తెలంగాణ

telangana

ETV Bharat / business

న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్​లో అదిరే ఫీచర్స్​- లాంఛ్ డేట్​ ఫిక్స్

నవంబరు 11న న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ కారు మార్కెట్లో లాంఛ్- మోడ్రన్ లుక్, ఫీచర్లతో రానున్న వాహనం- మైలేజ్ కూడా అదుర్స్!

Maruti Suzuki Dzire 2024
Maruti Suzuki Dzire 2024 (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Next Gen Maruti Suzuki Dzire 2024 :మారుతి కారు లవర్స్​కు గుడ్ న్యూస్. న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ కారు నవంబరు 11న భారత విపణిలోకి రానుంది. ఇది మోడ్రన్ లుక్‌, కొత్త ఫీచర్ల​తో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు తెలుసుకోవాల్సిన 5 విషయాలను ఈ స్టోరీలో చూద్దాం.

న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ కొత్త క్యాబిన్, ఎక్స్​టీరియర్, కొత్త ఇంజిన్ ఆప్షన్లతో రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత జనరేషన్ మారుతి సుజుకి డిజైర్ దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతోంది. ఈ నేపథ్యంలో న్యూ-జెన్ మారుతి సుజుకి కూడా అంతే మొత్తంలో సక్సెస్ కావాలని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంచి ఫీచర్లతో దాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

ఎక్స్​టీరియర్
ఈ ఫోర్త్ జనరేషన్ మారుతి సుజుకి డిజైర్ కొత్త ఇంటీరియర్ డిజైన్​తో రానుంది. మారుతి సుజుకి డిజైర్ మంచి లుక్​తో ఉంటుందని స్పై షాట్స్​ ఆధారంగా తెలుస్తోంది. ఇందులో అనేక హారిజాంటల్ క్రోమ్ స్లాట్లతో అలంకరించిన పెద్ద గ్రిల్, ఫాగ్ లైట్లతో కూడిన అప్డేటెడ్​ ఎల్ఈడీ హెడ్​ ల్యాంప్స్ ఉన్నాయి. అదనంగా కొత్త అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎల్ఈడీ లైట్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇంటీరియర్
మారుతి సుజుకి స్విఫ్ట్​తో పోలిస్తే న్యూ-జెన్ డిజైర్ భిన్నమైన ఇంటీరియర్​తో లభిస్తుందని తెలుస్తోంది. ఇందులో మూడు స్పోక్ స్టీరింగ్ వీల్స్, కొత్త ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, లేయర్డ్ డ్యాష్‌ బోర్డ్ ఉండనున్నాయి. క్యాబిన్​లో డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌, లెదర్​తో తయారుచేసిన ఫ్యాబ్రిక్ సీట్లతో ఈ కారు రానుంది.

ఫీచర్లు
ప్రస్తుత మోడల్​తో పోలిస్తే న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్​లో ఫీచర్లు ఎక్కువగా ఉండనున్నాయి. స్మార్ట్​ప్లే ప్రో, 9 అంగుళాల ఫ్లోటింగ్ టచ్​ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్‌, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, వైర్‌ లెస్ స్మార్ట్‌ ఫోన్ ఛార్జింగ్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ వంటి ఫీచర్లతో న్యూ-జెన్ మారుతి సుజుకి మార్కెట్లోకి రానుంది.

భద్రత
న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్​లో సేఫ్టీ ఫీచర్లు కూడా ఎక్కువగా ఉండనున్నాయి. స్విఫ్ట్ మాదిరిగానే మారుతి సుజుకి డిజైర్​లోనూ ఆరు ఎయిర్‌ బ్యాగ్​లు ఉండే అవకాశం ఉంది. ఈబీడీ, పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి అదనపు భద్రతా ఫీచర్లతో ఈ కారు మార్కెట్లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇంజిన్ ఆప్షన్లు
స్విఫ్ట్​లో ఉన్న ఇంజినే న్యూ జెన్ మారుతి సుజుకి డిజైర్​లో ఉండనున్నట్లు తెలుస్తోంది. 1.2 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్​తో ఈ కారు రానున్నట్లు తెలుస్తోంది. గరిష్ఠంగా 80 హెచ్​పీ పవర్​ను, 111 ఎన్ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌ మిషన్ ఎంపికలలో 5 స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ లభించనుంది. ఒక లీటర్ పెట్రోల్​కు 24.8- 25.19 కి.మీ మైలేజీని ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details