తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 9:36 AM IST

Updated : Nov 13, 2024, 10:06 AM IST

Gold Rate Today November 13th 2024 :దేశంలో బంగారం స్వలంగా తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.77,800గా ఉండగా, బుధవారం నాటికి రూ.240 తగ్గి రూ.77,560గా ఉంది. మంగళవారం కిలో వెండి ధర రూ.91,740గా ఉండగా, బుధవారం నాటికి రూ.720 పెరిగి రూ.92,460గా ఉంది.

  • Gold Price In Hyderabad November 13th 2024 :హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.77,560గా ఉంది. కిలో వెండి ధర రూ.92,460గా ఉంది.
  • Gold Price In Vijayawada November 13th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,560గా ఉంది. కిలో వెండి ధర రూ.92,460గా ఉంది.
  • Gold Price In Visakhapatnam November 13th 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,560గా ఉంది. కిలో వెండి ధర రూ.92,460ఉంది.
  • Gold Price In Proddatur November 13th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,560గా ఉంది. కిలో వెండి ధర రూ.92,460గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price November 13th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు తగ్గాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2619 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 6 డాలర్లు తగ్గి 2613 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.00 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates November 13th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు క్రమంగా తమ నిధులను మార్కెట్‌ నుంచి బయటకు తీసుకెళ్లడం, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఆటో స్టాక్‌ల ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 160 పాయింట్లు తగ్గి 78,515 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు తగ్గి 23,798 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- ఎన్​టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మెటార్స్, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, టాటా స్టాల్‌, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌

రూపాయి విలువ
Rupee Open November 13th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.40గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices November 13th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Nov 13, 2024, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details