NPS Scheme Benefits : మీరు భవిష్యత్ కోసం మంచి ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడదామని అనుకుంటున్నారా? రిటైర్మెంట్ తరువాత రూ.5 కోట్ల నిధితోపాటు, నెలకు రూ.1 లక్ష చొప్పున పెన్షన్ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.
National Pension Scheme : భారతదేశంలో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) అనే బెస్ట్ స్కీమ్ ఉంది. ఇది మంచి పెట్టుబడి మార్గంగానూ, పదవీ విరమణ ప్రణాళికగానూ ఉపయోగపడుతుంది. ఈ పథకం వల్ల మంచి ఆదాయం మాత్రమే కాదు, పన్ను ప్రయోజనాలు కూడా చేకూరతాయి. అయితే 60 ఏళ్ల వయస్సు దాటిన తరువాత లేదా పదవీ విరమణ చేసిన తరువాత, ఎన్‌పీఎస్ స్కీమ్ ద్వారా పొందిన ఆదాయంలో కనీసం 40 శాతాన్ని యాన్యుటీలోకి మార్చాలి. దీని వల్ల సదరు వ్యక్తికి జీవితాంతం పెన్షన్ రూపంలో ఆదాయం వస్తూ ఉంటుంది. మిగిలిన 60 శాతాన్ని ఏక మొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకే ఈ పథకం గురించి ఒక చిన్న ఉదాహరణ ద్వారా వివరంగా తెలుసుకుందాం.
ఉదాహరణకు : ఒక 27 ఏళ్ల వ్యక్తి నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టి, తనకు 60 ఏళ్లు వచ్చే వరకు దానిని కొనసాగించాడని అనుకుందాం. అప్పుడు తన లైఫ్ గోల్ అయిన నెలకు రూ.1 లక్ష పెన్షన్, రూ.5 కోట్ల రిటైర్మెంట్ నిధి సంపాదించగలడా? లేదా? అనేది లెక్కలేసి చూద్దాం.
- పెట్టుబడిదారుని వయస్సు = 27 సంవత్సరాలు
- పెట్టుబడి కాలం = 33 ఏళ్లు (27 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు)
- సంవత్సరానికి పెట్టుబడి = రూ.2,00,000
- రాబడి రేటు (అంచనా) = సంవత్సరానికి 10%
- యాన్యుటీ కొనుగోలు - స్కీమ్ ద్వారా పొందిన నిధిలో 40 శాతం
- ఆశించిన యాన్యుటీ రేటు - సంవత్సరానికి 6%
మొత్తం పెట్టుబడి (Total Investment)
∴ మొత్తం పెట్టుబడి = రూ.2,00,000 X 33 ఏళ్లు = రూ.65,99,736
ఎన్‌పీఎస్ స్కీమ్ ద్వారా పోగయ్యే మొత్తం నిధి (Accumulated Corpus)
సంవత్సరానికి 10 శాతం రాబడి వచ్చింది అని అనుకుంటే, 33 ఏళ్ల తరువాత పొగయ్యే మొత్తం నిధి (Accumulated Corpus) సుమారుగా రూ.5,19,15,841 అవుతుంది.
మొత్తం రాబడి
(మొత్తం రాబడి = మొత్తం నిధి - మొత్తం పెట్టుబడి) ఈ సూత్రం ప్రకారం
∴ మొత్తం రాబడి = రూ.5,19,15,841 - రూ.65,99,736 = రూ.4,53,16,105
యాన్యుటీ కొనుగోలు
ఎన్‌పీఎస్ ఖాతాదారునికి 60 ఏళ్లు దాటిన తరువాత, లేదా అతను రిటైర్ అయిన తరువాత వచ్చే మొత్తం కార్పస్‌లో 40 శాతాన్ని తప్పనిసరిగా యాన్యుటిగా మార్చాలి.
∴ యాన్యుటీ కార్పస్ = 40% of రూ.5,19,15,841 = రూ.2,07,66,336
∴ రిటైర్మెంట్ కార్పస్ = 60% of రూ.5,19,15,841 = రూ.3,11,49,505 (ఈ రిటైర్మెంట్ కార్పస్‌ను పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు.)
నెలవారీ పెన్షన్
యాన్యుటీ రేటు 6 శాతం అని అనుకుంటే, నెలవారీ పెన్షన్ ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం.
- యాన్యువల్ పెన్షన్ = రూ.2,07,66,336 X 6% = రూ.12,45,980
- నెలవారీ పెన్షన్ = రూ.12,45,980/12 = రూ.1,03,832
NPS Scheme Tax Benefits
- ఎన్‌పీఎస్ స్కీమ్‌లో టైర్-1, టైర్-2 అకౌంట్స్ ఉంటాయి. వీటికి ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి.
- ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ 80సీసీఈ ప్రకారం, ఎన్‌పీఎస్ టైర్-1 ఖాతాదారులు తమ కంట్రిబ్యుషన్‌పై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు.
- ఖాతాదారునికి 60 ఏళ్లు దాటిన తరువాత లేదా రిటైర్మెంట్ తర్వాత ఎన్‌పీఎస్ కార్పస్ నుంచి 60 శాతాన్ని ఏకమొత్తంగా ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
- యాన్యుటీ కొనుగోలుకు ఉపయోగించే 40% మొత్తంపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే యాన్యుటీ నుంచి వచ్చే ఆదాయంపై మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుంది.
OPS Vs NPS Vs UPS- ఉద్యోగులకు ఈ మూడింట్లో ఏ పెన్షన్ స్కీమ్ బెటర్? - Govt Pension Schemes