తెలంగాణ

telangana

ETV Bharat / business

సుక్యన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్​లో పెట్టుబడి పెడుతున్నారా? - కేంద్రం షాకింగ్​ డెసిషన్​! - New Interest rates of Sukanya - NEW INTEREST RATES OF SUKANYA

New Interest Rates: మీరు సుక్యన్య సమృద్ధి యోజన, పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే మీకో షాకింగ్​ న్యూస్​. ఈ రెండిటి పథకాల వడ్డీ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం షాకింగ్​ డెసిషన్​ తీసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

New Interest Rates
New Interest rates of Sukanya Samriddhi and PPF Schemes (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 2:49 PM IST

New Interest rates of Sukanya Samriddhi and PPF Schemes: భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం చాలా మంది పొదుపుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు తోచినంత పోస్టాఫీసు లేదా బ్యాంకుల్లో ఇన్వెస్ట్​ చేస్తున్నారు. ఇక పోస్టాఫీసులో అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్​ చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవి.. చిన్న మొత్తాల్లో డిపాజిట్లు చేయొచ్చు. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్​ ఉంటుంది కాబట్టి గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి.

అయితే వడ్డీ రేట్లు ఒక్కో పథకంలో ఒక్కోలా ఉంటాయి. కొన్నింట్లో టాక్స్ బెనిఫిట్స్ బాగుంటాయి. మరికొన్నింట్లో షార్ట్ టర్మ్‌లో మంచి లాభాలు వస్తే.. ఇంకొన్ని లాంగ్ టర్మ్‌లో అధిక మొత్తంలో నిధి సమకూర్చేందుకు దోహదపడతాయి. ఇక పోస్టాఫీసు పథకాల్లో చూస్తే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి అకౌంట్ స్కీమ్, ఉద్యోగులకు ఉపయోగపడే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకాలకు ఆదరణ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ స్కీమ్స్ ఇన్వెస్టర్లకు కేంద్రం మరోసారి చేదు వార్త వినిపించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​.. పథకాల వడ్డీ రేట్లు ప్రతి 3 నెలలకు ఓసారి కేంద్రం సవరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా 2024 జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి గానూ కేంద్రం కొత్త వడ్డీ రేట్లు విడుదల చేసింది. అయితే ఇక్కడ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం ఇన్వెస్టర్లకు పెద్ద షాక్​ అని చెప్పవచ్చు. కొత్త వడ్డీ రేట్లు చూస్తే..

'స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు యథాతథం' - ఆర్థిక శాఖ ప్రకటన

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు:ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెచ్చిన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఇందులో ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ ఉంది. పది సంవత్సరాల వయసున్న ఆడపిల్ల పేరిట అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. అకౌంట్ తెరిచిన తర్వాత క్రమం తప్పకుండా 15 సంవత్సరాలు డబ్బులు పెట్టుబడి పెట్టాలి. ఏడాదికి కనిష్ఠంగా రూ. 250 నుంచి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

ఈ పథకంలో ఇద్దరు ఆడపిల్లల్ని చేర్పించొచ్చు. వీటిల్లో డిపాజిట్లపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఇక ఆర్థిక సంవత్సరం చివర్లో వడ్డీ జమ అవుతుంది. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు పూర్తైనా లేదా పదో తరగతి పాసైనా.. 50 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు. ఇక అకౌంట్ ఓపెన్​ చేసిన 21 సంవత్సరాలుకు పూర్తిగా డబ్బులు తీసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి వివాహ సమయంలో కూడా డబ్బులు పూర్తిగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

పీపీఎఫ్ వడ్డీ రేట్లు:పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. ఇక్కడ ఏడాదికి కనీసం రూ. 500, గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. దీని కింద ఒకరు ఒకే అకౌంట్ ఓపెన్​ చేయాలి. ఏడాదిలో ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో కూడా కట్టొచ్చు. ఇక్కడ కూడా ఆర్థిక సంవత్సరంలో చివర్లోనే వడ్డీ జమవుతుంది. దీంట్లో పెట్టుబడులు, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ డబ్బులపై టాక్స్ ఆదా చేసుకోవచ్చు. దీంట్లో అకౌంట్ ఓపెన్ చేశాక.. రెండో సంవత్సరంలోనే లోన్ కూడా పొందొచ్చు. ఇక్కడ కూడా 15 సంవత్సరాలు డబ్బులు కట్టాలి. ఆ తర్వాత ఐదేళ్ల చొప్పున గడువు పొడిగించుకుంటూ పోవొచ్చు.

పర్సనల్ లోన్​ తిరిగి చెల్లించలేదా? డిఫాల్టర్లకు జరిగే నష్టాలివే!

రైతులకు గుడ్​న్యూస్​ : ఈ స్కీమ్​తో రూ.3 లక్షల రుణం - ఇంకా బీమా, మరెన్నో బెనిఫిట్స్​!

ABOUT THE AUTHOR

...view details