Sony LIV Subscription Plans : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓవర్-ది-టాప్ (ఓటీటీ)ల హవా నడుస్తోంది. మనకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియో, జీ5, ఆహా లాంటి చాలా ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అయితే కల్వర్ మాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ యాజమాన్యానికి చెందిన 'సోనీ లివ్' వీటన్నింటి కంటే చాలా ముందే ఇండియాలో స్ట్రీమింగ్ సేవలు ప్రారంభించింది. మరి ఈ ఓటీటీ ప్లాట్‌ఫాం అందిస్తున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌పై మనమూ ఓ లుక్కేద్దామా?
సూపర్ కంటెంట్ :సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లోలైవ్ స్పోర్ట్స్, చలన చిత్రాలు, టీవీ ప్రోగ్రామ్స్, వెబ్ సిరీస్‌లు సహా, సోనీ లివ్ ఒర్జినల్ కంటెంట్ ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, భోజ్‌పురి, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ తదితర భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉంది. ఇది మనదేశంతో పాటు UAE , ఖతార్ , కువైట్ , సౌదీ అరేబియా , ఒమన్ , బహ్రెయిన్ , బంగ్లాదేశ్ , నేపాల్ , శ్రీలంక , మాల్దీవులు , భూటాన్ ,మలేషియా , సింగపూర్ , హాంకాంగ్ , మకావు , చైనా , తైవాన్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో స్ట్రీమింగ్ సేవలు అందిస్తోంది.
ఈ సోనీ లివ్ ప్లాట్ఫామ్లో మనకు 4 రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో మంత్లీ ప్లాన్, 6 నెలల ప్లాన్, ఇయర్లీ ప్రీమియం ప్లాన్స్ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు.
Sony Liv 299 Plan : ఈ నెలవారి ప్లాన్ ధర రూ.299. యూజర్లు 5 డివైజ్‌లలో లాగిన్ అయ్యి ఓటీటీ కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. కానీ ఒకసారికి ఒక డివైజ్‌లో మాత్రమే కంటెంట్ చూడడానికి వీలవుతుంది. వీడియోను 1080p (ఫుల్ హెచ్డీ) క్వాలిటీలో వీక్షించవచ్చు. 2.1 స్టీరియోలో మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు.
Sony Liv 699 Plan :ఇది 6 నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్. ఈ ప్లాన్ ధర రూ.699. యూజర్లు 5 డివైజ్‌ల్లో లాగిన్ కావచ్చు. కానీ ఒకసారి కేవలం 2 డివైజ్‌ల్లో మాత్రమే దీనిని వీక్షించడానికి వీలవుతుంది. 1080p (ఫుల్ హెచ్డీ) క్వాలిటీతో వీడియోలు చూడొచ్చు. స్టీరియో 2.1 క్వాలిటీతో ఆడియో వినవచ్చు.