ETV Bharat / business

ఎడ్యుకేషన్​ లోన్ EMI భారం ఈజీగా తగ్గాలా? ఇలా చేయండి!

ఎడ్యుకేషన్​ లోన్​ భారంగా ఉందా? కెరీర్​పై దృష్టి పెట్టలేకపోతున్నారా? ఈ వ్యూహాలు పాటిస్తే మీ లోన్​ సులభంగా క్లియర్​ అవుతుంది!

How To Reduce Education Loan EMI
How To Reduce Education Loan EMI (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 4:22 PM IST

How To Reduce Education Loan EMI : ఉన్నత చదువుల కోసం చాలా మంది ఎడ్యుకేషన్​ లోన్స్​ తీసుకుంటారు. రుణం తీసుకున్నాక ప్రతి నెల ఈఎమ్​ఐ కట్టాల్సి ఉంటుంది. నెల నెల ఈఎమ్​ఐ కట్టడం భారంగా అనిపించే అవకాశం ఉంది. అయితే, ఈ భారాన్ని తగ్గించుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. తద్వారా లోన్​పై కాకుండా విద్యార్థులు కెరీర్​పై దృష్టి పెట్టవచ్చు. విద్యారుణాన్ని సులభంగా ఎలా మేనేజ్​ చేయాలి, ఫైనాన్షియల్​ లోడ్​ను ఎలా తగ్గించుకోవాలనే వ్యూహాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎక్కువ రీపేమెంట్ వ్యవధిని ఎంచుకోండి
లోన్​ ఈఎమ్​ఐ భారాన్ని తగ్గించుకోవాలని అనుకునే వారు రీపేమెంట్​ వ్యవధి వీలైనంత ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెల నెల చెల్లించే ఈఎమ్​ఐ మొత్తం తగ్గుతుంది. అయితే, తాత్కాలికంగా భారం తగ్గినప్పటికీ, లోన్​ జీవితకాలంలో చెల్లించే వడ్డీ మొత్తం పెరుగుతుంది. లోన్​ టెన్యూర్​ పొడగింపు నిబంధనలను అర్థం చేసుకోవడానికి మీ రుణదాతను సంప్రదించి వివరాలు తెలుసుకోండి.

2. మారటోరియం వ్యవధిని సద్వినియోగం చేసుకోండి
చాలా వరకు ఎడ్యుకేషన్​ లోన్​లకు మారటోరియం పీరియడ్​ వర్తిస్తుంది. ఈ సమయంలో రుణ గ్రహీతలు ఈఎమ్​ఐలు కట్టాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా ఈ వ్యవధి గ్రాడ్యుయేషన్ తర్వాత 6 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగం వెతుక్కోవడానికి, సంపాదించడం ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ మారటోరియం సమయంలో ఈఎమ్​ఐలు చెల్లించడం తప్పనిసరి కాకున్నా, వడ్డీ కట్టుకోవచ్చు. తద్వారా రెగ్యులర్ ఈఎమ్​ఐలు ప్రారంభమైతే మీ లోన్​ భారం కాస్తైనా తగ్గుతుంది.

3. తక్కువ వడ్డీ రేటు కోసం చర్చలు జరపండి
బ్యాంకులు, అర్థిక సంస్థలను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇతర బ్యాంకులు తక్కువ వడ్డీ అందిస్తున్నట్లు మీరు తెలుసుకుంటే, వడ్డీ రేటు తగ్గించమని మీ రుణదాతతో చర్చలు జరపచ్చు. అది కుదరకపోతే తక్కువ వడ్డీ రేటు అందించే మరో రుణదాత వద్ద లోన్​ తీసుకునే అంశాన్ని పరిశీలించండి. ఇలా చేసేటప్పుడు లోన్​ నిబంధనలను జాగ్రత్తగా సరిపోల్చండి.

4. వీలైనప్పుడల్లా ముందస్తు చెల్లింపులు చేయండి
లోన్​పై ముందస్తు చెల్లింపులు చేయడం వల్ల వడ్డీ, ఈఎమ్​ఐ మొత్తం తగ్గుతుంది. అసలు మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది. ముందస్తు చెల్లింపుల కోసం ఏదైనా బోనస్​లు, పన్ను రీఫండ్​లు లేదా అదనపు ఆదాయాన్ని వినియోగించండి. కొంత మంది రుణదాతలు అదనపు ఛార్జీలు లేకుండా పాక్షిక ముందస్తు చెల్లింపులను అనుమతిస్తారు. కాబట్టి అలాంటి పాలసీ గురించి మీ బ్యాంక్‌ను సంప్రదించండి.

5. వడ్డీ చెల్లింపులపై పన్ను ప్రయోజనాలను ఉపయోగించండి
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద, విద్యా రుణాలపై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. అయితే దీని ద్వారా మీ ఈఎమ్​ఐ నేరుగా తగ్గనప్పటికీ, ట్యాక్స్​ సేవింగ్స్​- మీ లోన్​ భారాన్ని తగ్గించగలవు. ముందస్తు చెల్లింపుల కోసం మరిన్ని నిధులను కేటాయించవచ్చు. ఇన్​కమ్​ ట్యాక్స్​ రిటర్న్​లో ఈ బెనిఫిట్​ను క్లెయిమ్​ చేసుకోవాలని గుర్తుంచుకోండి.

6. లోన్​ను రీఫైనాన్స్​ చేయండి
ఒకవేళ మీకు ఒకటి కంటే ఎక్కువ రుణాలు లేదా అధిక వడ్డీ లోన్​లు ఉంటే, తక్కువ వడ్డీ రేటుతో వాటన్నిటినీ ఏకీకృతం చేయడానికి ప్రయత్నించండి. చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రీఫైనాన్సింగ్​ ఆప్షన్​ అందిస్తాయి. ఈ ఆప్షన్లు ఇంకా మెరుగైన నిబంధనలు, ఎక్స్​టెండెడ్​ రీపేమెంట్​తో రావచ్చు. అయితే రీఫైనాన్సింగ్​కు నిర్దిష్ట ఫీజు ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు ఖర్చు-ప్రయోజనాన్ని సరిపోల్చండి. ​

7. శాలరీ ఇంక్రిమెంట్లతో ఈఎమ్​ఐ మొత్తాన్ని పెంచండి
రుణగ్రహీతలు వారి కెరీర్​లో ముందుకువెళుతున్నప్పుడు, వారి సంపాదన పెరుగుతున్నప్పుడు ఈఎమ్​ఐ మొత్తాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిచండి. ఇలా చేయడం ద్వారా లోన్​ టెన్యూర్​ సహా రుణంపై చెల్లించే వడ్డీ మొత్తం తగ్గుతుంది. ఇలా చేయడానికి క్రమశిక్షణ చాలా అవసరం. ఇలా చేయడం వల్ల రుణం వేగంగా క్లియర్ చేయడం సహా వడ్డీపై మొత్తం ఆదా చేసుకోవచ్చు.

8. ఆదాయం ఆధారంగా రీపేమెంట్​ ప్లాన్​ ఎంచుకోండి
కొన్ని బ్యాంకులు ఆదాయ ఆధారిత రీపేమెంట్ ప్లాన్‌లను అందిస్తాయి. ఇక్కడ ఈఎమ్​ఐ మొత్తం, మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ప్లాన్‌ల ప్రకారం, మీ ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు మీరు తక్కువ ఈఎమ్​ఐ చెల్లిస్తారు. ఇది మీ జీతం పెరిగే కొద్దీ పెరుగుతుంది.

పేద విద్యార్థులకు రూ.10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్- ష్యూరిటీ అవసరం లేదు - అప్లై చేసుకోండిలా!

ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ - బెస్ట్ బెనిఫిట్స్ ఇవే! - Education Loan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.