తెలంగాణ

telangana

ETV Bharat / business

రెగ్యులర్ ఇన్​కం + ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా? SWP స్ట్రాటజీ ఫాలో అవ్వండి! - Systematic Withdrawal Plan - SYSTEMATIC WITHDRAWAL PLAN

Systematic Withdrawal Plan : మీరు రెగ్యులర్​గా మంచి ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నారా? ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉండాలా? అయితే ఇది మీ కోసమే. సిస్టమాటిక్​ విత్​డ్రావెల్​ ప్లాన్​ (SWP)తో మీరు నెలవారీగా మంచి రాబడి సంపాదించే వీలుంటుంది. అలాగే పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. అది ఎలా అంటే?

SWP Strategy
Systematic Withdrawal Plan (ETV BHARAT TELUGU TEAM)

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 3:18 PM IST

Updated : May 5, 2024, 5:08 PM IST

Systematic Withdrawal Plan : భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం చాలా మంది మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా సిప్​ (SIP) విధానంలో ఒక క్రమ పద్ధతిలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. దీని వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్​లోనే 'సిస్టమాటిక్​ విత్​డ్రావెల్ ప్లాన్​' (SWP) అనే విధానం కూడా ఉంది. దీనిని ఉపయోగించి మీరు రెగ్యులర్​గా ఇన్​కం జనరేట్ చేయవచ్చు. అంటే నెల, మూడు నెలలు, ఏడాదికి ఒకసారి చొప్పున డబ్బులు విత్​డ్రా చేసుకోవచ్చు. పైగా పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

What is SWP?
మ్యూచువల్​ ఫండ్స్​లో దీర్ఘకాలంపాటు పెట్టుబడులు పెడితే, పదవీ విరమణ నాటికి చాలా పెద్దమొత్తంలో కార్పస్ (నిధి) ఏర్పడుతుంది. దీనిని పూర్తిగా విత్​డ్రా చేసుకోకుండా, అలానే కొనసాగిస్తే, మీ ఆదాయం మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే, మ్యూచువల్​ ఫండ్స్​లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది బాగా పనిచేస్తుంది. ఇలా మీరు పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్స్​లో మంచి కార్పస్ క్రియేట్ అయిన తరువాత, సిస్టమాటిక్ విత్​డ్రావెల్ ప్లాన్ ఉపయోగించి, రెగ్యులర్​గా ఆదాయం సంపాదించవచ్చు. పైగా పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. అది ఎలా అంటే?

మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్​ ఫండ్స్​ నుంచి ప్రతినెలా లేదా త్రైమాసికం లేదా ఏడాదికి ఒకసారి నిర్దిష్ట శాతాన్ని లేదా నిర్దిష్ట మొత్తాన్ని (Fixed Amount) విత్​డ్రా చేసుకోవచ్చు. దీనినే సిస్టమాటిక్​ విత్​డ్రావెల్ ప్లాన్ అంటారు. దీని వల్ల మీకు రెగ్యులర్​గా రాబడి వస్తుంది.

ట్యాక్స్ బెనిఫిట్స్​
మీరు కనుక ఒక ఏడాదికి మించి మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు కొనసాగిస్తే, అప్పుడు మీకు వచ్చే ఆదాయాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం (లాంగ్​-టెర్మ్​ క్యాపిటల్ గెయిన్​)గా భావిస్తారు. దీని వల్ల మీపై పడే పన్ను భారం బాగా తగ్గుతుంది. అంతేకాదు మీరు SWP విధానాన్ని ఎంచుకుంటే, మ్యూచువల్​ ఫండ్స్​పై వచ్చే నెలవారీ ఆదాయంపైన మాత్రమే పన్ను విధిస్తారు. అసలుపై ఎలాంటి పన్ను విధించరు. అలాకాకుండా మీరు మ్యూచువల్​ ఫండ్​లో ఇన్వెస్ట్ చేసిన ఒక సంవత్సరంలోపే డబ్బులు వెనక్కు తీసుకుంటే స్వల్పకాలిక మూలధన లాభం (షార్ట్​-టెర్మ్​ క్యాపిటల్​ గెయిన్​)గా భావించి, దానిపై అధిక పన్నులు వసూలు చేస్తారు.

సిస్టమాటిక్​ విత్​డ్రావెల్ ప్లాన్​లో కట్టాల్సిన పన్నును వాయిదా (Tax Deferral) వేసుకోవచ్చు కూడా. భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేసేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల మీరు ప్రతిసారీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఏడాది చివరిలో ఒకేసారి మొత్తం పన్ను చెల్లించవడానికి అవకాశముంటుంది.

ఆరోగ్య బీమా మరింత భారం - 15% పెరగనున్న ప్రీమియం! కారణం ఏంటంటే? - Health Insurance

SBI స్పెషల్ FD స్కీమ్​ - నచ్చినప్పుడు డబ్బులు విత్​డ్రా చేసుకునే ఛాన్స్​! - SBI MOD Scheme

Last Updated : May 5, 2024, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details