తెలంగాణ

telangana

ETV Bharat / business

నోయల్ టాటా మాస్టర్ స్ట్రోక్​ - అంబానీ, నైకాతో 'బ్యూటిఫుల్' ఫైట్ - NOEL TATA MASTER STROKE TO RELIANCE

బ్యూటీ మార్కెట్లోకి నోయల్​ టాటా మాస్ ఎంట్రీ - జూడియో బ్యూటీ బ్రాండ్​తో రిలయన్స్, నైకాకు గట్టి పోటీ

Noel Tata
Noel Tata (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 3:54 PM IST

Noel Tata Master Stroke To Reliance And Nykaa :రతన్​ టాటా వారసుడు నోయల్​ టాటా - నేరుగా రిలయన్స్, హిందూస్థాన్ యూనిలివర్​, నైకాకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. 'జూడియో బ్యూటీ' పేరుతో బ్యూటీ మార్కెట్లోకి అడుగుపెట్టారు. నోయల్ టాటా నేతృత్వంలోని 'ట్రెంట్'​కు ఇప్పటికే దేశవ్యాప్తంగా 550 వరకు జూడియో స్టోర్స్​ ఉన్నాయి. ఇప్పుడు వ్యాపార విస్తరణలో భాగంగా రిటైల్​ విభాగంలో జూడియో బ్యూటీని ప్రవేశపెట్టారు.

తక్కువ ధరకే బ్యూటీ ప్రొడక్ట్స్​
సాధారణంగా బ్యూటీ ప్రొడక్ట్స్​ చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. అందుకే వీటిని సరసమైన ధరలకు అందించాలని నోయల్ టాటా నిర్ణయించారు. జూడియో బ్యూటీ బ్రాండ్​ను మార్కెట్లోకి తెచ్చారు. దీనితో ఇప్పటికే ఈ సెగ్మెంట్​లో మార్కెట్ లీడర్​గా ఉన్న హిందూస్థాన్​ యూనిలివర్​కు గట్టి పోటీ ఎదురుకానుంది. అంటే హిందూస్థాన్ యూనిలివర్​కు చెందిన ఎల్18, సుగర్​ కాస్మోటిక్స్​, హెల్త్​ & గ్లో, కలర్​బార్​తో - జూడియో బ్యూటీ పోటీపడనుంది.

రిలయన్స్​, నైకాకు మాస్టర్​ స్ట్రోక్​
ఇండియాలో ప్రీమియం, లగ్జరీ బ్యూటీ ప్రొడక్ట్స్​ సెగ్మెంట్​లో రిలయన్స్, నైకా, షాపర్స్​ స్టాప్ ఉన్నాయి. ఈ కంపెనీల బ్యూటీ ప్రొడక్ట్స్​ చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. ఇవి సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం తక్కువ. అందుకే సామాన్యుల(మాస్​-మార్కెట్​)ను టార్గెట్​ చేసుకుని నోయల్ టాటా జూడియో బ్యూటీని తీసుకువచ్చారు. ఇప్పటికే బెంగళూరులో మొదటి జూడియో బ్యూటీ స్టోర్ ఓపెన్ చేశారు. త్వరలోనే గురుగ్రామ్​, పుణె, హైదరాబాద్​కు కూడా ఈ బిజినెస్​ను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే జరిగితే ఇండియన్​ బ్యూటీ మార్కెట్​లో దిగ్గజ కంపెనీల మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.

టాటా - బ్యూటీ లెగసీ
ఇండియన్ బ్యూటీ ఇండస్ట్రీలో టాటా గ్రూప్​ది విడదీయరాని బంధం. వాస్తవానికి భారతదేశంలో మొదటి బ్యూటీ బ్రాండ్​ 'లాక్మే' (Lakme)ను ప్రారంభించింది టాటా గ్రూప్​. అయితే తరువాత దీనిని హిందూస్థాన్ యూనిలివర్​కు అమ్మేసింది. అయినప్పటికీ బ్యూటీ ఇండస్ట్రీ నుంచి మాత్రం తప్పుకోలేదు. 'క్లిక్ పాలెట్' (Cliq Palette) పేరుతో ప్రీమియం కాస్మోటిక్​ ప్లాట్​ఫామ్​ను నడుపుతోంది. ఇప్పుడు కొత్తగా నోయల్ టాటా జూడియో బ్యూటీ పేరుతో మాస్​-మార్కెట్​ను టార్గెట్​ను టార్గెట్​ చేశారు.

జూడియో సక్సెస్ స్టోరీ
ట్రెంట్​కు చెందిన ప్రసిద్ధ బ్రాండ్ జూడియో. 2017లో ప్రారంభమైనప్పటి నుంచే ఇది సూపర్ సక్సెస్​ అయ్యింది. దీని ప్రత్యేకమైన డిజైన్​లతో కస్టమర్లను గొప్పగా ఆకట్టుకుంది. ఫలితంగా దీని గ్రాస్​ మార్జిన్​ చాలా వేగంగా 35-40 శాతం వరకు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జూడియోకు 559 వరకు స్టోర్​లు ఉన్నాయి.

బ్యూటీ బ్రాండ్స్ గ్రోత్​
ఇండియాలో సౌందర్య ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది. అందుకే ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్​లైన L'oreal, Shiseido లాంటివి ఇండియాలో బాగా ఆదరణ పొందుతున్నాయి. L'Orealకు ఉన్న అతిపెద్ద మార్కెట్లలో ఇండియా ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. ఇక Shiseido షాపర్స్ స్టాప్​తో కలిసి భారత్​లో నార్స్​ కాస్మోటిక్స్​ అనే ప్రీమియం బ్రాండ్​ను నడుపుతోంది. ఒక రిపోర్ట్ ప్రకారం, 'ప్రస్తుతం భారత్​లో మామా ఎర్త్​, నివియా, నైకా, L'Oreal లాంటి బ్రాండ్​లు 33 శాతం మార్కెట్ షేర్​ను కలిగి ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో వీటి మార్కెట్​ షేర్​ 42 శాతం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక భారతీయ కంపెనీలైన హిందూస్థాన్​ యూనిలివర్​, ప్రోక్టర్​ & గాంబుల్​ మార్కెట్ షేర్​ 2027 నాటికి 58 శాతానికి తగ్గే ఛాన్స్ ఉంది.' మరి ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లోకి ఎంటరైన టాటా బ్యూటీ బ్రాండ్​ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

టాటా ట్రస్ట్స్​​ ఛైర్మన్​గా నోయెల్ టాటా నియామకం

'మీరు జీవితంలో గొప్పగా ఎదిగేందుకు!' - రతన్ టాటా డాక్యుమెంటరీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్​ అంటే?

ABOUT THE AUTHOR

...view details