ETV Bharat / international

తైవాన్‌పై దాడులకు సిద్ధమవుతున్న చైనా - ట్రంప్​ అధ్యక్ష పదవి చేపట్టేలోగా!

తైవాన్‌పై యుద్ధానికి చైనా సిద్ధమవుతోందా? - యుద్ధానికి సన్నాహాలను బలోపేతం చేయాలని సైన్యానికి జిన్‌పింగ్‌ సూచనలు!

China Taiwan War Trump
China Taiwan War Trump (Source Getty Images and Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2024, 9:32 PM IST

China Taiwan War : స్వతంత్ర ద్వీపదేశమైన తైవాన్‌పై చైనా దాడులకు సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల తమ దేశ సైనికులకు పిలుపునిచ్చారు. చైనా వ్యతిరేకిగా పేరొందిన డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన పదవి చేపట్టడానికి ఇంకా 75 రోజులు సమయం ఉంది. ఈలోగా తైవాన్‌పై చైనా దాడులు చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇదే సరైన సమయమని - ఒకవైపు ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు సాయంగా ఉత్తర కొరియా సైన్యం బరిలోకి దిగింది. మరోవైపు పశ్చిమాసియాలో హెజ్‌బొల్లా, హమాస్‌, ఇరాన్‌లతో ఇజ్రాయెల్‌ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. ఇంకోవైపు అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అధికార మార్పిడి ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టి వీటిపై నెలకొనడం వల్ల ఇదే అదునుగా చేసుకొని స్వతంత్ర ద్వీపదేశమైన తైవాన్‌పై చైనా దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి తమపై లేకపోవడం వల్ల తైవాన్‌పై దాడులకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు యుద్ధానికి, సంసిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల తమ దేశ సైనికులకు పిలుపునిచ్చారు. ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను సందర్శించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాలని సైన్యానికి పిలుపునిచ్చినట్లు ఆ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. తమ దళాలు పటిష్ఠమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలని సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని జిన్‌పింగ్‌ సూచించారు.

యుద్ధం సన్నద్ధతపై ఆందోళన - భారత్‌, చైనా మధ్య వాస్తవాధీన రేఖ- LAC వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇటీవల ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అందుకు అనుగుణంగానే సరిహద్దుల్లో తూర్పు లద్దాఖ్‌ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్‌, డెస్పాంగ్‌ నుంచి రెండు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న మరిన్ని వివాదాలకు భవిష్యత్తులో పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనా తన సరిహద్దు దేశాలను బెదిరించడం లేదు కానీ తమ సైనికులను యుద్ధానికి సిద్ధం చేస్తుండటంపై ఆందోళన నెలకొంది.

ఆ చర్యలకు హెచ్చరికగా - ఇటీవల తైవాన్‌ చూట్టూ చైనా పెద్దఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించిన కొద్దిరోజులు తర్వాత ఈ ప్రకటన రావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తైవాన్‌ను తన భూభాగంగా చెబుతున్న చైనా మిగతా దేశాల దృష్టి తమపై లేనప్పుడే దాడి చేయాలని చూస్తోంది.

గతనెల అక్టోబర్‌లో తైవాన్‌ చుట్టూ 153 చైనా మిలిటరీ విమానాలు చక్కర్లు కొట్టినట్లుగా తైవాన్‌ రక్షణశాఖ వెల్లడించింది. తైవాన్‌ స్వతంత్ర దళాల, వేర్పాటువాద చర్యలకు హెచ్చరికగా ఈ భారీ విన్యాసాలను చేపట్టినట్లు చైనా ప్రకటించింది. తైవాన్‌, ఏ దేశానికీ అధీనం కాదని ఆ దేశ అధ్యక్షుడు లై చింగ్‌ వ్యాఖ్యలకు హెచ్చరికగా ఈ చర్యలు చేపట్టినట్లు చైనా తెలిపింది. తైవాన్‌ జాతీయ దినోత్సవం జరిగిన ఐదు రోజుల తర్వాత సైనిక విన్యాసాలు చేపట్టి చైనా గట్టి హెచ్చరికలు పంపింది.

అందుకే తైవాన్​పై చైనా, అమెరికా కన్ను- చైనా కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా తైవాన్‌కు అండగా అమెరికా మద్దతు ఇస్తోంది. తైవాన్‌పై చైనా, అమెరికా కన్నుపడటానికి ప్రధాన కారణం అక్కడి చిప్స్‌ పరిశ్రమ. ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు వాడే సిలికాన్‌ చిప్స్‌ ఉత్పత్తిలో తైవాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సెమీకండక్టర్లను తయారు చేసే సంస్థ, తైవాన్‌ సెమీకండక్టర్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ కంపెనీ TSMC తైవాన్‌లోనే ఉంది. ఈ రంగంలో గ్లోబల్‌ మార్కెట్‌లో దాదాపు 55 శాతం తైవాన్‌ నుంచే వస్తోంది. అందుకే అమెరికా, చైనాలు తైవాన్‌పై కన్నేశాయి.

ప్రస్తుతం అమెరికాలో అధికార మార్పిడి హడావుడి నెలకొంది. చైనా వ్యతిరేకిగా పేరొందిన డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన పదవి చేపట్టడానికి ఇంకా 75 రోజులు సమయం ఉంది. ఈ సమయంలోనే తైవాన్‌పై దాడులు చేయాలని జిన్‌పింగ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2నెలల తర్వాతే ట్రంప్​ ప్రమాణ స్వీకారం - అసలు ఎందుకు ఇంత ఆలస్యం?

చైనా మరోసారి కవ్వింపు చర్యలు- తైవాన్ చుట్టూ 125 యుద్ధవిమానాలతో సైనిక విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.