PM Kisan 16th Instalment 2024 :రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం "ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి" పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు అందజేస్తోంది. ఈ నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అయితే ఈ సొమ్ము ఒకేసారి కాకుండా మొత్తం 3 దఫాలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అంటే ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి (ఏప్రిల్-జులై, ఆగస్ట్-నవంబర్, డిసెంబంర్- మార్చి) ఈ నిధులు రైతుల అకౌంట్లో జమ అవుతాయి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 15 విడతలుగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేసింది. పీఎం కిసాన్ 16వ విడత నిధులను ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే, ఈ-కేవైసీ చేసి ఉండాలి. అర్హులైన రైతుల ఖాతాల్లో డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్) పద్ధతిలో పెట్టుబడి సాయం జమ అవుతుంది.
బెనిషియరీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
PM Kisan Beneficiary Status :
- పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్, ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
- తర్వాత Know Your Status అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఫిల్ చేయాలి.
- ఆ తర్వాత Get Data అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోవాలి?
- ముందుగా మీరు www.pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- వెబ్‌సైట్‌లోని "Beneficiary List" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోవాలి.
- లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయాలి. అంతే సింపుల్!
- మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు అక్కడ కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి.