How To Improve CIBIL Score : బ్యాంకులు లేదా రుణ సంస్థలు లోన్ మంజూరు చేసేముందు కచ్చితంగా క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. ఆ స్కోర్ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీతోనే రుణం మంజూరు చేస్తాయి. లోన్ ప్రక్రియ కూడా వేగంగా ముగుస్తుంది. అందుకే సరైన ప్లానింగ్‌తో సిబిల్/ క్రెడిట్ స్కోర్‌ను ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఎప్పటికప్పుడు బిల్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఉండాలి. అప్పుడే CIBIL స్కోర్ మెరుగుపరుడుతుంది. అందుకే క్రెడిట్ కార్డ్ బిల్స్, ఈఎంఐలు, నెలవారి బిల్స్‌ను సమయానికి కట్టే విధంగా ఆటోమేటిక్ పేమెంట్ రిమైండర్స్ పెట్టుకోవాలి.
- మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR)ను బాగా తగ్గించాలి. మీ క్రెడిట్ లిమిట్‌కు అనుకూలంగా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో CURను ఎప్పుడూ 30 శాతం కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి.
- మీరు లోన్ త్వరగా తీసుకోవాలని అనుకున్నప్పుడు, కొత్త క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయకూడదు. ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది.
- అన్ని రకాల క్రెడిట్ అకౌంట్స్‌ను ఒకే చోట ఉంచడం మంచిది. దీని వల్ల క్రెడిట్ నిర్వహణ చక్కగా చేసుకోవచ్చు. ఫలితంగా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. అంతేకాదు మీరు సకాలంలో అప్పు తీర్చగలరు అని అనుకున్నప్పుడే రుణాలు తీసుకోవడం మంచిది.
- క్రెడిట్ స్కోర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలా బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.
- క్రెడిట్ రిపోర్ట్‌లో నెగిటివ్ అంశాలు ఉంటే, ముందు వాటిపైన శ్రద్ద చూపించాలి. ఒకవేళ లేట్ పేమెంట్స్ వలన అటువంటి రిపోర్ట్ వస్తే, సదరు సంస్థతో పేమెంట్ ప్లాన్ గురించి చర్చించి, రుణ చెల్లింపు తేదీలను మార్చుకోవాలి.
- పాత అకౌంట్స్ అవసరం లేదు కదా అని వాటిని క్లోజ్ చేయవద్దు. పాత అకౌంట్స్ క్లోజ్ చేయడం వలన మీ క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. అందుకే మంచి క్రెడిట్ హిస్టరీ కోసం వాటిని ఉంచడం మంచిది.
- ఒకవేళ క్రెడిట్ స్కోర్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే, క్రెడిట్ కౌన్సిలింగ్ ఏజెన్సీని కానీ, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను కానీ సంప్రదించండి. వాళ్లు మీకు క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ గురించి వ్యక్తిగతంగా సలహాలు ఇస్తారు.
నోట్ : క్రెడిట్ స్కోర్‌ను ఒకేసారి పెంచుకోవడానికి వీలుపడదు. దీనికి కచ్చితంగా కొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది. కనుక పైన చెప్పిన సూచనలు అన్నీ పాటించి మీ క్రెడిట్ స్కోర్‌తో పాటు, మీ ఆర్ధిక స్థితిని కూడా మెరుగుపరుచుకోండి.