తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం భారమవుతోందా? EMIలా మార్చుకుని సింపుల్​గా చెల్లించండిలా! - CREDIT CARD EMI CONVERSION

క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చుకుంటే లాభమా, నష్టమా? - బెస్ట్ ఆప్షన్​ ఏదంటే​?

Credit Card Bill EMI Conversion
Credit Card (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2025, 11:06 AM IST

Credit Card Bill EMI Conversion : క్రెడిట్‌ కార్డు ఉంటే మంచిదని చాలా మంది నమ్ముతారు. అది నిజం కూడా. కానీ, దాన్ని ఎలా వినియోగిస్తున్నామనే అంశంపై అది ఆధారపడుతుంది. క్రెడిట్‌ కార్డు ఉపయోగించి వస్తువులు సులభంగా కొనుగోలు చేయవచ్చు కానీ ఆ బిల్లు కట్టేటప్పుడే వస్తుంది అసలు కష్టమంతా. పెద్ద మొత్తంలొ క్రెడిట్‌ కార్డు బిల్లుల్ని కట్టడం ఒత్తిడితో కూడుకున్న పని.

అందుకే దీన్ని అధిగమించడానికి పలు కంపెనీలు క్రెడిట్ కార్డు బిల్లులు ఈఎంఐలుగా చెల్లించుకునే అవకాశాన్ని కల్పించాయి. బిల్లుకు సమానంగా నెలలవారీగా వాయిదాలు చెల్లించుకునే వెసులుబాటు కల్పించాయి. క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కొనుగోలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించడానికి బదులుగా, నిర్ణీత వ్యవధిలో చిన్న, నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. దీని వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుందా?
క్రెడిట్‌ కార్డు బిల్లును ఈఎంఐ రూపంలో చెల్లించాలనే విధానం రుణదాతల వ్యూహాత్మక ప్రణాళికల్లో ఒకటి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వినియోగదారులు క్రమంగా బిల్లు చెల్లిస్తారని వారు భావిస్తారు. క్రెడిట్‌ కార్డు బిల్లును ఈఎంఐ రూపంలో కట్టడం వల్ల క్రెడిట్‌ స్కోర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. ఈఎంఐ చెల్లించే విధానంపై అది ఆధారపడి ఉంటుంది. ఈఎంఐని సకాలంలో చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్‌ మెరుగుపడుతుంది. ఇది భవిష్యత్తులో రుణం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈఎంఐ చెల్లింపులో ఏదైనా ఆలస్యం జరిగితే మాత్రం క్రెడిట్ స్కోర్​పై ప్రతికూల ప్రభావం పడుతుంది.

లాభ నష్టాలు ఇవే
క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐలుగా మార్చడం వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్లులను చిన్న మొత్తాలుగా ఈఎంఐ రూపంలో చెల్లించడం వల్ల మనకు ఒత్తిడి ఉండదు. పైగా నిర్ణీత కాలంలో క్రమం తప్పకుండా బిల్లును చెల్లించవచ్చు. దీని వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించకపోతే విధించే ఛార్జీలతో పోలిస్తే ఈఎంఐ వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా నెలలవారీగా డబ్బులు చెల్లించడం వల్ల ఆర్థిక ప్రణాళికలు కూడా సులభతరంగా మారుతాయి.

ఇక నష్టాల విషయానికి వస్తే, ఈఎంఐలు వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజులతో పాటు ఇతర అదనపు ఖర్చులు ఉంటాయి. వాటిని రెగ్యులర్‌గా చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రెడిట్‌ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

క్రెడిట్ కార్డ్స్​ 'సీజనల్' రివార్డులతో ఫుల్​ మనీ సేవ్! ఈ టిప్స్​ పాటిస్తే స్మార్ట్​గా​ ఉపయోగించొచ్చు!

ఇన్​స్టాంట్​ క్రెడిట్ కార్డ్ తెలుసా? సిబిల్​ స్కోర్ తక్కువున్నా నో ప్రాబ్లమ్​- జస్ట్ అది ఉంటే క్షణాల్లో మంజూరు!

ABOUT THE AUTHOR

...view details