Gold Rate Today December 31st, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,900 ఉండగా, మంగళవారం నాటికి రూ.570 తగ్గి రూ.78,330కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.89,989 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,978 తగ్గి రూ.88,011కు చేరుకుంది.
- Gold Price In Hyderabad December 31st, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,330గా ఉంది. కిలో వెండి ధర రూ.88,011గా ఉంది.
- Gold Price In Vijayawada December 31st, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,330గా ఉంది. కిలో వెండి ధర రూ.88,011గా ఉంది.
- Gold Price In Visakhapatnam December 31st, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,330గా ఉంది. కిలో వెండి ధర రూ.88,011గా ఉంది.
- Gold Price In Proddatur December 31st, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,330గా ఉంది. కిలో వెండి ధర రూ.88,011గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price December 31st, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2,627 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 21 డాలర్లు తగ్గి 2,606 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.90 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today December 31st, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలివెళ్తుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 508 పాయింట్లు నష్టపోయి 77,730 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 131 పాయింట్లు కోల్పోయి 23,513 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న షేర్లు : కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, మారుతి సుజుకి, రిలయన్స్, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్
- నష్టాల్లో ఉన్న షేర్లు : టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, జొమాటో, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఐటీసీ
రూపాయి విలువ
Rupee Value December 31st, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 9 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.85.61గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices December 31st, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధరలు
Crude Oil Prices December 31st, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.30 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 74.39 డాలర్లుగా ఉంది.