Stock Market Today September 19, 2024 :దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం సహా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 587 పాయింట్లు వృద్ధిచెంది 83,535 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 161 పాయింట్లు పెరిగి 25,539 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, టాటా మోటార్స్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ :హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సెర్వ్, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్
రూపాయి విలువ
Rupee Open September 19th, 2024 :అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 7 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.69గా ఉంది.