How To Use Digilocker In Telugu : విలువైన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను డిజిటల్‌గా భద్రపరుచుకోవడం,షేర్ చేసుకోవడం, అవసరం అయినప్పుడు వెరిఫై చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందే డిజిలాకర్. పేపర్ లెస్ సదుపాయం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఈ వ్యవస్థలో ఎవరైనా సరే ఖాతా తెరిచి డాక్యుమెంట్లను, సర్టిఫికెట్లను సేవ్ చేసుకోకునే వెసులుబాటు ఉంది. మొబైల్ నంబర్ లేదా ఆధార్ కార్డు నంబర్లలో ఒకదానిని నమోదు చేయగానే వన్ టైం పాస్ వర్డ్ వస్తుంది. దీని ద్వారా యూనిక్ డిజిలాకర్ నంబర్‌ను మనం సృష్టించుకోవచ్చు.
How To Store Documents On Digilocker App : ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఇది చట్టబద్ధం అయింది. ఇప్పటికే 42.76 కోట్ల యూజర్లు డిజిలాకర్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ఆధార్, ఐవోసీ, ఈపీఎఫ్‌వో,ఎన్‌ఐసీ, ఆదాయ పన్ను శాఖ ఇలా వందకు పైగా కేంద్ర ప్రభుత్వ సర్వీసులు డిజిలాకర్ ఇష్యూయర్లుగా ఉన్నాయి. పదో తరగతి బోర్డు, ఉన్నత విద్య, మీ సేవ, రాష్ట్ర రవాణా, పౌర సరఫరాల, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, పురపాలక శాఖలతో సహా 30 విభాగాలు కూడా డిజిలాకర్ సేవలు అందిస్తున్నాయి.
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి : -
- ఎక్కడికైనా తీసుకెళ్లే వెసులుబాటు ఉండడంతో ల్యాప్‌టాప్‌ను ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందులోని డేటాను భద్రంగా ఉంచుకునేందుకు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి.
- మీ బ్రౌజర్లు, ఆపరేటింగ్ సిస్టమ్, ఇతర సాఫ్ట్‌వేర్‌లను తరచూ అప్‌డేట్ చేసుకోవాలి. మాల్‌వేర్లను పసిగట్టేందుకు నమ్మదగిన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడంతో పాటు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.
- ల్యాప్‌టాప్‌లోని డేటాను ఎక్స్‌టర్నల్ డ్రైవ్ లేదా క్లౌడ్ సర్వీసుల్లో సేవ్ చేసుకోవాలి.
- హానికర ఫైళ్లను నిలువరించేందుకు ఫైర్‌వాల్‌ను ఉపయోగించాలి.
ఎలా వినియోగించాలంటే?
- మీ ఫోన్‌లో డిజీలాకర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆరంకెల సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయాలి.
- మీ ఆధార్‌కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి.
- తర్వాత ఆధార్ నంబర్ లేదా ఆరంకెల సెక్యూరిటీ సాయంతో సైన్- ఇన్ అవగానే మీ ఆధార్ కార్డు వివరాలు అందులో ప్రత్యక్షమవుతాయి. పైన కుడివైపున మీ ఫొటో కనిపిస్తుంది.
- యాప్‌లో కింద ఉన్న సెర్చ్ సింబల్‌పై క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్ ప్రత్యక్షమవుతాయి.
- వాటిలో మీ ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకొని హాల్‌టికెట్ నంబర్, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్ చేసి సులభంగా డాక్యుమెంట్లు పొందొచ్చు.
- వీటితో పాటు పాన్, రేషన్ లాంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న పత్రాలు కింద ఉన్న డిజీలాకర్ డ్రైవ్‌లో కనిపిస్తాయి.
అమ్మాయిలూ - మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్ ఉంటే చాలు! ఎక్కడికెళ్లినా సేఫ్‌గా ఉండొచ్చు! - my safetipin app