Top 10 Upcoming Bikes in India : కొన్ని నెలల్లో మన దేశంలో వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 165 బైక్స్ అండ్ స్కూటర్స్ లాంఛ్ కానున్నాయి. ఈ జాబితాలో హీరో, హోండా, యమహా, బజాజ్, టీవీఎస్ సహా పలు ప్రముఖ కంపెనీల వాహన మోడల్స్ ఉన్నాయి. ప్రత్యేకించి కొత్తగా విడుదలకానున్న ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్‌పై వాహన ప్రియులకు భారీ అంచనాలు ఉన్నాయి. వీటిలో టాప్-10 బైక్స్ అండ్ స్కూటర్ మోడల్స్ ధరలు, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.
1.Yamaha XSR155(యమహా ఎక్స్ఎస్155) :
- ధర : రూ.1.4 లక్షలు
- విడుదల తేదీ : 2024 డిసెంబర్ 31
- ఇంజిన్ : ఇది 155 సీసీ బైక్ 6 స్పీడ్ మాన్యువల్ మోటార్‌తో వస్తుంది. లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ రకానికి చెందిన మోటార్ ఇది.
- ఫస్ట్ లుక్ : తొలిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఇంటర్నేషనల్ మోటార్ షోలో దీన్ని ప్రదర్శించారు.
- మైలేజ్: దీని మైలేజీ అర్బన్ ఏరియాలో 48.58 కిమీ/లీటర్, హైవేలపై 52.02 కిమీ/లీటర్ ఉంటుంది.
- బరువు : 134 కిలోలు
2.TVS Zeppelin R (టీవీఎస్ జెప్పెలిన్ ఆర్)
- ధర : దాదాపు రూ.1.5 లక్షలు
- విడుదల తేదీ : 2024 ఆగస్టు 22
- ఇంజిన్: 220.0 సీసీ
- ట్రాన్స్‌మిషన్: ఆటోమెటిక్
- మైలేజ్ : 44 కిమీ/లీటర్
- గరిష్ఠ వేగం : గంటకు 130 కి.మీ
3.Hero 450 ADV
- ధర : దాదాపు రూ.2.2 లక్షలు
- విడుదల తేదీ : 2024 ఆగస్టు 28
- ఇంజిన్: 450 సీసీ
- ట్రాన్స్‌మిషన్: మాన్యువల్
- మైలేజ్ : 25 కి.మీ/లీటర్
- గరిష్ఠ వేగం : గంటకు 150 కి.మీ
4. Honda PCX Electric (హోండా పీసీఎక్స్ ఎలక్ట్రిక్)
- ధర : దాదాపు రూ.1.45 లక్షలు
- విడుదల తేదీ : 2024 అక్టోబర్ 30
- బ్యాటరీ కెపాసిటీ : 20.8 ఏహెచ్
- గరిష్ఠ వేగం : గంటకు 96 కి.మీ
- రేంజ్ : 100-150 కి.మీ
- ఛార్జింగ్ టైం : 4 నుంచి 7 గంటలు
5. TCS XL EV
- ధర : రూ.60,000 - 70,000
- విడుదల తేదీ : 2024 సెప్టెంబర్ 11
- బ్యాటరీల సంఖ్య : 1
- పోర్టబుల్ బ్యాటరీ : లేదు
- స్వాపబుల్ బ్యాటరీ : లేదు
- స్టార్ట్ టైప్ : ఎలక్ట్రిక్ స్టార్ట్
- స్టెప్డ్ సీట్ : ఉంది
6.Hero Electric Axlhe 20(హీరో ఎలక్ట్రిక్ ఆక్సిల్ 20):
- ధర : దాదాపు రూ.55,000
- విడుదల తేదీ : 2025 జనవరి 15
- బ్యాటరీ కెపాసిటీ : 2 కిలోవాట్స్
- గరిష్ఠ వేగం : గంటకు 85 కి.మీ
- రేంజ్ : 110 కి.మీ
- ఛార్జింగ్ టైం : 8 గంటలు
7. Honda PCX 125
- ధర : దాదాపు రూ.85,000 - రూ.1,10,000
- విడుదల తేదీ : 2024 అక్టోబరు
- ఇంజిన్ కెపాసిటీ : 125 సీసీ
- గరిష్ఠ శక్తి : 11.17 బీహెచ్‌పీ
- ఫస్ట్ లుక్ : దీన్ని తొలిసారిగా 2014లో ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు.
- బ్రేకింగ్ పవర్ : 220 ఎమ్ఎమ్ హైడ్రాలిక్ డిస్క్ ఉంది. ముందు వైపు 3-పిస్టన్ కాలిపర్, వెనుక వైపు 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి.
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : ఒకేసారి 6.2 లీటర్ల పెట్రోలు పోయించుకోవచ్చు
- బైక్ బరువు : 124.4 కేజీలు
8. Bajaj Pulsar N123 (బజాజ్ పల్సర్ ఎన్125)
- ధర : దాదాపు రూ.90,000 - రూ.1 లక్ష
- విడుదల తేదీ : 2024 ఆగస్ట్ 31
- ఇంజిన్: 125 సీసీ
- ట్రాన్స్‌మిషన్: మాన్యువల్
- ఇంధన రకం: పెట్రోల్
- ఇంధన ట్యాంకు సామర్థ్యం : 12 లీటర్లు
9. Okinawa Oki100 (ఒకినావా ఓకీ 100)
- ధర : రూ.1 లక్షలు
- విడుదల తేదీ : 2024 డిసెంబర్ 15
- డుకాటి వెర్షన్ బైక్స్‌ను పోలి ఉంటుంది.
- ఫస్ట్ లుక్ : 2020 ఆటో ఎక్స్‌పోలో తొలిసారి ప్రదర్శించారు.
- వీల్స్ : సంప్రదాయ మోటార్ సైకిళ్ల కంటే ఇది చిన్న చక్రాలను కలిగి ఉంటుంది. 14 అంగుళాల అలాయ్ వీల్స్ ఉంటాయి.
- బ్రేకింగ్ వ్యవస్థ : బైక్‌ను ఆపడానికి రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.
- లోడ్ కెపాసిటీ : ఈ బైక్ రైడర్‌తో సహా 150 కిలోగ్రాముల బరువును మోయగలదు.
- అదనపు ఫీచర్స్ : యాంటీ-థెఫ్ట్ అలారం, కీలెస్ ఇగ్నిషన్, సెంట్రల్ లాకింగ్, జీపీఎస్, జియో-ఫెన్సింగ్, బిల్ట్-ఇన్ నావిగేషన్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉంటాయి. ప్రత్యేక యాప్ ద్వారా యూఎస్‌బీ ఛార్జింగ్, మొబైల్ కనెక్టివిటీ చేయొచ్చు. పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్ ఉంటాయి.
- మోటార్ : 3,000 వాట్ల బీఎల్డీసీ మోటార్ ఉంది.
- బ్యాటరీ : 72 వోల్టేజీ, 4 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ఉంది.
- వేగం : గంటకు 120కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
- మైలేజ్ : ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ ప్రయాణించగలదు.
10.Suzuki Access Electric (సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్)
- ధర : రూ. 1 లక్ష - రూ.1.2 లక్షలు
- విడుదల తేదీ : 2024 సెప్టెంబర్ 18
- మైలేజ్ : ఒక్క ఛార్జింగ్‌తో 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
- వీల్స్ : 12 ఇంచుల అలాయ్ వీల్స్ ఉన్నాయి. ట్యూబ్ లెస్ టైర్స్‌తో లభ్యమవుతుంది.
- బ్రేక్స్ : ముందు భాగంలో డిస్క్ బ్రేక్స్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.
ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్స్ కోసం రూ.లక్ష బడ్జెట్లో బైక్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Family Bikes In India
మీరు కాస్త పొట్టిగా ఉంటారా? మీకు సూట్ అయ్యే టాప్-10 బైక్స్ ఇవే! - Best Low Seat Height Bikes