Sensex, Nifty Hit Record High :శుక్రవారందేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నూతన జీవన కాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. ముఖ్యంగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి, జీవన కాల గరిష్ఠం 80,519 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 186 పాయింట్లు వృద్ధి చెంది, లైఫ్ టైమ్ హైలెవల్ 24,502 వద్ద ముగిసింది.
ఐటీ స్టాక్స్ ర్యాలీ కొనసాగడం, టీసీఎస్ జూన్ త్రైమాసిక ఫలితాల్లో భారీ లాభాలు చూపించడమే ఇందుకు కారణం. దీనికి తోడు ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు రాణించడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది.
- లాభపడిన స్టాక్స్ : టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ
- నష్టపోయిన షేర్స్ :మారుతి సుజుకి, ఏసియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా,
ఇంట్రాడేలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 996 పాయింట్లు లాభపడి 80,893 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 276 పాయింట్లు వృద్ధి చెంది 24,592 వద్ద లైఫ్ టైమ్ పీక్స్‌ను టచ్ చేసింది.
అంతర్జాతీయ మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ లాభాలతో ముగిశాయి. సియోల్, టోక్యో మార్కెట్లు నష్టపోయాయి. గురువారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.