట్​) ఒక లీటర్​కు 17 కి.మీ మైలేజ్ ఇస్తుంది. డీజిల్ వేరియంట్ ఒక లీటర్​కు 20 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
  • Hyundai Creta Car Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ క్రెటా కారు ధర రూ.11 లక్షల నుంచి రూ.20.15 లక్షల రేంజ్​లో ఉంటుంది.
  • Hyundai Creta Resale Value : ఈ హ్యుందాయ్ క్రెటాను మూడేళ్లు ఉపయోగించి, తరువాత అమ్మాలనుకుంటే, బహుశా రూ.7.2 లక్షల నుంచి రూ.13.1 లక్షల వరకు రీ-సేల్ వాల్యూ రావచ్చు.

2. Mahindra Thar 5 Door Features : మహీంద్రా థార్​ 5-డోర్​లో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. దీనిలో రూమియర్​ క్యాబిన్​, ఎక్స్​ట్రా డోర్స్​, పెద్ద ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​, సన్​రూఫ్ ఉన్నాయి. అంతేకాదు దీనిలో డ్యూయెల్​-జోన్ క్లైమేజ్​ కంట్రోల్​ విత్​ రియర్​ ఏసీ వెంట్స్​, స్టార్ట్​/ స్టాప్​ పుష్​ బటన్​, 6 ఎయిర్​ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ కారులో పూర్తిగా ఎల్​ఈడీ లైటింగ్ సిస్టమ్​ ఉంది.

ఈ మహీంద్రా థార్​ కారు 2.2 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్​ డీజిల్ ఇంజిన్​ వేరియంట్లలో లభిస్తుంది. ఇవి రెండూ 6-స్పీడ్​ మాన్యువల్, ఆటోమేటిక్​ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లతో వస్తాయి. అలాగే ఇది ఫోర్​-వీల్​ డ్రైవ్​, రియర్​వీల్ డ్రైవ్ ఆప్షన్​లను కలిగి ఉంది.

  • Mahindra Thar 5 Door Mileage : ఈ మహీంద్రా థార్​ టర్బో పెట్రోల్ వేరియండ్ ఒక లీటర్​కు 13 కి.మీ మైలేజ్ ఇస్తుంది. డీజిల్​ వేరియంట్​ ఒక లీటర్​కు 17 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారును బహుశా ఈ 2024 ఆగస్టులో లాంఛ్ చేసే అవకాశం ఉంది.
  • Mahindra Thar 5 Door Price :మార్కెట్లో ఈ మహీంద్రా థార్​ 5 డోర్ కారు ధర సుమారుగా రూ.15 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉండవచ్చు.
  • Mahindra Thar 5 Door Resale Value :ఈ మహీంద్రా థార్​ కారును మూడేళ్లపాటు ఉపయోగించి, రీ-సేల్ చేస్తే రూ.9.8 లక్షల నుంచి రూ.14.3 లక్షల వరకు రావచ్చు.

3. Volkswagen Taigun Features : ఈ ఫోక్స్​వ్యాగన్ టైగన్​ అనేది ఒక కాంపాక్ట్ ఎస్​యూవీ కార్​. ఇప్పటికే ఈ కారును మరోపేరుతో బ్రెజిల్ మార్కెట్​లో విడుదల చేశారు. అక్కడ దీని ఎక్స్​టీరియర్​లో చాలా మార్పులు చేశారు. కనుక ఇండియా-స్పెక్ టైగన్​లో కూడా ఇలాంటి మార్పునే ఊహించవచ్చు. అయితే ఇంటీరియర్​లో పెద్దగా మార్పులు చేయలేదని సమాచారం.

ఫోక్స్​వ్యాగన్ టైగన్​ కారులో 10 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​, డిజిటల్​ డ్రైవర్స్ డిస్​ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్​ సీట్ ఉన్నాయి. ఈ కారులో 1 లీటర్​ పెట్రోల్​ (115 PS/ 178 Nm); 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్​​​ (150 PS/ 250 Nm) వేరియంట్లు ఉన్నాయి. ఇవి రెండూ 6-స్పీడ్​ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​తో వస్తాయి. దీనితోపాటు 6-స్పీడ్​ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​, 7-స్పీడ్​ డీసీటీ ఆటోమేటిక్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

  • Volkswagen Taigun Price : మార్కెట్లో ఈ ఫోక్స్​వ్యాగన్​ టైగన్​ ధర సుమారుగా రూ.12 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు ఉంటుంది. ఈ కారును బహుశా ఈ 2024 అక్టోబర్​లో లాంఛ్ చేయవచ్చు.
  • Volkswagen Taigun Resale Value : ఈ ఫోక్స్​వ్యాగన్ టైగన్ కారును 3 ఏళ్లు వాడి, రీసేల్ చేస్తే సుమారుగా రూ.7.8 లక్షల నుంచి రూ.13.6 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది.

4. Hyundai Alcazar Features : క్రెటా త్రీ-రో వెర్షన్ ఆధారంగా ఈ హ్యుందాయ్​ అల్కాజర్ కారును రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం, ఈ హ్యుందాయ్ అల్కాజర్​ కారు ముందు, వెనుక భాగాల్లో ఎల్​ఈడీ లైట్స్ ఉంటాయి. దీనిలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్​, ఏడీఏఎస్​ కూడా ఉంటాయి. ఈ కారులో 1.5 లీటర్​ టర్బో పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. ఇది 160 PS పవర్​ జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్​ 116 PS పవర్​ జనరేట్ చేస్తుంది. ఇవి 6-స్పీడ్ ఎంటీ, ఏటీ; 7-స్పీడ్​ డీసీటీ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లతో వస్తాయి.

  • Hyundai Alcazar Mileage :మార్కెట్లో ఈ హ్యుందాయ్ అల్కాజర్​ కారు లీటర్ పెట్రోల్​కు 16 కి.మీ; లీటర్​ డీజిల్​కు 20 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారును బహుశా ఈ 2024 ఏప్రిల్​లో లాంఛ్ చేసే అవకాశం ఉంది.
  • Hyundai Alcazar Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ అల్కాజర్ కారు ధర సుమారుగా రూ.17 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉండవచ్చు.
  • Hyundai Alcazar Resale Value : ఈ హ్యుందాయ్​ అల్కాజర్ కారును మూడేళ్ల తరువాత సేల్ చేస్తే సుమారుగా రూ.11 లక్షల నుంచి రూ.14.3 లక్షల వరకు లభించవచ్చు.

5. Hyundai Tucson Features : ఈ ఫోర్త్-జెన్​ హ్యుందాయ్ టక్సన్​ను 2024 జూన్​లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారు ఎక్స్​టీరియర్​లో అనేక మార్పులు చేశారు. స్లీకర్ అండ్ వైడర్​ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. లైటింగ్ ఎలిమెంట్స్ సహా అల్లాయ్ వీల్స్​ డిజైన్ మార్చారు.

ఈ హ్యుందాయ్ టక్సన్ కారు లోపల చాలా మార్చులు చేశారు. ముఖ్యంగా స్క్రీన్ సెటప్​, స్టీరింగ్ వీల్​,​ డ్యాష్​బోర్డ్​, క్లైమేట్ కంట్రోల్​ ప్యానల్​లను రీడిజైన్ చేశారు. దీనిలో పనోరమిక్ సన్​రూఫ్​, డ్యూయెల్ జోన్ ఏసీ, 6 ఎయిర్​బ్యాగ్స్​, ఏడీఏఎస్ కూడా ఏర్పాటుచేసే అవకాశం ఉంది.

ఈ హ్యుందాయ్​ టక్సన్​లో 2 లీటర్​ పెట్రోల్​ యూనిట్​ (156 PS/ 192 Nm); 2 లీటర్​ డీజిల్ ఇంజిన్​ (186 PS/ 416 Nm) ఆప్షన్లు ఉన్నాయి. ఇవి 6-స్పీడ్​ ఏటీ, 8-స్పీడ్​ ఏటీ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లతో వస్తాయి.

  • Hyundai Tucson Mileage : ఈ హ్యుందాయ్ టక్సన్ కారు ఒక లీటర్​ పెట్రోల్​కు 12 కి.మీ; ఒక లీటర్​ డీజిల్​కు 15 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
  • Hyundai Tucson Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ టక్సన్ కారు ధర రూ.29.5 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ఉండవచ్చు.
  • Hyundai Tucson Resale Value : ఈ హ్యుందాయ్ టక్సన్ కారును మూడేళ్లు ఉపయోగించి, తరువాత అమ్మేస్తే సుమారుగా రూ.19.2 లక్షల నుంచి రూ.23.4 లక్షల వరకు రావచ్చు.

ABS ఫీచర్​తో బైక్ కొనాలా? ఈ టాప్​-5 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

హ్యుందాయ్ క్రెటా ఎన్​ లైన్​ లాంఛ్ డేట్​ ఫిక్స్డ్​ - కియా & టయోటా కార్స్​ రీకాల్​ - ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details