తెలంగాణ

telangana

ETV Bharat / business

అడ్వెంచర్​ ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారా? పర్సనల్​ లోన్​ మంచి ఆప్షనే- కానీ! - Reasons To Get A Personal Loan - REASONS TO GET A PERSONAL LOAN

Reasons To Get A Personal Loan : మీరు ఫారిన్ ట్రిప్, అడ్వెంచర్స్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? అయితే మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలివే!.

Reasons To Get A Personal Loan
Reasons To Get A Personal Loan (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 2:54 PM IST

Reasons To Get A Personal Loan :అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు కావాలి ఎలా? అనే ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు చాలా మందికి గుర్తుకు వ‌చ్చేది వ్య‌క్తిగ‌త రుణం. బ్యాంకులు ముంద‌స్తు ఆమోదంతో ఆఫ‌ర్ చేస్తుండ‌డం, ఆన్​లైన్​​లో త‌క్కువ స‌మ‌యంలోనే ఆమోదించ‌డం, హామీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డం- ఇటువంటి అనుకూల‌త‌లు ఉండ‌డం వ‌ల్ల చాలా మంది పర్సనల్ లోన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కొందరికి ప్రయాణాలు, అడ్వెంచర్స్ (సాహస యాత్రలు) అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలో ఫారిన్ టూర్స్, నచ్చిన ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అందుకు భారీగానే ఖర్చవుతుంది.

కొందరు పర్సనల్ లోన్​తో తీసుకుని ఫారిన్ టూర్ వెళ్లాలని ప్రణాళిక వేసుకుంటారు. ఊదాహరణకు సింగపూర్​కు వారం రోజుల టూర్ ప్లాన్ చేసుకుంటే ఒక వ్యక్తికి కనీసం రూ.లక్ష వరకు ఖర్చు అవ్వొచ్చు. అదే దుబాయ్​కి వెళ్లాలనుకుంటే రూ.1-2 లక్షల వరకు ఉండాల్సిందే. ఈ ఖర్చులకు అడ్వెంచర్ స్పోర్ట్స్​ను జోడిస్తే, ఖర్చులు మరింత ఎక్కువవుతాయి. చేతిలో నగదు లేనప్పుడు అడ్వెంచర్స్, టూర్స్ వాయిదా వేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు పర్సనల్ లోన్స్ ఉపయోగపడతాయి. అయితే మీరు మీ లైఫ్ అడ్వెంచర్స్ కోసం ఎక్కువ మొత్తంలో వ్యక్తిగత రుణాన్ని తీసుకోవాలని ఆలోచిస్తే ఈ విషయాలను పరిగణలోకి తీసుకోండి.

1. లైఫ్ అడ్వెంచర్ కోసం లోన్
లైఫ్ అడ్వెంచర్స్ కోసం చేతిలో నగదు లేనప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం మీ ముందున్న ఒక అవకాశం. లైఫ్ అడ్వెంచర్స్ కోసం లోన్ తీసుకోవడం అనేది మీరు భవిష్యత్తులో చేయాల్సిన ఖర్చులను ఇప్పుడే చేసేస్తున్నట్లు లెక్క.

2. ప్రత్యేకంగా లోన్స్ లేవు
మీరు అడ్వెంచర్, ఫారిన్ టూర్​ల కోసం అప్పు అయినా చెయ్యాలి. లేదంటే పర్సనల్ లోన్ తీసుకోవాలి. అంతేగానీ అడ్వెంచర్ కోసం బ్యాంకులు లేదా రుణ సంస్థలు ప్రత్యేకంగా లోన్స్ ఏమీ ఇవ్వట్లేదు.

3. భవిష్యత్​లో చెయ్యాల్సినవి ఇప్పుడే
కొందరు భవిష్యత్తులో వెళ్లే ఫారిన్ టూర్స్, లైఫ్ అడ్వెంచర్ కోసం డబ్బు ఆదా చేస్తుంటారు. అయితే వయసులో ఉన్నప్పుడు లైఫ్ అడ్వెంచర్​కు వెళ్లడం మంచిది. ఎందుకంటే మీరు ఆర్థికంగా స్థిరపడి, మీ వద్ద డబ్బులు సరిపడా ఉన్నప్పటికి మీ స్నేహితులు అందుబాటులో ఉండకపోవచ్చు. వాతావరణం పరిస్థితులు అనుకోలించకవచ్చు. జీవితంలో కొన్ని కష్టాలు ఎదురవ్వొచ్చు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, మీరు ఆనందంగా ఉండేందుకు లోన్ తీసుకుని అడ్వెంచర్​కు వెళ్లడం ఉత్తమం. అయితే ఇది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి తోసేయకూడదు.

4. ఎక్కువ మొత్తంలో లోన్
మీ ప్రస్తుత అవసరాలు తీర్చుకోవడానికి వ్యక్తిగత రుణాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. భవిష్యత్తులో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి, లోన్ తిరిగి కట్టేయాలి. అనవసర ఖర్చులకు మాత్రం పర్సనల్ లోన్ వాడకూడదనే విషయం గుర్తుంచుకోండి.

5. అడ్వెంచర్
కొంతమందికి ప్రయాణాలు, అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. అందుకు మీరు వ్యక్తిగత రుణం తీసుకుని, సంతోషంగా ఫారిన్ ట్రిప్​నకు వెళ్లొచ్చు. చేతిలోనే టూర్​కు కావాల్సిన నగదు ఉంటే, పర్సనల్ లోన్​తో పని ఉండదు.

మరికొందరు ఆర్థిక నిపుణులు, లైఫ్ అడ్వెంచర్ కోసం పర్సనల్ లోన్​ను ఎక్కువగా తీసుకోవడం కంటే, ముందునుంచే ఒక ప్రణాళికతో తగినంత సొమ్ము పొదుపు చేయడం తెలివైన పని అని అంటున్నారు. లోకల్, ఫారిన్ ట్రిప్స్ కోసం ప్రతినెలా ఆర్​డీని కట్టమని సూచిస్తున్నారు. ఈ ఫండ్ అడ్వెంచర్స్, ఫారిన్ టూర్స్​కు పనికొస్తుందని చెబుతున్నారు.

పర్సనల్ లోన్ Vs క్రెడిట్ కార్డ్ లోన్​ - వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్​? - Credit Card Loan Vs Personal Loan

అర్జెంట్​గా పర్సనల్ లోన్​ కావాలా? కానీ మీ జీతం రూ.25,000లోపే ఉందా? ఎంత రుణం వస్తుందంటే? - Personal Loan On My Salary

ABOUT THE AUTHOR

...view details