తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

గుడ్ న్యూస్ - తగ్గిన గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate
Gold Rate (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Updated : 5 hours ago

Gold Rate Today December 16th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.79,975 ఉండగా, సోమవారం నాటికి రూ.975 తగ్గి రూ.79,000కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.92,759 ఉండగా, సోమవారం నాటికి రూ.1,203 తగ్గి రూ.91,556కు చేరింది.

  • Gold Price In Hyderabad December 16th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.79,000గా ఉంది. కిలో వెండి ధర రూ.91,556గా ఉంది.
  • Gold Price In Vijayawada December 16th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,000గా ఉంది. కిలో వెండి ధర రూ.91,556గా ఉంది.
  • Gold Price In Visakhapatnam December 16th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,000గా ఉంది. కిలో వెండి ధర రూ.91,556గా ఉంది.
  • Gold Price In Proddatur December 16th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,000గా ఉంది. కిలో వెండి ధర రూ.91,556గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price December 16th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు తగ్గాయి. శుక్రవారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,690 డాలర్లగా ఉండగా, సోమవారం నాటికి 36 డాలర్లు తగ్గి 2,654 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.54 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today December 16th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. దీనికితోడు హోల్‌సేల్ ప్రైస్‌ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) డేటా విడుదల కానున్న నేపథ్యంలో మదుపరులు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 282 పాయింట్లు నష్టపోయి 81,819 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 72 పాయింట్లు కోల్పోయి 24,696 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న షేర్లు : ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, రిలయన్స్‌, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్‌, ఆల్ట్రాటెక్ సిమెంట్‌, ఏసియన్ పెయింట్స్‌
  • నష్టాల్లో ఉన్న షేర్లు : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌

రూపాయి విలువ
Rupee Value December 16th 2024 :అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.84.83 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices December 16th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధరలు
Crude Oil Prices December 16th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.31 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 74.26 డాలర్లుగా ఉంది.

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details