తెలంగాణ

telangana

ETV Bharat / business

10 ఏళ్లలో చేతికి రూ.17 లక్షలు - పోస్టాఫీసు సూపర్​ స్కీమ్​! - Post Office RD Scheme

Post Office Saving Schemes: పొదుపు అందరికీ అవసరం. ఇందుకోసం ఎన్నో పథకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటే పోస్టాఫీస్ రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్. ఇందులో 10 సంవత్సరాలు పెట్టుబడి పెడితే రూ.17 లక్షలు చేతికి వస్తాయి! అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Post Office Saving Schemes
Post Office Saving Schemes

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 11:37 AM IST

Post Office RD Scheme: నేటి జనరేషన్​ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా.. వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత పొదుపు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేందుకు వీలుగా పొదుపు చేస్తున్నారు. అయితే మనం సంపాదించిన డబ్బును మదుపు చేసేందుకు అందుబాటులో ఉన్న బెస్ట్​ ఇన్వెస్ట్​మెంట్ స్కీమ్స్​లో ఆర్​డీ(రికరింగ్​ డిపాజిట్​) ఒకటి. ప్రస్తుతం ఈ రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్​ను దేశంలోని వివిధ బ్యాంకులతో పాటు ఇండియన్​ పోస్ట్​ ఆఫీస్ కూడా అందిస్తోంది. అయితే బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసులోనే మదుపు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ స్కీమ్​లో పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల్లో రూ. 17 లక్షలు చేతికొస్తాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రికరింగ్​ డిపాజిట్లు:రికరింగ్​ డిపాజిట్స్​ అనేవి ఓ ప్రత్యేకమైన టర్మ్​ డిపాజిట్లు. అయితే తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలనుకునే వారికి పోస్టాఫీసు రికరింగ్​ డిపాజిట్​ మంచి ఎంపిక. ఈ పథకంలో మీరు నెలవారీ ప్రాతిపదికన పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే. ఈ పథకంపై కేంద్రం ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. కనీసం రూ.100 నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టవచ్చు. దానికి పరిమితి లేదు. ఉదాహరణకు.. నెలకు రూ.1000 చొప్పున 5 ఏళ్లపాటు ఇన్వెస్ట్​ చేస్తే మీ పెట్టుబడి మొత్తం రూ.60 వేల వరకు ఉంటుంది. మరో ఐదేళ్లు పొడిగించి 10 ఏళ్ల తర్వాత తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.1.70 లక్షల వరకు చేతికి అందుతుంది.

నెలవారీ ఆదాయం కావాలా? పోస్టాఫీస్​లో ఇన్వెస్ట్ చేస్తే రూ.9వేలు ఇన్​కమ్ పక్కా!

మరి 10 సంవత్సరాల్లో రూ.17 లక్షలు పొందాలంటే..మీరు ఈ స్కీమ్​లో చేరి పదేళ్లలో 17 లక్షల రూపాయలు పొందాలనుకుంటే.. మీరు రోజుకు రూ.333 పెట్టుబడి పెట్టాలి. అంటే మీ పెట్టుబడి నెలకు రూ.10 వేలు అవుతుంది. ఈ స్కీమ్​ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు కాబట్టి.. ఈ సమయానికి మీ మొత్తం పెట్టుబడి వడ్డీతో కలిపి రూ.7 లక్షల 13వేలు అవుతుంది. అయితే.. మీరు మరో 5 సంవత్సరాలు పొడిగించారని అనుకుంటే అప్పుడు 10 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి రూ.12 లక్షలు, దానిపై వడ్డీ రూ.5లక్షల 8వేల 546 అవుతుంది. అంటే 10 ఏళ్ల తర్వాత మీకు అసలు, వడ్డీతో కలిపి 17లక్షల 8వేల 546 రూపాయలు చేతికి వస్తాయి. రిస్క్​ లేకుండా పెట్టుబడి పెట్టే వారికి ఈ స్కీమ్ బెస్ట్​ ఆప్షన్​ అంటున్నారు నిపుణులు.

Note:పైన తెలిపిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వాణిజ్య రంగ నిపుణులు సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కాబట్టి ఈ ప్లాన్​లో పెట్టుబడి పెట్టేముందు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని ఇన్వెస్ట్​ చేయడం మంచిది.

పోస్టాఫీసులో ఇన్ని పొదుపు పథకాలా? ఏ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేసినా సూపర్ బెనిఫిట్స్​!

Post Office Saving Scheme : పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్​.. ఎలాంటి రిస్కు లేకుండా డబ్బులు డబుల్..!

ABOUT THE AUTHOR

...view details