Stock Market Close Today April 16th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. పశ్చిమా దేశాల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టపోయి 72,943 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 124 పాయింట్లు కోల్పోయి 22,147 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు :టైటాన్, హిందూస్థాన్ యూనిలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్, రిలయన్స్, ఐటీసీ
- నష్టపోయిన షేర్లు : ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫిన్సెర్వ్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎస్బీఐ
ఆసియా మార్కెట్లు
Asian Markets Today April 16th 2024 :ఏసియన్ మార్కెట్లైన సియోల్, టోక్యో, హాంకాంగ్, షాంఘై అన్నీ భారీ నష్టాలతో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాలతో కొనసాగుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
ముడిచమురు ధర
Crude Oil Prices April 16th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.26 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 89.87 డాలర్లుగా ఉంది.
2.30 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 505 పాయింట్లు నష్టపోయి 72,894 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 130 పాయింట్లు కోల్పోయి 22,141 వద్ద కొనసాగుతోంది.
12.15 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 72,971 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 106 పాయింట్లు కోల్పోయి 22,166 వద్ద కొనసాగుతోంది.
11.30 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 393 పాయింట్లు నష్టపోయి 73,006 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 82 పాయింట్లు కోల్పోయి 22,190 వద్ద కొనసాగుతోంది.
11.00 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 347 పాయింట్లు నష్టపోయి 73,052 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 76 పాయింట్లు కోల్పోయి 22,196 వద్ద కొనసాగుతోంది.