How to Choose Right Tyres for Cars in Telugu: కారులో అత్యంత ముఖ్యమైన భాగాల్లో టైరు ఒకటి. వాహనం యాక్సిలరేషన్, బ్రేకింగ్, హ్యాండ్లింగ్ క్వాలిటీని పెంచడానికి మంచి టైర్‌లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. నాణ్యమైన టైర్లు మైలేజ్ విషయంలోనూ హెల్ప్ చేస్తాయి. మరి.. మీ వెహికల్ కోసం సరైన టైర్లను ఎలా ఎంచుకోవాలో మీకు తెలుసా?
2024లో లాంఛ్ అయిన టాప్-10 బైక్స్ & స్కూటర్స్ ఇవే!
ట్యూబ్‌లెస్ టైర్లు :టైర్లను ఎంచుకునే సమయంలో మీరు ట్యూబ్ టైప్ టైర్‌ల కంటే చాలా అధునాతనమైన సురక్షితమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి ట్యూబ్‌లెస్ టైర్లను ఎంచుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. ట్యూబ్‌లెస్ టైర్లు.. ఉక్కు చక్రాలు తుప్పు పట్టకుండా లోపల యాంటీ-రస్ట్ కోటింగ్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి మంచి పనితీరును కనబరుస్తాయని చెబుతున్నారు. ఈ టైర్లను బిగించడానికి అల్లాయ్ వీల్స్ కలిగి ఉండాల్సిన పని లేదు.
టైర్ సైజ్ :కొత్త టైర్లను కొనుగోలు చేసేటప్పుడు.. వాటి సైజ్‌పై దృష్టి పెట్టాలి. టైర్ పరిమాణాన్ని మూడు పార్ట్స్‌గా విభజించవచ్చు. అంచు పరిమాణం, టైర్ ట్రెడ్ వెడల్పు, సైడ్‌వాల్స్ ఎత్తు. టైర్‌ను ఎంచుకునేటప్పుడు, మీరు కొనుగోలు చేస్తున్న టైర్ సైజు.. మీరు ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న రిమ్‌తో సమానంగా ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే ట్రెడ్ వెడల్పును చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. అయితే.. ట్రెడ్ వెడల్పు మీరు డ్రైవింగ్ చేస్తున్న వాహనంపై ఆధారపడి ఉంటుంది.