తెలంగాణ

telangana

ETV Bharat / business

జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్ అకౌంట్లు క్లోజ్- ఇందులో మీ ఖాతా ఉందా? - BANK ACCOUNTS CLOSED FROM JANUARY 1

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు- జనవరి 1 నుంచి 3 రకాల బ్యాంకు ఖాతాలు క్లోజ్‌- ఇందులో మీ అకౌంట్ ఉందా?

Bank Accounts Closed From January 1
Bank Accounts Closed From January 1 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2024, 4:03 PM IST

Bank Accounts Closed From January 1 :బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ ఖాతాలను ప్రభావితం చేసే కీలకమైన మార్పులను 2025 జనవరి 1న ఆర్​బీఐ అమలు చేయనుంది. అందుకే ఈ మార్పులపై అవగాహన ఉండటం, ఆలస్యం కాకముందే మేల్కోవడం చాలా అవసరం. లేకపోతే మీ బ్యాంక్ ఖాతా యాక్సెస్​ను కోల్పోయే ప్రమాదం ఉంది.

బ్యాంకింగ్ లావాదేవీల భద్రత, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మూడు రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయాలని ఆర్​బీఐ నిర్ణయించింది. వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా హ్యాకింగ్​ను అరికట్టడం, బ్యాంకింగ్‌ రంగంలో డిజిటలైజేషన్, ఆధునికీకరణను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో జనవరి 1 నుంచి క్లోజ్ కానున్న 3 రకాల బ్యాంక్ ఖాతాలు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

డార్మాంట్ అకౌంట్లు
డార్మాంట్ అకౌంట్‌ అంటే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతా. మోసపూరిత కార్యకలాపాల కోసం తరచుగా ఇలాంటి ఖాతాలను లక్ష్యంగా చేసుకుంటారు హ్యాకర్లు. డార్మాంట్ అకౌంట్లను దుర్వినియోగం చేసి సొత్తును కొల్లగొట్టే అవకాశం ఉంది. ఖాతాదారులను, బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడానికి ఆర్​బీఐ డార్మాంట్ అకౌంట్లను క్లోజ్ చేయాలని నిర్ణయించింది.

ఇన్​యాక్టివ్‌ అకౌంట్లు
నిర్దిష్ట వ్యవధిలో (సాధారణంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) లావాదేవీలు జరపని ఖాతాలను ఇన్​యాక్టివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు. ఖాతా భద్రతను మెరుగుపరచడానికి, మోసపూరిత ప్రవర్తన ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఖాతాలను కూడా ఆర్​బీఐ క్లోజ్ చేయనుంది. మీకూ ఇలాంటి ఇన్​యా​క్టివ్‌ అకౌంట్‌ ఉంటే వెంటనే యాక్టివేట్ చేసుకోవడం తప్పనిసరి.

జీరో బ్యాలెన్స్ అకౌంట్లు
ఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్​ కొనసాగించే ఖాతాలు కూడా క్లోజ్‌ కానున్నాయి. అటువంటి ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆర్థిక నష్టాలను తగ్గించడం, కస్టమర్లు తమ బ్యాంకులతో క్రియాశీల సంబంధాలను కొనసాగించేలా ప్రోత్సహించడం ఆర్​బీఐ లక్ష్యం. అంతేకాకుండా కేవైసీ నిబంధనలను బలోపేతం చేయడం కూడా ఈ చర్య ముఖ్య ఉద్దేశం.

కేవైసీ అప్డేట్
రెండేళ్లుగా లావాదేవీలు జరపని ఖాతా(డార్మాంట్ అకౌంట్)ను యాక్టివేట్ చేయడానికి వెంటనే కేవైసీని పూర్తి చేయాలి. బ్యాంక్ లేదా ఆన్​లైన్​లో బ్యాంకు ఖాతా కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. దీంతో మీ బ్యాంకు ఖాతా ఇన్‌ యాక్టివ్​గా మారకుండా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్​గా ఉండాలంటే ఎప్పటికప్పుడు కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్​ను మెయింటెన్ చేయాలి. లేదంటే అవి ఇన్​యాక్టివ్ అయ్యే ప్రమాదం ఉంది.

ABOUT THE AUTHOR

...view details