Small Grains Health Tips : ఇటీవల కాలంలో కొందరు రైతులు చిరుధాన్యాల సాగును కొద్దీ విస్తీర్ణంలో చేపట్టి విస్తరిస్తున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల ఇతర రాష్ట్రాల నుంచి చిరుధాన్యాలను దిగుమతి చేసుకొని అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు సాగు పెరిగితే వినియోగదారులకు సరసమైన ధరలోనే అవి అందుబాటులోకి వస్తాయి. రైతులకు సైతం విక్రయ అవకాశాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జొన్న అంబలి, రాగి జావ, ఉలవచారు, మక్కగట్క, సామల ఉప్మా, కొర్రల కిచిడీ, పాయసం, జొన్న రొట్టె, గుడాలు, సూప్, చిరుధాన్యాల మిశ్రమ పిండితో రొట్టెలు, బజ్జీలు, బిర్యానీ, వడ, ఉప్మా, కట్లెట్, కీర్, ఇడ్లీలు, దోశ తయారు చేసి విక్రయిస్తుండటం, ఇళ్లలోనూ వీటివాడకం క్రమంగా పెరుగుతోంది.
అంతేకాకుండా మురుకులు, బిస్కెట్లు తదితరాలను తయారు చేస్తున్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోని నేలలు వీటి సాగుకు అనువుగా ఉన్నాయి. దీంతో యాసంగిలో పండించదగిన ఈ పంటల విత్తనాలను ప్రభుత్వం రాయితీపై ఇవ్వటం, మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తుల కొనుగోలు, ఉప ఉత్పత్తుల తయారీ తదితరాలతో ప్రోత్సాహాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ చిరుధాన్యాలను ప్రతిరోజు తింటే మనిషికి ఎన్నడూ జబ్బు చేయడని నిపుణులు చెబుతున్నారు.
ఇవి ప్రయోజనాలు :
- ఆలస్యంగా జీర్ణమవటంవల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు లాభిస్తుంది.
- వీటిల్లో చక్కెర పదార్థాలు తక్కువగా ఉండగా టైప్ 2 చక్కెరవ్యాధి నిరోధానికి దోపదపడతాయి.
- చిరుధాన్యాల్లోని మెగ్నీషియం అధిక రక్తపోటు తగ్గిస్తుంది.
- చిరుధాన్యాల్లో బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఖనిజ లవణాలు పిల్లల్లో ఎదుగుదలకు సాయపడతాయి.
- నాడీవ్యవస్థ సక్రమ పనితీరుకు, పాస్పరస్ శరీర కణాల పెరుగుదలకు, పిండి పదార్థాలు శక్తిగా మారడానికి దోహదడపతాయి.
- వీటిలోని నయాసిస్ అనే బి-విటమిన్ బ్లడ్‌లోని చెడుకొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
- వీటి వల్ల గుండెసంబంధిత వ్యాధులు సైతం తగ్గుతాయి.
- కాలేయం, మూత్రపిండాలు, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తాయి.
- పేగుసంబంధిత క్యాన్సర్లు, అల్సర్లు ఏర్పడే అవకాశాలను సైతం తగ్గిస్తుంది.
- ఊబకాయం, మలబద్దకం, తిమ్మిరి, ఉబ్బసం వంటివి రాకుండా సహకరిస్తాయి.
- సామలలో ఎక్కువగా ఖనిజ లవణం, ఇనుము ఉండటంతో మహిళల్లో రక్కహీనతను నివారిస్తుంది.
- పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా అధిక పీచుపదార్థం కాపాడుతుంది.
చిరు ధాన్యాలతో ఆరోగ్య సిరి - వరదాయినిగా మారిన మిల్లెట్స్ - Millets Benefits in Daily Life