తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త స్కూటీ కొనాలా? ఆ మోడల్​పై ఏకంగా రూ.45వేలు డిస్కౌంట్​! - Scooter Offers In March 2024 - SCOOTER OFFERS IN MARCH 2024

Scooter Offers In March 2024 : కొత్త స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? సరైన ఆఫర్ల కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ మార్చి నెలలో పలు స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ లభిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

March Offers On Two Wheelers
Scooty Offers In March 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 4:21 PM IST

Scooter Offers In March 2024 :ఇండియన్​ మార్కెట్లో చాలా రకాల స్కూటీలు అందుబాటులో ఉన్నాయి. అందులో సాధారణ స్కూటీల నుంచి ఎలక్ట్రిక్​ స్కూటీల వరకూ లెక్కలేనన్ని టూ-వీలర్లు ఉన్నాయి. అయితే మార్చి నెలలో వీటిపై కొన్ని కంపెనీలు ఆఫర్లు అందిస్తున్నాయి. అవి క్యాష్​ డిస్కౌంట్, ఆఫర్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఆ ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం రండి.

BGauss D15
బిగౌస్ డీ15 ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్. ఇండియాలో బిగౌస్ డీ15 ధర రూ.1.34 లక్షల నుంచి రూ.1.45 లక్షల వరకు ఉంది. బిగౌస్ డీ15 క్లెయిమ్డ్​ రేంజ్​ 115 కి.మీ. దీనిని పూర్తిగా ఛార్జింగ్​ చేయడానికి 5.5 గంటలు సమయం పడుతుంది. అయితే ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్‌తో దీనిని 1.30 గంటల్లోనే ఛార్జ్​ చేయవచ్చు. దీనిలో ముందు, వెనుక భాగాల్లో డ్రమ్​ బ్రేక్‌లు ఉంటాయి. దీని బరువు 109 కిలోలు. ఇది 5 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. బిగౌస్​ డీ15 స్కూటీకి ఒకినావా Okhi90 నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మార్చి నెలలో దీనిపై రూ.10,000 వరకు క్యాష్​ డిస్కౌంట్​ను అందిస్తున్నారు.

Ola S1 Pro
ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్​ స్కూటర్. ఇండియాలో ఓలా ఎస్1 ప్రో ధర రూ.1.29 లక్షలుగా ఉంది. ఓలా ఎస్1 ప్రో క్లెయిమ్డ్​ రేంజ్​ 195 కి.మీ. దీనికి ఫాస్ట్​ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది.​ దీనిని ఫుల్​ ఛార్జ్​​ చేయడానికి 6.5 గంటలు సమయం పడుతుంది. దీనికి ముందు, వెనుక భాగాల్లో డిస్క్​ బ్రేక్‌లు ఉంటాయి. దీని బరువు 125 కిలోలు ఉంటుంది. ఇది 5 అందమైన రంగుల్లో లభిస్తుంది. అందుబాటులో ఉంది. ఈ ఎస్1 ప్రో స్కూటీ నేరుగా ఏథర్ 450 అపెక్స్, ఏథర్ 450X, బజాజ్ చేతక్‌లకు గట్టి పోటీనిస్తోంది. దీనిపై మార్చి నెలలలో రూ.17,500 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది.

Vegh L25
వేగ్​ ఎల్​25 ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్. ఇండియాలో వేగ్​ ఎల్​25 ధర రూ.78,999 ఉంటుంది. వేగ్​ ఎల్​25 క్లెయిమ్డ్​ రేంజ్​ 70 కి.మీ. దీనిని పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి 4-5 గంటలు సమయం పడుతుంది. ఇది ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఇది కేవలం 2 కలర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మార్చి నెలలో దీనిపై రూ.17,500 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు.

Honda Activa 6G
హోండా యాక్టివా 6జీలో 109సీసీ సామర్థ్యం గల ఇంజిన్ ఉంది. ఇండియాలో హోండా యాక్టివా 6జీ ధర రూ.77,835 నుంచి రూ.84,335 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది. ఇది 50 kmpl మైలేజీని ఇస్తుంది. దీని ముందు, వెనుక భాగాల్లో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. దీని బరువు 105 కిలోలు. దీనిలో 5.3 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఇది మొత్తం 8 కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. యాక్టివా 6జీ అనేది సుజుకి యాక్సెస్ 125, సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్, టీవీఎస్​ జూపిటర్‌లకు గట్టి పోటీనిస్తోంది. దీనిని కేవలం రూ.6 వేల డౌన్​పేమెంట్​తో సొంతం చేసుకోవచ్చు.

Vida V1
విదా వీ1 ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇండియాలో విదా వీ1 ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.45 లక్షల వరకు ఉంటుంది. విదా వీ1 క్లెయిమ్డ్ రేంజ్ 100 కి.మీ. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనిని 65 నిమిషాల్లో (0-80%) ఛార్జ్ చేయవచ్చు. దీని ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. దీని బరువు 124 కిలోలు. ఇది మొత్తం 5 అందమైన రంగుల్లో లభిస్తుంది. విదా వీ1 నేరుగా ఏథర్ 450S, ఏథర్​ 450X, బజాజ్ చేతక్‌లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ మార్చి నెలలో దీనిపై ఏకంగా రూ.45,000 వరకు డిస్కౌంట్​ ఇస్తున్నారు.

రూ.2 లక్షల్లో మంచి బైక్​ కొనాలా? టాప్​-10 పవర్​ఫుల్​ మోడల్స్​ ఇవే!

మంచి టూ-వీలర్​ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-3 అప్​కమింగ్​ బైక్స్ ​& స్కూటీస్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details