తెలంగాణ

telangana

ETV Bharat / business

దలాల్ స్ట్రీట్​ ఢమాల్​​ - సెన్సెక్స్​ 845 & నిఫ్టీ 246 పాయింట్స్ డౌన్​! - Stock Market Crash Today - STOCK MARKET CRASH TODAY

Stock Market Today April 15th 2024 : సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 845 పాయింట్లు, నిఫ్టీ 246 పాయింట్లు నష్టపోయాయి.

Stock market crash today
Stock Market Today April 15th 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 9:46 AM IST

Updated : Apr 15, 2024, 4:27 PM IST

Stock Market Close April 15th 2024 :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి. సెన్సెక్స్​ 845 పాయింట్లు నష్టపోయి 73,399 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 246 పాయింట్లు కోల్పోయి 22,272 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తుండడమే ఇందుకు కారణం. మరోవైపు యూఎస్​ ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే భారీగా పెరుగుతోంది. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇవి కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.

  • లాభపడిన స్టాక్స్​​ : నెస్లే ఇండియా, మారుతి సుజుకి, భారతీ ఎయిర్​టెల్​
  • నష్టపోయిన షేర్స్​ : ​విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఎల్​ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్​, టాటా మోటార్స్​, టెక్​ మహీంద్రా, టాటా స్టీల్​

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.8,027 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.

ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లో సియోల్​, టోక్యో, హాంకాంగ్​ నష్టాలతో ముగిశాయి. షాంఘై ఒక్కటే లాభాలతో స్థిరపడింది. యూరోపియన్ మార్కెట్లు ప్రస్తుతం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

ముడిచమురు ధర
Crude Oil Prices April 15th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 1.04 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 89.51 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
Rupee Open March April 15th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 6 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.44గా ఉంది.

03.00 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 838 పాయింట్లు నష్టపోయి 73,406 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 248 పాయింట్లు కోల్పోయి 22,271 వద్ద కొనసాగుతోంది.

01.10 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 617 పాయింట్లు నష్టపోయి 73,645 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 175 పాయింట్లు కోల్పోయి 22,344 వద్ద కొనసాగుతోంది.

12.00 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 487 పాయింట్లు నష్టపోయి 73,757 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 139 పాయింట్లు కోల్పోయి 22,379 వద్ద కొనసాగుతోంది.

11.42 AM :ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 496 పాయింట్లు నష్టపోయి 73,743 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 143 పాయింట్లు కోల్పోయి 22,376 వద్ద కొనసాగుతోంది.

Stock Market Today April 15th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 929 పాయింట్లు, నిఫ్టీ 216 పాయింట్లు నష్టపోయాయి. కీలకమైన అన్ని రంగాలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Reasons For Stock Market Crash :అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, భారత్​-మారిషస్​ పన్ను ఒప్పందంలో మార్పులు ప్రతిపాదించడం, విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తుండడమే ఇందుకు కారణం. మరోవైపు ఊహించిన దానికంటే యూఎస్​లో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతున్నాయి. ఇవి కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 768 పాయింట్లు నష్టపోయి 73,466 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 231 పాయింట్లు కోల్పోయి 22,288 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టీసీఎస్​, నెస్లే ఇండియా, టైటాన్, భారతీ ఎయిర్​టెల్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​టాటా మోటార్స్​, టాటా స్టీల్​, పవర్​గ్రిడ్​, ఎస్​బీఐ, ఎన్​టీపీసీ, రిలయన్స్​, ఏసియన్​ పెయింట్స్​, విప్రో, ఐటీసీ

విదేశీ పెట్టుబడులు
FIIs Investments :స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.8,027 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.

ఆసియా మార్కెట్లు
Asian Markets Today April 15th 2024 :ఏసియన్ మార్కెట్లో సియోల్​, టోక్యో, హాంకాంగ్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి. షాంఘై ఒక్కటే లాభాల్లో ట్రేడ్ అవుతోంది. శుక్రవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.

రూపాయి విలువ
Rupee Open March April 15th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 6 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.44గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices April 15th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.17 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 90.30 డాలర్లుగా ఉంది.

నేటి గోల్డ్​ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today April 15th 2024

భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం - పక్కాగా ప్లాన్ చేసుకోండిలా! - Personal Financial Planning

Last Updated : Apr 15, 2024, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details