LIC Index Plus Policy : ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇటీవలే 'ఇండెక్స్ ప్లస్' పాలసీని లాంఛ్ చేసింది. ఇది ఒక యూనిట్-లింక్డ్, రెగ్యులర్ ప్రీమియం, వ్యక్తిగత జీవిత బీమా ప్లాన్.
ఈ ఎల్ఐసీ ప్లాన్ తీసుకున్నవారికి, పాలసీ వ్యవధి కాలంలో జీవిత బీమా సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక పొదుపు, పెట్టుబడి పథకంలా కూడా పనిచేస్తుంది. ఒక నిర్ణీత పాలసీ సమయం గడిచిన తరువాత వార్షిక ప్రీమియం ప్రకారం గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి.
అర్హతలు
LIC Index Plus Policy Eligibility :ఈ ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీని 90 రోజుల పసిపిల్లల నుంచి 50 లేదా 60 ఏళ్ల వ్యక్తుల వరకు అందరూ తీసుకోవచ్చు. పాలసీ మెచ్యూరిటీ వయస్సు 18 ఏళ్లు నుంచి 75 లేదా 85 ఏళ్ల వరకు ఉంటుంది. బీమా చేసిన ప్రాథమిక మొత్తాన్ని (సమ్ అష్యూర్డ్) అనుసరించి ఈ గరిష్ఠ వయోపరిమితి ఆధారపడి ఉంటుంది.
- 90 రోజుల వయస్సు నుంచి 50 ఏళ్లలోపు వారికి వార్షిక ప్రీమియంపై 7 నుంచి 10 రెట్లు ప్రాథమిక హామీ మొత్తం (సమ్ అష్యూరెన్స్) ఇస్తారు.
- 51 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారికి సమ్ అష్యూరెన్స్ అనేది 7 రెట్లు ప్రాథమిక హామీ మొత్తం (సమ్ అష్యూరెన్స్) ఇస్తారు.
పాలసీ టర్మ్
LIC Index Plus Policy Term :ఈ ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీని 10 ఏళ్లు, 15 ఏళ్లు, 25 ఏళ్ల కాలవ్యవధులతో తీసుకోవచ్చు.
ప్రీమియం
LIC Index Plus Policy Premium :ఈ ఎల్ఐసీ ప్లస్ పాలసీ ప్రీమియంలను నెల, త్రైమాసికం, 6 నెలలు, 12 నెలల వ్యవధులలో చెల్లించవచ్చు. కనిష్ఠంగా అయితే నెలకు రూ.2,500; మూడు నెలలకు రూ.7,500; అర్థ సంవత్సరానికి రూ.15,000; సంవత్సరానికి రూ.30,000 చొప్పున ప్రీమియం చెల్లించవచ్చు. గరిష్ఠ ప్రీమియంపై ఎలాంటి పరిమితులు లేవు.
ఈ ఎల్ఐసీ ప్లస్ పాలసీ తీసుకున్నవారు తమ ప్రీమియంలో కొంత మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు రెండు ఆప్షన్లు కూడా ఉన్నాయి. అవి: