Safest Sedan Cars In India 2024 List : సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఎస్యూవీ కార్లు ముందు ఉంటాయి. కానీ ఓ మూడు సెడాన్ కార్లు ఎస్‌యూవీల కంటే మెరుగైన సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉన్నాయి. అవే ఫోక్స్‌వ్యాగన్ వర్టిస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా. వీటికి గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (GNCAP) 5-స్టార్ రేటింగ్ ఉంది. అందుకే ఈ బెస్ట్ సేఫ్టీ-రేటెడ్ కార్లపై ఓ లుక్కేద్దాం రండి.
5 Star Rating Sedan Cars :
1. Volkswagen Virtus Safety Features : ఈ ఫోక్స్‌వ్యాగన్ వర్టిస్ కారుకు ఎన్సీఏపీ 5-స్టార్ రేటింగ్ ఉంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ కేటగిరీలో 34 పాయింట్లకు గాను ఇది 29.71 పాయింట్లను సాధించింది. చిల్డ్రన్ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ కేటగిరీలో ఇది 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు సాధించింది. కనుక ఈ ఫోక్స్‌వ్యాగన్ కారులో పెద్దలు, చిన్న పిల్లలు అందరూ సురక్షితంగా ప్రయాణించవచ్చు.
ఈ ఫోక్స్‌వ్యాగన్ వర్టిస్ కారులో స్టాండర్డ్‌గా రెండు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈసీఎస్) ఉంటాయి. ఇండియన్ మార్కెట్లో ఈ కారు ధర సుమారుగా రూ.11.56 లక్షల నుంచి రూ.19.41 లక్షల (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
2. Skoda Slavia Safety Features : ఈ స్కోడా స్లావియా కారుకు కూడా జీఎన్సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఉంది. ఫోక్స్‌వ్యాగన్ వర్టిస్ లాగానే ఈ స్కోడా సెడాన్ కారు కూడా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ కేటగిరీలో 34 పాయింట్లకు గాను 29.71 పాయింట్లు; చిల్డ్రన్ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ కేటగిరీలో 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు సాధించింది.