తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 9:28 AM IST

ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today June 28

Gold Rate Today June 28, 2024 : దేశంలో బంగారం, వెండి పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today June 28
Gold Rate Today June 28 (GettyImages)

Gold Rate Today June 28, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ. 73,300 ఉండగా, శుక్రవారం నాటికి రూ.446 పెరిగి రూ.73,746కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.89,170 ఉండగా, శుక్రవారం నాటికి రూ.658 పెరిగి రూ.89828కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad June 28, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,746గా ఉంది. కిలో వెండి ధర రూ.89,828గా ఉంది.
  • Gold Price In Vijayawada June 28, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,746గా ఉంది. కిలో వెండి ధర రూ.89,828గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam June 28, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,746గా ఉంది. కిలో వెండి ధర రూ.89,828గా ఉంది.
  • Gold Price In Proddatur June 28, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,746గా ఉంది. కిలో వెండి ధర రూ.89,828గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price June 28, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్​ ధర 2301 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 21 డాలర్లు పెరిగి 2321 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.6 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 28, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.50,50,000
ఇథీరియం రూ.2,65,000
టెథర్ రూ.79.31
బైనాన్స్ కాయిన్ రూ.48,539
సొలోనా రూ.12,255

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today June 28, 2024 :దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 308.49 పాయింట్ల లాభంతో 79,551 ఆల్​ టైమ్​ హై రికార్డ్​ నమోదు చేసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 103.75 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : 30 సెన్సెక్స్ కంపెనీల్లో సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్, నెస్లే

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ

రూపాయి విలువ
Rupee Open June 28, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 8 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.37గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices June 28, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices June 28, 2024 :అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.64 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 85.07 డాలర్లుగా ఉంది.

చైల్డ్& అడల్ట్ సేఫ్టీలో 'టాటా' అదుర్స్- 5 స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఏవంటే? - 5 Star Rating Tata Cars

మీ PF​ బ్యాలెన్స్​ను NPSకు బదిలీ చేసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - Can I Switch From EPF To NPS

ABOUT THE AUTHOR

...view details