Maruti Suzuki Cuts Prices :కార్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్. దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్-ప్రెసో మోడళ్లలోని కొన్ని వేరియంట్ల ధరలను తగ్గించినట్లు సోమవారం వెల్లడించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
1. Maruti Suzuki S-Presso Price Cut :ఎస్-ప్రెస్సో LXI పెట్రోల్ వేరియంట్ కారు ధరను రూ.2,000 వరకు తగ్గించినట్లు మారుతి సుజుకి తెలిపింది. ప్రస్తుతం ఎస్-ప్రెస్సో కారు ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.11 లక్షల (ఎక్స్‌షోరూం, దిల్లీ) మధ్య కొనసాగుతోంది.
Maruti Suzuki S-Presso Features :మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోలో చాలా వేరియంట్లు ఉన్నాయి. వాటిలో స్టాండర్డ్ వేరియంట్ మాత్రమే రూ.5 లక్షల బడ్జెట్లో లభిస్తుంది. మిగతా వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్టాండర్డ్ ఎస్-ప్రెస్సో కారులో కూడా ఆల్టో కె10లో ఉన్న 1.0 లీటర్ కె10సీ ఇంజినే ఉంటుంది.
2. Maruti Suzuki Alto K10 Price Cut :ఆల్టో కే10 VXI పెట్రోల్ వేరియంట్ కారు ధరను రూ.6,500 వరకు తగ్గించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి వెల్లడించింది. ప్రస్తుతం ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంది.