ETV Bharat / business

బైక్ లవర్స్​కు బ్యాడ్ న్యూస్- ఆ మోడల్స్ ఇక మార్కెట్లో ఉండవుగా! - HERO MOTOCORP

హీరో మోటాకార్ప్ కీలక నిర్ణయం- మూడు మోడళ్లకు గుడ్​బై.. ఒకప్పటి పాపులర్ బైక్​కు​​ కూడా!

EXTREME 200S 4V
EXTREME 200S 4V (Photo Credit- Hero MotoCorp)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 15, 2024, 7:43 PM IST

Hero MotoCorp Discontinues Three Models Bikes: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన మూడు మోటార్ సైకిళ్ల ప్రొడక్షన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 200 సీసీ కేటగిరీలో రెండు, కమ్యూటర్‌ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక బైక్​కు గుడ్​బై చెప్పింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లోనూ ఆయా మోడళ్లను తొలగించింది. ఇంతకీ కంపెనీ తొలగించిన ఆ మూడు మోడల్ బైక్స్​ ఏంటో తెలుసుకుందాం రండి.

కంపెనీ గుడ్​బై చెప్పిన బైక్ మోడల్స్ ఇవే: హీరో మోటోకార్ప్.. 200సీసీ కేటగిరీలో 'ఎక్స్‌ట్రీమ్‌ 200S 4v', హీరో 'ఎక్స్‌పల్స్‌ 200T' మోడళ్లతో పాటు, కమ్యూటర్‌ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ప్యాషన్‌ ఎక్స్‌టెక్‌' బైక్‌ కు కూడా గుడ్‌బై చెప్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో 'ప్యాషన్‌ ఎక్స్‌టెక్‌'.. ఒకప్పుడు స్ప్లెండర్‌తో సమానంగా ఆదరణకు నోచుకున్న పాపులర్‌ బైక్‌. దీన్ని కూడా కంపెనీ తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

కారణం ఇదే!: ఈ బైక్​ల సేల్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం కారణంగానే ఈ డెషిషన్ తీసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కాగా హీరో మోటోకార్ప్.. 200సీసీ సెగ్మెంట్‌లో 'ఎక్స్‌పల్స్‌ 200 4v', 'ఎక్స్‌పల్స్‌ 200T', 'ఎక్స్‌ట్రీమ్‌ 200S 4v' బైక్స్​ను విక్రయిస్తోంది. అయితే ఇందులో 'ఎక్స్‌పల్స్‌ 200 4v' తప్ప మిగిలిన రెండు మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో ఈ సెగ్మెంట్​లో ప్రస్తుతం 'ఎక్స్‌పల్స్‌ 200 4v' మాత్రమే అందుబాటులో ఉంది. కంపెనీ దాన్ని కూడా త్వరలోనే నిలిపివేసే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే దాని ప్లేస్​లో 210 సీసీలో కొత్త 'ఎక్స్‌పల్స్‌'తో రీప్లేస్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక కమ్యూటర్‌ సెగ్మెంట్‌లో ఉత్పత్తి నిలిపివేసిన 'ప్యాషన్‌ ఎక్స్‌టెక్‌' మోడల్‌ డ్రమ్‌, డిస్క్‌ వేరియంట్లో లభిస్తోంది. 113 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ మోటార్​సైకిల్.. 4 స్పీడ్‌ గేర్‌బాక్స్‌లతో బడ్జెట్‌ ఫ్రెండ్లీ బైక్​గా గుర్తింపుపొందింది. అయితే కంపెనీ.. ప్యాషన్‌ పేరుతో భవిష్యత్‌లో కొత్తగా ఏవైనా బైక్‌లు తీసుకొస్తుందో లేదో చూడాలి.

మెర్సిడెస్​ నుంచి లగ్జరీ 5-సీటర్ బెంజ్ - దేశంలోనే ఏ EVకి లేనంత అతిపెద్ద సెల్ కెపాసిటీతో..!

పవర్​ఫుల్ ప్రాసెసర్​తో పోకో కొత్త స్మార్ట్​ఫోన్- లాంఛ్​కు ముందే పనితీరు, స్పెసిఫికేషన్ల లిస్టింగ్ రివీల్!

గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్- ఇది అలాంటిలాంటిది కాదుగా.. అంచనాలకు మించి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.