Hyderabad Tops In IT Job Postings :దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు నెమ్మదిస్తున్నా, హైదరాబాద్ మాత్రం జోరు కొనసాగిస్తోంది. ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో 41.5 శాతం ఐటీ నియామకాలు పెరిగాయి. ఈ మేరకు ఇండీడ్ అనే ఆన్లైన్ జాబ్ సెర్చింగ్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం హైదరాబాద్ తర్వాతి స్థానంలో బెంగళూరు ఉంది. ఇక్క 24 శాతం ఐటీ నియామకాలు పెరిగినట్లు ఇండీడ్ తన నివేదికలో పేర్కొంది. ఐటీ నిపుణుల కోసం అగ్ర గమ్యస్థానాలుగా, ఈ నగరాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇండీడ్ నివేదిక ప్రతిబింబిస్తోంది.
ఇండీడ్ వెబ్సైట్ జాబ్ క్లిక్‌లలో కూడా హైదరాబాద్, బెంగళూరు గణనీయమైన వృద్ధి సాధించాయి. హైదరాబాద్‌లో పనిచేసేందుకు 161 శాతం ఉద్యోగార్థులు ఆసక్తి కనబర్చారు. ఇక బెంగళూరుపై 80శాతం మంది ఆసక్తి చూపినట్లు నివేదిక పేర్కొంది. అయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అనిశ్చితి కారణంగా నియామకాలు చేపట్టేందుకు ఐటీ కంపెనీలు ఆకస్తి చూపించడం లేదని తెలిపింది. ఈ కారణాల వల్ల దేశవ్యాప్తంగా ఐటీ రిక్రూట్మెంట్స్ 3.6శాతం తగ్గుముఖం పట్టాయని ఇండీడ్ వెల్లడించింది.