OTT Plans Comparison :భారతదేశంలో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హవా నడుస్తోంది. తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ దొరకడం, నచ్చినప్పుడు నచ్చిన వీడియో కంటెంట్ చూడడానికి వీలు కలుగుతుండడమే ఇందుకు కారణం. అందుకే చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం కంటే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో తమకు నచ్చిన మూవీస్, వెబ్‌సిరీస్, డాక్యుమెంటరీస్, స్పోర్ట్స్, న్యూస్ చూడడానికి ఇష్టపడుతున్నారు. మరి మీరు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఇష్టపడతారా? అయితే ఇది మీ కోసమే. ఈ 2024 అక్టోబర్‌లో ఇండియాలోని మోస్ట్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్‌స్టార్, జియో సినిమా ఓటీటీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? వాటిలో బెస్ట్ ప్లాన్ ఏది? అనేది ఇప్పుడు చూద్దాం.
NETFLIX Plans and Pricing :నెట్‌ఫ్లిక్స్‌లో 4 రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తాయి.
1. Mobile Plan :
- నెలకు రూ.149లతో ఈ మొబైల్ ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
- అన్-లిమిటెడ్ యాడ్-ఫ్రీ సినిమాలు, టీవీ షోలు చూడవచ్చు. మొబైల్ గేమ్స్ ఆడుకోవచ్చు.
- 480p (SD) క్వాలిటీతో వీడియోలు చూడవచ్చు.
- మీకు నచ్చిన కంటెంట్‌ను ఒక ఫోన్‌లో లేదా ట్యాబ్లెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2. Basic Plan :
- నెలకు రూ.199లతో ఈ బేసిక్ ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
- అన్-లిమిటెడ్ యాడ్-ఫ్రీ సినిమాలు, టీవీ షోలు చూడవచ్చు. మొబైల్ గేమ్స్ ఆడుకోవచ్చు.
- 720p (HD) క్వాలిటీతో వీడియోలు చూడవచ్చు.
- మీకు నచ్చిన కంటెంట్‌ను ఒకసారికి ఒక డివైజ్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
3. Standard Plan :
- నెలకు రూ.499లతో ఈ స్టాండర్డ్ ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
- అన్-లిమిటెడ్ యాడ్-ఫ్రీ సినిమాలు, టీవీ షోలు చూడవచ్చు. మొబైల్ గేమ్స్ ఆడుకోవచ్చు.
- 1080p (ఫుల్ హెచ్‌డీ) క్వాలిటీతో వీడియోలు చూడవచ్చు.
- మీకు నచ్చిన కంటెంట్‌ను ఒకేసారి 2 డివైజ్‌ల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
4. Premium Plan :
- నెలకు రూ.649లతో ఈ ప్రీమియం ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
- అన్-లిమిటెడ్ యాడ్-ఫ్రీ సినిమాలు, టీవీ షోలు చూడవచ్చు. మొబైల్ గేమ్స్ ఆడుకోవచ్చు.
- 4కె (ఆల్ట్రా హెచ్‌డీ) + హెచ్‌డీఆర్ క్వాలిటీతో వీడియోలు చూడవచ్చు.
- మీకు నచ్చిన కంటెంట్‌ను ఒకేసారి 6 డివైజ్‌ల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- నెట్‌ఫ్లిక్స్ స్పేసియల్ ఆడియో వినవచ్చు.
Amazon Prime Membership Plans :అమెజాన్ ప్రైమ్‌లో 4 మెంబర్‌షిప్ ప్లాన్స్ ఉన్నాయి. అవి :
1. మంత్లీ ప్లాన్ : ఈ నెలవారీ ప్లాన్ ధర రూ.299.
2. క్వార్టర్లీ ప్లాన్ : ఈ మూడు నెలల ప్లాన్ ధర రూ.599
3. యాన్యువల్ ప్లాన్ : ఈ 12 నెలల ప్లాన్ ధర రూ.1,499
4. యాన్యువల్ ప్రైమ్ లైట్ : ఈ 12 నెలల ప్లాన్ ధర రూ.799
Amazon Prime Benefits : ఈ అమెజాన్ ప్రైమ్ ప్లాన్స్ తీసుకున్నవాళ్లు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు చూడవచ్చు. అలాగే ప్రైమ్ మ్యూజిక్, గేమ్స్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ బుక్స్ చదివేందుకు వీలుగా ప్రైమ్ రీడింగ్ ఉచితంగా లభిస్తుంది. అలాగే అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్స్, డీల్స్ పొందవచ్చు. ముఖ్యంగా అమెజాన్ వెబ్‌సైట్‌లో వస్తువులు కొనుగోలు చేస్తే, ఒకటి లేదా రెండు రోజుల్లో ఫ్రీ డెలివరీ పొందవచ్చు. ప్రైమ్ డే సేల్స్ సమయంలో సాధారణ యూజర్లతో పోల్చితే, వీరికి ఒకరోజు ముందుగా డీల్స్, ఆఫర్స్ పొందే ఛాన్స్ లభిస్తుంది. కొన్ని ప్లాన్స్‌పై అమెజాన్ ఫ్యామిలీ ఆఫర్స్ కూడా ఉంటాయి.
Disney+Hotstar Subscription Plans :డిస్నీ+హాట్‌స్టార్‌లో 3 రకాల ప్లాన్‌లు ఉన్నాయి. అవి:
1. మొబైల్ ప్లాన్ :ఈ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నవాళ్లు కేవలం మొబైల్ ఫోన్‌లో మాత్రమే మూవీస్, లైవ్ స్పోర్ట్స్, టీవీ షోస్, స్పెషల్స్ చూడగలుగుతారు. 720p హెచ్‌డీ క్వాలిటీతో వీడియో, స్టీరియో ఆడియో క్వాలిటీతో ఓటీటీ కంటెంట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. కానీ మధ్యమధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. ఈ మొబైల్ ప్లాన్ ధర : రూ.149/3 నెలలు; రూ.499/12 నెలలు
2. సూపర్ ప్లాన్ :మొబైల్‌తోపాటు టీవీ, ల్యాప్‌టాప్‌లో డిస్నీ+హాట్‌స్టార్ కంటెంట్ చూడవచ్చు. 1080p ఫుల్‌హెచ్‌డీ క్వాలిటీతో వీడియో, డాల్బీ ఆట్మోస్ ఆడియో క్వాలిటీతో ఆడియోను ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఈ ప్లాన్‌లో యాడ్స్ వస్తుంటాయి. ఈ సూపర్ ప్లాన్ ధర : రూ.299/ 3 నెలలు; రూ.899/12 నెలలు
3. ప్రీమియం ప్లాన్ :ఈ ప్రీమియం ప్లాన్‌లో డిస్నీ+హాట్‌స్టార్‌లోని కంటెంట్ మొత్తాన్ని చూడవచ్చు. 4k 2160p + డాల్బీ విజన్ క్వాలిటీ వీడియో, డాల్బీ అట్మోస్ క్వాలిటీ ఆడియోతో ఓటీటీ కంటెంట్ చూడవచ్చు. ఒకేసారి 4 డివైజ్‌ల్లో ఈ కంటెంట్ చూడవచ్చు. స్పోర్ట్స్ తప్పించి, మిగతా వీడియోలు చూస్తున్నప్పుడు ఎలాంటి ప్రకటనలు రావు. ఈ ప్రీమియం ప్లాన్ ధర : రూ.299/ఒక నెల; రూ.499/3 నెలలు; రూ.1499/12 నెలలు
JioCinema Plans :జియో సినిమాలో రెండు రకాల ప్లాన్స్ ఉన్నాయి. అవి:
1. జియో సినిమా ప్రీమియం : ఈ ప్లాన్ ధర నెలకు కేవలం రూ.29 మాత్రమే. దీనిలో యాడ్-ఫ్రీ ప్రీమియం కంటెంట్ చూడవచ్చు. కానీ స్పోర్ట్స్, లైవ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రకటనలు వస్తుంటాయి. 4కె క్వాలిటీతో ఈ వీడియోలు చూడవచ్చు. అవసరమైతే డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. కానీ కేవలం ఒక డివైజ్‌లో మాత్రమే వీటిని చూడడానికి వీలవుతుంది.
2. జియో సినిమా ఫ్యామిలీ :ఈ ప్లాన్ ధర రూ.89. దీనిలో ప్రీమియం ప్లాన్‌లో ఉన్న అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ప్లాన్ తీసుకుని ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు 4 డివైజ్‌ల్లో ఒకేసారి ఈ జియో సినిమా కంటెంట్‌ను చూడవచ్చు.