తెలంగాణ

telangana

ETV Bharat / business

సెర్చింగే కాదు గూగుల్​ క్రోమ్​లో ఆ 7 పనులు కూడా! ఈ విషయం మీకు తెలుసా? - GOOGLE CHROME NEW FEATURES

వినియోగదారులకు మరింత ఈజీగా గూగుల్ క్రోమ్ సెర్చ్ రిజల్ట్స్- వాతావరణ రిపోర్టు, కాలిక్యులేషన్స్ అన్నీ క్రోమ్​లోనే!

Google Chrome New Features
Google Chrome New Features (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 12:12 PM IST

Google Chrome New Features :బ్రౌజర్‌ అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది గూగుల్‌ క్రోమ్‌. మెరుగైన సెర్చ్‌ అనుభవాన్ని అందించడం కోసం గూగుల్‌ క్రోమ్​లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తుంటుంది. అయితే వీటి ద్వారా గూగుల్ క్రోమ్​లో వాతావరణ సమాచారం, కాలిక్యులేషన్స్ వంటివి ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

గూగుల్ క్రోమ్​లో పైన అడ్రస్ బార్ ఉంటుంది. దీన్ని ఓమ్నిబాక్స్ అని కూడా పిలుస్తారు. అయితే మనకు కావాల్సిన సమాచారం కోసం క్రోమ్​లో టైప్ చేసి పొందొచ్చు. అయితే మనీ కాలిక్యులేషన్స్, వాతావరణ నివేదికలు వంటివి వేరేగా చూసుకోవాల్సి వచ్చేది. లేదంటే మరో ట్యాబ్ ఓపెన్ చేసి వీటిని చెక్ చేసుకునేవాళ్లం. అయితే ఇకనుంచి క్యాలిక్యులేషన్స్, వాతావరణ సమాచారం వంటి వాటిని ఈజీగా తెలుసుకోవచ్చు.

జెమిని ఏఐతో చాట్
ఓమ్నిబాక్స్‌ లేటెస్ట్ ఎడిషన్ గూగుల్ జెమినీ ఏఐతో లింక్ అవుతోంది. ఈ చాట్‌ బాట్​ను యాక్సెస్ చేయడానికి "@gemini" అని టైప్ చేసి, ఆపై స్పేస్, మీ క్వరీని టైప్ చేయండి. అప్పుడు క్రోమ్ మీ గూగుల్ అకౌంట్​తో అనుసంధానమై జెమినీ వెర్షన్ ఓపెన్ అవుతుంది.

మనీ క్యాలిక్యులేషన్స్ మరింత ఈజీగా
మీరు క్రోమ్​లో మరో ట్యాబ్ ఓపెన్ చేయకుండానే ఓమ్నిబాక్స్‌ లో నగదును మార్పిడిని తెలుసుకోవచ్చు. అమెరికా డాలర్లను రూపాయిలో తెలుసుకోవచ్చు. ఊదాహరణకు "£₹34 in US dollars," అని టైప్ చేయండి. అప్పుడు మీరు ఎంటర్ బటన్​పై క్లిక్ చేయకుండానే డాలర్లులో ఉన్న నగదు రూపాయిల్లో తెలిసిపోతుంది.

మరింత ఈజీగా కాలిక్యులేషన్స్
ఓమ్నిబాక్స్​లోనే ఈజీగా కాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. "352+91" అని కొడితే వెంటనే సమాధానం వచ్చేస్తుంది. అలాగే ఓమ్నీ బాక్స్​లో "weather" అని టైప్ చేస్తే, మీ లొకేషన్ ఆధారంగా వాతావరణ పరిస్థితులు తెలిసిపోతాయి.

ఈజీగా బుక్ మార్క్ సెర్చ్
అలాగే బుక్ మార్క్ లను సెర్చ్ చేయడం అంత సులభం కాదు. అయితే బుక్ మార్క్ ఫోల్డర్ నేమ్ టైప్ చేయడం ద్వారా వాటిని సులువుగా తెలుసుకోవచ్చు. అలాగే ఏదైనా పదం అబ్రివేషన్ కావాలన్నా మరింత ఈజీగా తెలుసుకోవచ్చు. ఓమ్నీబాక్స్​లో మీకు కావాల్సిన పదాన్ని టైప్ చేసి "define" అని టైప్ చేయండి. అప్పుడు మీకు కావాల్సిన అబ్రివేషన్ వస్తుంది. అలాగే ఓమ్నిబాక్స్​లో ఏదైనా సెర్చ్ చేస్తే వాటికి వెంటనే సమాధానం లభిస్తుంది. ఉదాహరణకు, పర్వతాల ఎత్తు, ప్రముఖుల వయసు, స్టాక్ ధరలు, మరిన్నింటిని త్వరగా తనిఖీ చేయవచ్చు.

ABOUT THE AUTHOR

...view details